Breaking News

ఫెడ్‌ రేట్ల పెంపు.. పసిడి అంచనాలు తారుతారు!

Published on Sun, 09/20/2026 - 08:31

అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ అనూహ్యంగా వడ్డీ రేట్లను పెంచినప్పటికీ బంగారంపై గోల్డ్‌మన్‌ శాక్స్‌ దీర్ఘకాలిక సానుకూల అంచనాను కొనసాగించింది. అయితే సమీప కాలంలో ధరల పెరుగుదల వేగం తగ్గొచ్చని పేర్కొంది. సెప్టెంబర్‌ 18న విడుదల చేసిన విశ్లేషణలో బ్యాంక్‌ విశ్లేషకురాలు లీనా థామస్‌.. 2027 చివరినాటికి బంగారం ఔన్సు ధర 4,400 డాలర్లకు చేరుతుందన్న అంచనాను కాకుండా, 5,400 డాలర్ల లక్ష్యాన్ని పునరుద్ఘాటించారు.

అదే సమయంలో 2026 ఏడాది చివరి లక్ష్యాన్ని మాత్రం తగ్గించారు. గతంలో 4,900 డాలర్లుగా ఉన్న అంచనాను తాజాగా 4,650 డాలర్లకు సవరించారు. అంటే సమీప కాలంలో అమెరికా ద్రవ్య విధానం బంగారంపై కొంత ఒత్తిడి చూపుతుందని గోల్డ్‌మన్‌ భావిస్తోంది. సెప్టెంబర్‌ 18 నాటికి అంతర్జాతీయ స్పాట్‌ గోల్డ్‌ ధర సుమారు 4,350 డాలర్ల ప్రాంతంలో ఉండగా, కొత్త 2026 లక్ష్యం దానికంటే ఇంకా పై స్థాయిలోనే ఉంది.

మరోసారి రేట్ల పెంపునకు అవకాశం

సెప్టెంబర్‌ 16న ఫెడ్‌ కీలక వడ్డీ రేటును 25 బేసిస్‌ పాయింట్లు పెంచి 3.75–4 శాతం శ్రేణికి తీసుకెళ్లింది. 2023 తర్వాత అమెరికా కేంద్ర బ్యాంక్‌ రేట్లను పెంచడం ఇదే తొలిసారి. ద్రవ్యోల్బణం ఇంకా అధికంగానే ఉండటంతో ధరల స్థిరత్వాన్ని త్వరగా పునరుద్ధరించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఫెడ్‌ తెలిపింది.

ఈ పరిణామం తర్వాత గోల్డ్‌మన్‌ శాచ్స్‌ ఆర్థికవేత్తలు అక్టోబర్‌లో మరో 25 బేసిస్‌ పాయింట్ల పెంపు జరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. దీంతో అధిక వడ్డీ రేట్లు, పెరిగే బాండ్‌ ఈల్డ్స్‌, బలపడే డాలర్‌ వంటి అంశాలు తక్కువ కాలంలో బంగారంపై ఒత్తిడి తీసుకురావచ్చు.

సెంట్రల్‌ బ్యాంకుల కొనుగోళ్లే కీలకం

అయితే గోల్డ్‌మన్‌ శాక్స్‌ ప్రకారం బంగారం దీర్ఘకాలిక కథ మారలేదు. అధిక వడ్డీ రేట్ల ప్రభావాన్ని కేంద్ర బ్యాంకుల బలమైన బంగారం కొనుగోళ్లు కొంతవరకు భర్తీ చేయగలవని బ్యాంక్‌ అంచనా వేస్తోంది. ప్రస్తుతం కేంద్ర బ్యాంకుల కొనుగోళ్లు నెలకు సుమారు 91 టన్నుల స్థాయిలో ఉన్నాయని, 2022కు ముందు ఉన్న సగటు నెలవారీ కొనుగోళ్లతో పోలిస్తే ఇది గణనీయంగా ఎక్కువని పేర్కొంది. 2027 చివరి వరకు బంగారం ధరలో గోల్డ్‌మన్‌ అంచనా వేస్తున్న పెరుగుదలలో దాదాపు మొత్తం ఈ నిర్మాణాత్మక డిమాండ్‌ నుంచే వస్తుందని తెలిపింది.

ఈటీఎఫ్‌ల (ETF) డిమాండ్‌ కూడా కీలకమే. వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ ప్రకారం ఆగస్టులో ప్రపంచ గోల్డ్‌ ఈటీఎఫ్‌ల్లోకి 18 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. దీంతో గోల్డ్‌ ఈటీఎఫ్‌ల మొత్తం ఆస్తులు 16 శాతం పెరిగి 615 బిలియన్‌ డాలర్లకు, వాటి వద్ద ఉన్న బంగారం 4,189 టన్నుల రికార్డు స్థాయికి చేరింది.

ముందున్న దారి..

గోల్డ్‌మన్‌ అంచనా ప్రకారం రేట్ల పెంపు బంగారం ర్యాలీని పూర్తిగా ముగించకపోవచ్చు. బదులుగా ర్యాలీ వేగాన్ని తగ్గించే అవకాశం ఉంది. సెప్టెంబర్‌ 2027 నుంచి మార్చి 2028 మధ్య ఫెడ్‌ మూడు సార్లు రేట్లు తగ్గించే అవకాశం ఉందని థామస్‌ పేర్కొన్నారు. అయితే ఫెడ్‌ అంచనాల కంటే మరింత కఠినమైన ద్రవ్య విధానాన్ని అవలంబిస్తే బంగారంలో సాధారణం కంటే తీవ్ర దిద్దుబాటు వచ్చే ప్రమాదం కూడా ఉందని గోల్డ్‌మన్‌ హెచ్చరించింది.

ఇక గోల్డ్‌మన్‌ ఆగస్టు 28న విడుదల చేసిన తన గత విశ్లేషణలో 2026 చివరి బంగారం లక్ష్యాన్ని 4,900 డాలర్లుగా ఉంచింది. తాజా ఫెడ్‌ పరిణామాల నేపథ్యంలో దాన్ని 4,650 డాలర్లకు తగ్గించినప్పటికీ, 2027 లక్ష్యాన్ని 5,400 డాలర్ల వద్ద కొనసాగించడం ద్వారా దీర్ఘకాలికంగా బంగారంపై తన సానుకూల దృక్పథాన్ని మాత్రం మార్చలేదని స్పష్టమవుతోంది.

ఇదీ చదవండి: స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌కు యూపీఐ చార్జీల ఎఫెక్ట్‌.. ఎంత?

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)