ఎన్నికలకు ముందు ఒకరోజు జగన్ దగ్గరకి నేను పేర్ని నాని వెళ్లి... ఈ వీడియో చూస్తే చాలు
Breaking News
సంక్రాంతి రేసులో మరో సినిమా.. ఇంకెన్నిరా బాబు!
Published on Mon, 09/14/2026 - 11:09
సంక్రాంతికి డబ్బులొస్తున్నాయి కదా అని లెక్కకు మించి తెలుగు సినిమాలు ఈ పండగనే టార్గెట్ చేసుకుంటున్నాయి. ఇప్పటికే అరడజనుకు పైగా మూవీస్ బరిలో ఉండగా ఇప్పుడు మరొకటి కూడా వచ్చి చేరింది. గతంలో 'సామజవరగమన'తో సక్సెస్ అందుకున్న హీరో శ్రీ విష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు కొత్త చిత్రానికి 'ఫ్యామిలీ ప్యాక్' టైటిల్ ఫిక్స్ చేశారు. వచ్చే సంక్రాంతికి థియేటర్లలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించారు.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 24 సినిమాలు.. ఆ నాలుగు డోంట్ మిస్)
వచ్చే పండగ రేసులో మొదట రాబోతున్న సినిమా 'మహాకాళి'. డివోషనల్ సబ్జెక్ట్‌తో తీసిన ఈ చిత్రం జనవరి 08న రాబోతుంది. గత కొన్నేళ్లుగా ప్రతిసారి సంక్రాంతికి వస్తున్న అనిల్ రావిపూడి.. ఈసారి 'జనవరి 12 విడుదల'ని జనవరి 12న తీసుకొస్తున్నాడు. సాయిధరమ్ తేజ్ 'సంబరాల ఏటిగట్టు', చిరంజీవి 'కాకా' మూవీస్ 13వ తేదీన.. శర్వానంద్-శ్రీనువైట్ల 'జార్జ్ క్రిష్' 14వ తేదీన రిలీజ్ కాబోతున్నాయి. వీటిని అధికారికంగా ప్రకటించారు. వీటికి తోడుగా ఇప్పుడు 'ఫ్యామిలీ ప్యాక్' వచ్చి చేరింది.
ఎప్పటినుంచో పెండింగ్‌లో ఉండిపోయిన 'విశ్వంభర', డిసెంబరులో రావాల్సిన ప్రభాస్ 'ఫౌజీ' కూడా వచ్చే సంక్రాంతికి రావొచ్చని అంటున్నారు. చూస్తుంటే ఈసారి పండక్కి పెద్ద లిస్టు రెడీ అవుతోంది. కానీ చివరకొచ్చేసరికి ఇందులో ఎన్ని నిలబడతాయనేది చూడాలి?
(ఇదీ చదవండి: కళ్లుచెదిరేలా సీక్వెల్.. నయనతార 'మహాశక్తి' టీజర్ రిలీజ్)
Sankranthi is for FAMILY. ❤️
This Sankranthi is for #FamilyPack 🤪💥
The SREE VISHNU X RAM ABBARAJU 2 combo is back with a pack full of FUN & MADNESS! 🔥
Happy Vinayaka Chavithi ✨
Come with your FAMILY PACK to theatres this Sankranthi 2027! 😜#FamilyPackedSankranthi 😎… pic.twitter.com/V6b1jNCNw3— Mythri Movie Makers (@MythriOfficial) September 14, 2026
Tags : 1