Breaking News

బంపరాఫర్.. ఐఫోన్ కొనుగోలుపై రూ.43 వేలు తగ్గింపు!

Published on Sat, 09/19/2026 - 15:03

యాపిల్ తన ఐఫోన్ 18ను మార్కెట్లో లాంచ్ చేసిన తరువాత.. ఐఫోన్ 17 కొనుగోలుపై ఫ్లిప్‌కార్ట్‌ భారీ తగ్గింపును అందిస్తోంది. ఇందులో ఎక్స్ఛేంజ్ ఆఫర్, సూపర్‌కాయిన్ ప్రయోజనం, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌ వంటివి ఉన్నాయి.

ఫ్లిప్‌కార్ట్‌లో.. తెలుపు రంగు 'ఐఫోన్ 17' 256జీబీ వేరియంట్ ధర రూ. 99,900. అందుబాటులో ఉన్న ఎక్స్ఛేంజ్ ఆఫర్, సూపర్‌కాయిన్ ప్రయోజనం,ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ఆఫర్‌లను ఉపయోగించడం ద్వారా దీనిని రూ. 55,283కే కొనుగోలు చేయవచ్చు. అంటే రూ.43,717 తగ్గుతుందన్నమాట.

ప్రయోజనాలు ఇలా..
ఈ ఆఫర్‌లో ప్రధానమైన ప్రయోజనం ఎక్స్చేంజ్ ఆఫర్. యాపిల్ ఐఫోన్ 15ను ఎక్స్చేంజ్ చేస్తే గరిష్ఠంగా రూ.41,700 తగ్గింపు లభించనుంది. ఎక్స్చేంజ్ వాల్యూ అనేది మీ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అందరికీ తప్పకుండా రూ.41 వేలు ప్రయోజనం లభిస్తుందని అనుకోకూడదు.

అదనంగా సూపర్‌కాయిన్ ప్రయోజనం కింద రూ.7, ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ ఆఫర్ కింద 2,910 రూపాయల వరకు తగ్గింపు లభిస్తుంది. ఈ ప్రయోజనాలు పొందిన తరువాత ఐఫోన్ 17 మొబైల్‌ను 55,283 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు.

ప్రస్తుతం 256జీబీ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉన్నట్లు సమాచారం. 512 జీబీ వేరియంట్ స్టాక్‌లో లేదని ప్రొడక్ట్ పేజీలో కనిపిస్తోంది. తెలుపు రంగు మొబైల్ మీద మాత్రమే మీకు ప్రయోజనాలు లభించినప్పటికీ.. ఇతర రంగులు కూడా అందుబాటులో ఉన్నాయి. కొనుగోలుదారులకు సౌకర్యార్థం ఈఎంఐ ఎంపిక కూడా ఉంది. మూడు నెలల ఈఎంఐకి నెలకు సుమారు రూ.19,917 నుంచి ప్రారంభమవుతుంది.

ఇదీ చదవండి: జాబ్ చేస్తున్నారా.. జాగ్రత్త! కియోసాకి హెచ్చరిక

Videos

నామినేషన్ వేసి అవసరమైతే జైలుకు వెళ్తామయ్య.. రిపోర్టర్ కి పేర్ని నాని అదిరిపోయే రిప్లై

టీడీపీ నేతపై జర్నలిస్ట్ హిమబిందు సంచలన ఆరోపణలు

రాకాతో హాలీవుడ్ ను టార్గెట్ చేసిన అల్లు అర్జున్?

తెలంగాణలో నాలుగు రోజులు భారీ వర్షాలు..

గుంటూరులో మరో లాకప్ డెత్.. అడ్వకేట్ రజిని స్ట్రాంగ్ వార్నింగ్

వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఆరోపణలపై ప్రసన్న ఫైర్

చంద్రబాబుకు బిగ్ షాక్.. తిరుమల లడ్డూపై ఈడీ సంచలన ప్రకటన

పద్థతి మార్చుకో.. MLAపై రెచ్చిపోయిన చంద్రబాబు

నిండా ముంచేసిన లలితా జువెల్లరీ స్టాక్.. అసలేం జరిగిందంటే?

అమలాపురంలో భారీ పేలుడు.. ఇల్లు ధ్వంసం

Photos

+5

హాఫ్ శారీలో మలయాళ బ్యూటీ ప్రియా ప్రకాశ్ వారియర్ (ఫోటోలు)

+5

నాని ది ప్యారడైజ్ స్టైలిష్ లుక్‌.. (ఫోటోలు)

+5

గణేశుడి సన్నిధిలో విజయ్‌ దేవరకొండ..(ఫోటోలు)

+5

అందాల అషు.. (ఫోటోలు)

+5

కట్టుబాపు చీరలో కనువిందు చేస్తున్న కీర్తి సురేష్..(ఫోటోలు)

+5

ఎర్రచీరలో శోభిత ధూళిపాళ.. చూపుతిప్పుకోనివ్వని అందాలు (ఫోటోలు)

+5

గణపయ్య సన్నిధిలో అలియా భట్.. భక్తి క్షణాల ఫోటోలు

+5

బ్లాక్‌ డ్రెస్‌లో మరింత బ్యూటిఫుల్‌గా మృణాల్‌ ఠాకూర్‌ (ఫోటోలు)

+5

నెల్లూరులో భారీ వర్షం... నీట మునిగిన రోడ్లు (ఫొటోలు)

+5

తిరుమల : మోహినీ అవతారంలో శ్రీవారు.. మార్మోగుతున్న గోవింద నామస్మరణ (ఫొటోలు)