Breaking News

సినిమాల్లో బోల్డ్‌ సీన్లు ఎలా షూట్‌ చేస్తారో తెలుసా?

Published on Thu, 09/17/2026 - 13:53

సినిమాల్లో నవరసాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. యాక్షన్‌, ఎమోషన్‌, కామెడీతో పాటు రొమాంటిక్‌ సన్నివేశాలు కూడా కథలో భాగంగా ఉంటాయి. కొన్ని చిత్రాల్లో కథను బట్టి ఇంటిమేట్‌ సీన్లు కూడా కనిపిస్తుంటాయి. అయితే తెరపై ఎంతో సహజంగా కనిపించే ఇలాంటి సన్నివేశాలను నిజానికి ఎలా చిత్రీకరిస్తారనే ఆసక్తి ప్రేక్షకుల్లో చాలామందికి ఉంటుంది. నటీనటులు ఇబ్బందికి గురికాకుండా, వారి వ్యక్తిగత పరిమితులను గౌరవిస్తూ ఈ సీన్లను చిత్రీకరించేందుకు ప్రత్యేక పద్ధతులను పాటిస్తుంటారు. 

తాజాగా హాలీవుడ్‌ నటి సారా షాహి అలాంటి ఓ ఆసక్తికరమైన ట్రిక్‌ గురించి వెల్లడించారు. నెట్‌ఫ్లిక్స్‌ సిరీస్‌ ‘సెక్స్/లైఫ్‌’లో బోల్డ్‌ సన్నివేశాల్లో నటించి గుర్తింపు తెచ్చుకున్న సారా షాహి.. ఇంటిమేట్‌ సీన్ల చిత్రీకరణపై మాట్లాడారు. ఇలాంటి సన్నివేశాల్లో నటీనటులు సౌకర్యంగా ఉండేందుకు చిత్రబృందాలు కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటాయని తెలిపారు.

ఓ ఇంటర్వ్యూలో సారా షాహి చెప్పిన వివరాల ప్రకారం.. ఇంటిమేట్‌ సన్నివేశాలను చిత్రీకరించే సమయంలో ఇద్దరు నటీనటుల మధ్య గాలి తీసేసిన చిన్న యోగా బాల్‌ను ఉంచుతారు. సన్నివేశంలో కదలికలు ఉన్నప్పటికీ.. ఎదుటి నటుడు వాస్తవానికి ఆ బాల్‌ను మాత్రమే తాకేలా ఈ ఏర్పాటు చేస్తారు.ఈ పద్ధతి వల్ల సన్నివేశంలో నటిస్తున్న సమయంలో ప్రత్యక్ష శారీరక స్పర్శను తగ్గించవచ్చని సారా షాహి వివరించారు. తాను ఆ సమయంలో ఎదుటి నటుడి స్పర్శకు బదులుగా యోగా బాల్‌ తాకిడినే అనుభవిస్తానని చెప్పారు. దీంతో నటీనటులు తమకు అసౌకర్యంగా అనిపించే శారీరక స్పర్శలను ఎదుర్కోవాల్సిన అవసరం ఉండదని తెలిపారు.

ఇంటిమేట్‌ సన్నివేశాలను చిత్రీకరించేటప్పుడు నటీనటుల వ్యక్తిగత పరిమితులు, సౌకర్యాన్ని పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యమని సారా షాహి చెప్పిన విషయాలు స్పష్టం చేస్తున్నాయి. తెరపై సహజంగా కనిపించే సన్నివేశాల వెనుక.. నటీనటుల సౌకర్యం, భద్రత కోసం ఇలాంటి ప్రత్యేక పద్ధతులు కూడా ఉపయోగిస్తుంటారని ఆమె వెల్లడించారు.

Videos

సిగ్గుండాలి.. నీ కార్యకర్తకే న్యాయం చేయలేవా..? లాకప్ డెత్ కేసు పై మంద కృష్ణ మాదిగ

కరుమూరి నాగేశ్వరరావు అక్రమ అరెస్ట్ విజువల్స్

APలో ఉన్నది ఎల్ నినో కాదు.. ఎల్లో నినో ఎఫెక్ట్.. YS జగన్ కౌంటర్

కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ భూములపై విచారణ.. రంగంలోకి రెవెన్యూ అధికారులు

‘దేశ సేవకు మరింత శక్తి కలగాలి’.. ప్రధాని మోదీకి జగన్‌ విషెస్‌

రోహిత్ & వంశీ మధ్య బిగ్ ఫైట్ కెప్టెన్‌గా చరణ్..!

కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి ఎలా వస్తున్నాయి..? డబ్బులు లేవని చెప్పడానికి సిగ్గులేదా..!

మధుకర్ మహా మాయగాడు నందు కేసులో కొత్త ట్విస్ట్..!

పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్‌

సాయికృష్ణ కేసులో మరో నిందితుడు సరెండర్

Photos

+5

పదేళ్ల ప్రేమ.. పెళ్లి చేసుకున్న హీరోయిన్ (ఫొటోలు)

+5

సందడిగా సమంత సీమంతం వేడుక (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అబ్బా భలే ఉన్నాడే... గణేశుడు (ఫొటోలు)

+5

'ధురంధర్' భామ ఆయేషా బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఆషికా.. బార్బీ డాల్‌కి ఏం తక్కువ కాదు! (ఫొటోలు)

+5

అందంతో టాప్ లేపిన మృణాల్ ఠాకుర్ (ఫొటోలు)

+5

ఫ్యాన్స్‌ ఫైట్‌ చేస్తుంటే.. స్టార్స్‌ ఏం చేస్తున్నారో చూడండి! (ఫొటోలు)

+5

ఘనంగా ‘సైమా అవార్డ్స్ 2026’ సినీ స్టార్స్ సందడి (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌ మహా గణపతి తొలిపూజకు వేళాయే.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌లో వినాయక చవితి సందడి (ఫోటోలు)