10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్
Breaking News
‘ఇరుముడి’ థీమ్‌తో బోజ్జ గణపయ్య.. వీడియో వైరల్
Published on Sat, 09/12/2026 - 15:04
వినాయక చవితి వచ్చిందంటే చాలు.. గణనాథుడి విగ్రహాలు సరికొత్త రూపాల్లో దర్శనమిస్తూ ఆకట్టుకుంటుంటాయి. ట్రెండ్‌కు తగ్గట్టుగా విభిన్న ఆకారాల్లో విగ్రహాలను తయారు చేయడం ఆనవాయితీగా మారింది. అంతేకాదు.. బ్లాక్‌బస్టర్ సినిమాల థీమ్‌లను కూడా వినాయకుడి విగ్రహాల్లో ప్రతిబింబిస్తున్నారు. గతంలో అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ సినిమా థీమ్‌తో గణేశుడి విగ్రహాలు సందడి చేసిన సంగతి తెలిసిందే. హీరోల రూపాల్లోనూ విగ్రహాలు దర్శనమిస్తూ నెట్టింట వైరల్‌గా మారుతుంటాయి. ఇప్పుడు తాజాగా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థీమ్‌తో రూపొందించిన వినాయకుడి విగ్రహం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ విగ్రహాన్ని వైజాగ్‌లో తయారు చేశారు.శివుడు, పార్వతి కలిసి వినాయకుడికి ఇరుమడి కడుతున్నట్లుగా ఉన్న ఈ విగ్రహానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఇక ఇరుముడి సినిమా విషయానికొస్తే.. రవితేజ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్స్‌లో రిలీజై..తొలి రోజే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సంపాదించుకుంది. విడుదలైన రెండు వారాలకే రూ. 200 కోట్లకు పైగా వసూళ్లను సాధించి రికార్డు సృష్టించింది. మూడో వారం ముగిసేసరికి ప్రపంచ వ్యాప్తంగా రూ. 225 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ప్రియా భవానీ శంకర్, సాయి కుమార్, స్వసికా, బేబీ నక్షత్ర, రమేష్ ఇందిర కీలక పాత్రలు పోషించగా.. జీవీ ప్రకాశ్ సంగీతం అందించారు.
#IRUMUDI Effect 🤌👌
Chudataniki Chala Bagundi 🛐
స్వామియే శరణం అయ్యప్ప 🙏 pic.twitter.com/digPReR1ER— Hari SaaHo (@HariSaaho19) September 12, 2026
Tags : 1