Breaking News

ఆనంద్-వైష్ణవి 'ఎపిక్'.. తొలిరోజు వసూళ్లు ఎన్ని కోట్లు?

Published on Sat, 09/12/2026 - 10:47

'బేబి' సినిమాతో మూడేళ్ల క్రితం హిట్ కొట్టిన ఆనంద్ దేవరకొండ-వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ ప్రేమకథా మూవీ 'ఎపిక్'. గతంలో వచ్చిన #90స్ వెబ్ సిరీస్‌లోని పిల్లాడి పాత్రని తీసుకుని వాడి పెరిగి పెద్దయిన తర్వాత ప్రేమలో పడితే అనే స్టోరీతో దీన్ని తీశారు. నిన్న(సెప్టెంబరు 11) థియేటర్లలో రిలీజైన ఈ చిత్రానికి చాలావరకు నెగిటివ్ టాక్ వచ్చింది. కానీ వసూళ్లు మాత్రం తొలిరోజు బాగానే వచ్చాయి.

ఇదీ చదవండి: బిగ్‌బాస్ 10: చైత్ర షాకింగ్ ఎలిమినేషన్.. అసలేంటి ట్విస్టులు?

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా చేసిన 'ఎపిక్' సినిమాకు తొలిరోజు(ప్రీమియర్లతో కలిపి) మన దేశంలో రూ.2.10 కోట్ల నెట్ వసూళ్లు రాగా ఓవర్సీస్‌తో కలిపి ప్రపంచవ్యాప్తంగా రూ.3.45 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు తెలుస్తోంది. ప్రీమియర్స్‌తో కలిపి మొత్తగా రూ. 5 కోట్ల వరకు వసూలు చేసినట్లు మేకర్స్‌ అధికారికంగా ప్రకటించారు. అయితే తొలిరోజు టాక్ నెగిటివ్‌గా ఉన్న నేపథ్యంలో వీకెండ్ అయ్యేసరికి ఎలాంటి ఫలితం అందుకుంటుందనేది చూడాలి?

పైచదువుల కోసం యూకే వెళ్లిన ఓ తెలంగాణ పల్లెటూరి కుర్రాడు.. ఓ మోడ్రన్ తెలుగమ్మాయితో ప్రేమలో పడితే వాళ్లు ఎంతవరకు హద్దులు దాటేశారు. ఈ క్రమంలోనే ఏమేం తెలుసుకున్నారు? తదితర అంశాలతో ఈ సినిమా తీశారు. అయితే ఎమోషన్స్ గానీ అటు లవ్ యాంగిల్ గానీ సరిగా వర్కౌట్ కాలేదని టాక్ ఎక్కువగా వినిపిస్తుంది. మరికొందరు మాత్రం తమకు నచ్చిందని అంటున్నారు. ఆదిత్య హాసన్ ఈ చిత్రానికి దర్శకుడు కాగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మించారు.

ఇదీ చదవండి: ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ రివ్యూ

Videos

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

రాజీనామా చేసి పార్టీ పెట్టి గెలిచినా నాయకుడు జగన్.. పొత్తు లేకపోతే ఒక్క సీటు గెలిచే దమ్ము లేదు నీకు...

అంబేద్కర్ కోనసీమలో చంద్రబాబుకు బిగ్ షాక్.. ముగ్గురు TDP అధ్యక్షులు రాజీనామా

నువ్వు కాదు కదా నీ... జగన్ పాదయాత్రపై చింతమనేని సవాల్.. కాసు మహేష్ రెడ్డి కౌంటర్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)