Breaking News

అష్టగణపతుల ఆలవాలం... శ్రీముఖలింగం

Published on Sun, 09/13/2026 - 04:18

శ్రీకాకుళంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీముఖలింగం. ఈ క్షేత్రంలో మరో అరుదైన విశేషం ఉంది. ఇక్కడ అష్టగణపతులు కొలువై ఉండి, భక్తుల కోరికలు తీర్చే కొంగుబంగారంగా పూజలందుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా, దేశ విదేశాల నుంచి కూడా ఇక్కడకు భక్తులు వస్తుంటారు.

 

1. శక్తి గణపతి
దీర్ఘకాలిక బాధలు, వ్యాధులు శక్తిగణపతిని పూజిస్తే నయమైపోతాయని భక్తుల నమ్మకం. తూర్పువైపున ఉన్న ఈ ఆలయంలో శక్తిగణపతి పశ్చిమాభిముఖంగా భక్తులకు దర్శనమిస్తాడు.

 

2. చింతామణి గణపతి
జీవితంలోని ఈతిబాధలు, మానసిక చింతలు, దుఃఖాలను పోగొట్టే స్వామిగా ఇక్కడి చింతామణి గణపతి పూజలు అందుకుంటున్నాడు. దక్షిణం వైపు ఉన్న ఈ ఆలయంలో చింతామణి గణపతి ఉత్తరాభిముఖంగా దర్శనమిస్తాడు.

3,4. ఢుంఢి గణపతులు
పంచాయతన క్షేత్రానికి సంబంధించి ఢుంఢి గణపతుల విగ్రహాలు కాశిలో రెండు, అలాగే శ్రీముఖలింగంలో రెండు ఒకే చోట ఉంటాయి. ఈ ఢుంఢి గణపతులను దర్శనం చేసుకుంటే మనోభీష్టాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ఢుంఢి గణపతులు ఉత్తరాభిముఖంగా దక్షిణ దిశలో కొలువు దీరి ఉంటారు.

5. సాక్షి గణపతి:
భక్తులు ఆలయానికి వచ్చిన తరువాత ముందుగా ఈ స్వామిని దర్శనం చేసుకుంటే ఈయన తన తండ్రి అయిన పరమేశ్వరునికి భక్తుల రాక గురించి సాక్ష్యం చెబుతారట! ‘ఈ భక్తులు నా అనుమతి తీసుకున్నారు. తండ్రీ, వీరికి నీ దర్శన దర్శనభాగ్యం కల్పించ’ని కోరుతాడట! ఈ ఆలయంలో సాక్షి గణపతి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.

6. నాట్యగణపతి
నాట్యం సహా లలితకళలు నేర్చుకునేవారు ముందుగా ఇక్కడి నాట్యగణపతిని దర్శనం చేసుకుంటే సకలు కళలలో త్వరితిగతిని ప్రావీణ్యం లభిస్తుందని భక్తుల నమ్మకం. పశ్చిమ దిశలో తూర్పు అభిముఖంగా నాట్యగణపతి భక్తులకు దర్శనమిస్తాడు.

 

7. కార్యసిద్ధి గణపతి
మనసులో తలచిన కార్యాలను ఇక్కడి కార్యసిద్ధి గణపతికి నివేదించుకుంటే చాలు, అవి నిర్విఘ్నంగా నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఈ స్వామి ఉత్తర దిశలో దక్షిణాభిముఖంగా కొలువై ఉంటాడు.

8. వరసిద్ధి గణపతి
భక్తులకు కోరిన వరాలను అనుగ్రహించే స్వామిగా ఇక్కడి వరసిద్ధి గణపతిని భక్తులు పూజిస్తారు. ఈ ఆలయంలో వారాహి అమ్మవారి ముందు ఎడమవైపుగా దక్షిణాభిముఖంగా వరసిద్ధి వినాయకుడు భక్తులకు దర్శనమిస్తాడు. 
- సుంకరి శాంత భాస్కరరావు
జలుమూరు, శ్రీకాకుళం జిల్లా 

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)