Breaking News

కియా కొత్త సీఎన్‌జీ కార్లు వచ్చేశాయ్‌.. ధరల్లో భారీ తేడా!

Published on Sun, 09/20/2026 - 09:53

కియా ఇండియా తన పాపులర్‌ ఎమ్‌పీవీలైన క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్‌లో ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ సీఎన్‌జీ వేరియంట్లను భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. క్యారెన్స్‌ సీఎన్‌జీ ప్రారంభ ధర  రూ.12.12 లక్షలు, క్యారెన్స్ క్లావిస్‌ సీఎన్‌జీ ధర రూ.12.39 లక్షలు (ఎక్స్‌-షోరూమ్‌)గా నిర్ణయించింది. ఏడు సీట్ల ఎమ్‌పీవీ విభాగంలో తక్కువ ఇంధన వ్యయాన్ని కోరుకునే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుని ఈ వేరియంట్లను ప్రవేశపెట్టింది.

మూడు వేరియంట్లు.. ధరలు ఇలా..

క్యారెన్స్‌ సీఎన్‌జీని  ప్రీమియం (ఓ) ట్రిమ్‌లో మాత్రమే అందిస్తోంది. దీని ధర రూ.12.12 లక్షలు. క్యారెన్స్ క్లావిస్‌ సీఎన్‌జీని హెచ్‌టీఈ, హెచ్‌టీఈ (ఓ) అనే రెండు వేరియంట్లలో తీసుకొచ్చింది. హెచ్‌టీఈ ధర రూ.12.39 లక్షలు, హెచ్‌టీఈ (ఓ) ధర రూ.13.35 లక్షలు. సంబంధిత పెట్రోల్‌-మాన్యువల్‌ వేరియంట్లతో పోలిస్తే సీఎన్‌జీ మోడళ్ల ధర సుమారు రూ.1 లక్ష అధికంగా ఉంది.

ఈ విభాగంలో మారుతి ఎర్టిగా సీఎన్‌జీ ధర రూ.10.94 లక్షల నుంచి రూ.12 లక్షల వరకు ఉండగా, టయోటా రూమియన్ సీఎన్‌జీ రూ.11.69 లక్షల నుంచి, మారుతి ఎక్స్ఎల్6 సీఎన్‌జీ రూ.12.61 లక్షల నుంచి ప్రారంభమవుతున్నాయి.

1.5 లీటర్‌ ఇంజిన్‌.. 6-స్పీడ్‌ మాన్యువల్‌

క్యారెన్స్, క్యారెన్స్ క్లావిస్‌ సీఎన్‌జీ రెండింటిలోనూ కియా  1.5 లీటర్‌ స్మార్ట్‌స్ట్రీమ్‌ నేచురల్లీ ఆస్పిరేటెడ్‌ పెట్రోల్‌ ఇంజిన్‌నే ఉపయోగించింది. సీఎన్‌జీకి అనుగుణంగా ఇంజిన్‌ను రీకాలిబ్రేట్‌ చేసింది. సీఎన్‌జీ మోడ్‌లో ఈ ఇంజిన్‌ పెట్రోల్‌ వెర్షన్‌తో పోలిస్తే 19 బీహెచ్‌పీ తక్కువ పవర్‌, 21 ఎన్ఎం తక్కువ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. 6-స్పీడ్‌ మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో మాత్రమే సీఎన్‌జీ వేరియంట్లు లభిస్తాయి. పెట్రోల్‌ మోడళ్లలో లభించే ఐఎంటీ, డీసీటీ ఆప్షన్లు సీఎన్‌జీ వెర్షన్లలో లేవు.

అయితే, ఈ కొత్త సీఎన్‌జీ వేరియంట్లకు సంబంధించిన అధికారిక మైలేజీ గణాంకాలను కియా ఇంకా వెల్లడించలేదు. పెట్రోల్‌ సిస్టమ్‌కు అదనంగా 60 లీటర్ల సీఎన్‌జీ ట్యాంక్‌ను అమర్చింది. 4.2 అంగుళాల కలర్‌ టీఎఫ్‌టీ ఎంఐడీలో ఫ్యూయల్‌-ఛేంజ్‌ స్విచ్‌తో పాటు సీఎన్‌జీకి ప్రత్యేకమైన డిస్టెన్స్‌-టు-ఎంప్టీ సమాచారం ఉంటుంది.

తగ్గిన బూట్‌ స్పేస్‌

సీఎన్‌జీ ట్యాంక్‌ను రెండు మోడళ్లలోనూ బూట్‌ ఫ్లోర్‌ కింద అమర్చారు. దీంతో మూడు వరుసల సీట్లు వినియోగంలో ఉన్నప్పుడు బూట్‌ సామర్థ్యం 216 లీటర్ల నుంచి 116 లీటర్లకు తగ్గుతుంది. అయితే స్పేర్‌ వీల్‌ను అండర్‌బాడీ కిందనే ఉంచారు.

సీఎన్‌జీ ట్యాంక్‌ కారణంగా పెరిగిన బరువుకు అనుగుణంగా సస్పెన్షన్‌ను రీట్యూన్‌ చేసినట్లు కియా తెలిపింది. ముందు డిస్క్‌ బ్రేక్‌లను 16 అంగుళాల యూనిట్లకు అప్‌గ్రేడ్‌ చేసి, ఆర్‌16 వీల్స్‌ను కూడా అందించింది. సీఎన్‌జీపై డ్రైవబిలిటీ మెరుగ్గా ఉండేలా ఇంజిన్‌ కంట్రోల్‌ను సైతం సర్దుబాటు చేసింది.

సీఎన్‌జీకి సంబంధించిన ఈ మార్పులు మినహా, మిగిలిన ఫీచర్ల విషయంలో సంబంధిత పెట్రోల్‌ వేరియంట్లతో సమానమైన పరికరాలను అందిస్తోంది. దీంతో మారుతి సుజుకి, టయోటా తర్వాత ఏడు సీట్ల ఎమ్‌పీవీ విభాగంలో ఫ్యాక్టరీ ఫిట్టెడ్‌ సీఎన్‌జీ ఆప్షన్‌ను అందిస్తున్న మరో సంస్థగా కియా నిలిచింది.

ఇదీ చదవండి: కియా నుంచి భారీ ఎలక్ట్రిక్‌ వ్యాన్‌ వచ్చేస్తోంది..

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)