Audio Viral: టీడీపీ కార్యకర్తలకే పింఛన్లు
Breaking News
ఐదు నిమిషాల మీటింగ్.. టీమ్ మొత్తాన్ని తొలగించిన US కంపెనీ!
Published on Thu, 09/17/2026 - 17:15
టెక్నాలజీ పెరుగుతున్న సమయంలో ఉద్యోగుల తొలగింపులు సర్వ సాధారణం అయిపోయింది. ఇలాంటి తరుణంలో.. ఒక అమెరికన్ ఆర్థిక సంస్థ, కేవలం ఐదు నిమిషాల గూగుల్ మీట్ కాల్లో ఒక భారతీయ బృందంలోని కస్టమర్ సపోర్ట్ యూనిట్ మొత్తాన్ని తీసేసింది. దీనికి సంబంధించిన ఒక రెడ్దిట్ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతోంది.
ఉద్యోగి చేసిన రెడ్దిట్ పోస్టు ప్రకారం.. సుమారు 80 మంది సభ్యులతో ఉన్న మొత్తం భారతీయ కస్టమర్ సపోర్ట్ టీమ్‌ను ఒకేసారి ఉద్యోగాల నుంచి తొలగించారు. ఆ రోజు ఉద్యోగులను ఆపరేషన్ రీజన్స్ పేరుతో ఇంటి నుంచే పని చేయమని చెప్పినట్లు ఉద్యోగి తెలిపారు.
ఐదు నిమిషాల మీటింగ్
ఉద్యోగి వెల్లడించిన వివరాల ప్రకారం, నేను సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమైన షిఫ్ట్‌లో పని చేస్తున్నాను. దాదాపు మూడు గంటల తర్వాత, అంటే రాత్రి 9:30 సమయంలో ఉన్నతాధికారులు మొత్తం టీమ్‌ను గూగుల్ మీట్ కాల్‌కు ఆహ్వానించారు. కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే భారతీయ కస్టమర్ సర్వీస్ టీమ్ మొత్తం ఉద్యోగాలు కోల్పోయిందని ప్రకటించినట్లు ఉద్యోగి ఆరోపించారు. ఈ ప్రభావం దాదాపు 80 మంది ఉద్యోగులుపై పడిందని పేర్కొన్నారు.
భారతీయ టీమ్ నుంచి సంస్థకు ఆశించిన స్థాయిలో అవుట్‌పుట్ రావడం లేదని అందుకే ఉద్యోగులను తొలగిస్తున్నట్లు మేనేజ్మెంట్ చెప్పినట్లు ఉద్యోగి తెలిపారు. అయితే.. ఈ కారణాన్ని ఉద్యోగి తీవ్రంగా వ్యతిరేకించారు. భారతీయ ఉద్యోగులు ఉద్యోగ భద్రతపై ఆందోళనతో ఎక్కువ సమయం, ఎక్కువ శ్రమ పెట్టి పనిచేసేవారని, అయినప్పటికీ తమను సులభంగా తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇదీ చదవండి: మరో ఐదేళ్లు.. ఆయనే టాటా సన్స్ ఛైర్మన్!
సోషల్ మీడియా స్పందనలు
ఈ ఘటనపై సోషల్ మీడియాలో చాలామంది స్పందిస్తూ.. ఉద్యోగులను ఇలాంటి అకస్మాత్తుగా తొలగించడం బాధాకరమైన విషయమని పేర్కొన్నారు. ఉద్యోగం కోసం ఎంతో కష్టపడి పనిచేసిన తర్వాత, కేవలం కొన్ని నిమిషాల వీడియో కాల్లో ఉద్యోగం పోయిందని తెలుసుకోవడం చాలా షాకింగ్‌గా ఉంటుందని అన్నారు. ముఖ్యంగా ఒకే టీమ్‌లో పనిచేసే 80 మంది ఒకేసారి ప్రభావితమవడం ఈ విషయాన్ని మరింత పెద్ద చర్చగా మార్చింది.
Laid off over a Google meet
by u/Busilysnoozed in IndianWorkplace
Tags : 1