Breaking News

నియామకాల్లో భారత్‌ టాప్‌

Published on Sat, 09/12/2026 - 09:00

కార్యకలాపాలను విస్తరించే కొద్దీ దేశీయంగా చాలా మటుకు కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టబోతున్నాయి. ఈ ఏడాది అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైమాసికంలో రిక్రూట్‌మెంట్‌కి సంబంధించి మిగతా దేశాలతో పోలిస్తే భారత్‌లో హైరింగ్‌ అంచనాలు అత్యధికంగా ఉన్నాయి. స్టాఫింగ్‌ సేవల సంస్థ మ్యాన్‌పవర్‌ గ్రూప్‌ విడుదల చేసిన ఎంప్లాయ్‌మెంట్‌ ఔట్‌లుక్‌ సర్వే నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీని ప్రకారం ఈ ఏడాది క్యూ4లో నికరంగా వచ్చే ఉద్యోగాల ఔట్‌లుక్‌ (ఎన్‌ఈవో) 54%గా నమోదైంది. ఇది అంతర్జాతీయ సగటుకన్నా 25% అధికం కావడం గమనార్హం.

దేశీ గణాంకాలనే పరిగణనలోకి తీసుకున్న పక్షంలో క్రితం క్వార్టర్‌తో పోలిస్తే 6%, గతేడాది ఇదే వ్యవధితో పోలిస్తే 11% అధికం. రిపోర్ట్‌ ప్రకారం.. భారత్‌లో కంపెనీలు తమ కార్యకలాపాలను విస్తరిస్తుండటంతో ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఉద్యోగావకాశాల అంచనాలు పెరిగాయి. జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన సర్వేలో 3,055 సంస్థలు పాల్గొన్నాయి. కొత్తగా ఎన్ని సంస్థలు నియామకాలు చేపట్టే యోచనలో ఉన్నాయి, ఎన్ని సంస్థలు తగ్గించుకోవాలనుకుంటున్నాయన్న అంశాల ప్రాతిపదికన ఈ డేటాను మాన్‌పవర్‌గ్రూప్‌ సమగ్రపరుస్తుంది.

‘ఏఐకి తగ్గట్లుగా సిబ్బందిని మార్చుకోవడం, నైపుణ్యాల కొరత, ఉద్యోగార్థులు సదరు ఉద్యోగ ప్రమాణాలను అందుకోలేకపోతుండటంలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీలు మాత్రం నియామకాలపై ధీమాగానే ఉన్నాయి’ అని మ్యాన్‌పవర్‌గ్రూప్‌ ఇండియా, మిడిల్‌ఈస్ట్‌ ఎండీ సందీప్‌ గులాటీ తెలిపారు.  

సర్వేలో ఇతర ప్రధానాంశాలు..

  • అక్టోబర్‌–డిసెంబర్‌ మధ్యకాలంలో సిబ్బంది సంఖ్యను పెంచుకోవాలని 65 శాతం సంస్థలు ప్రణాళికలు వేసుకుంటున్నాయి. 11 శాతం సంస్థలు తగ్గించుకోవాలనుకుంటున్నాయి. తమ ఉద్యోగుల సంఖ్యలో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని 24 శాతం సంస్థలు తెలిపాయి.  

  • ఉద్యోగ విధులు, నైపుణ్యాలపరమైన అవసరాలు మారుతున్న కొద్దీ దానికి తగ్గట్లుగా నియామకాలు చేపడుతున్నట్లు దాదాపు 70 శాతం సంస్థలు తెలిపాయి.  

  • ఫైనాన్స్‌..బీమా.. ఆతిథ్యం తదితర రంగాల పటిష్ట వృద్ధి, గ్లోబల్‌ కేపబిలిటీ సెంటర్ల విస్తరణ మొదలైన అంశాల వల్ల నిపుణులకు బాగా డిమాండ్‌ ఉంటోంది.

  • గత క్వార్టర్‌తో పోలిస్తే దేశీయంగా నాలుగు ప్రాంతాల్లోనూ నియామకాలపై సానుకూలత నెలకొంది. తూర్పు భారతంలో ఎన్‌ఈవో అత్యధికంగా 59 శాతంగా నమోదైంది.  

  • గ్లోబల్‌గా నియామకాలపై ఆశావహంగా ఉన్న దేశాల్లో భారత్‌ (54 శాతం) టాప్‌లో ఉండగా, బ్రెజిల్‌ (53 శాతం), పనామా (49 శాతం), మెక్సికో (41 శాతం), యూఏఈ (41 శాతం), పెరూ (40 శాతం) ఆ తర్వాత స్థానాల్లో ఉన్నాయి.

  • ప్రపంచవ్యాప్తంగా రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో ఏఐ వినియోగం పెరుగుతోంది. దీనితో హైరింగ్‌కి పట్టే సమయం గణనీయంగా తగ్గుతోంది.  

  • ప్రస్తుతం నైపుణ్యాలు ఉన్న వారు దొరకడం పెద్ద సవాలుగా మారుతోంది. ఉద్యోగానికి అవసరమయ్యే అర్హతలు మారిపోతున్న కొద్దీ, సరైన సామర్థ్యాలు ఉన్న అభ్యర్థులను తీసుకోవడం కష్టసాధ్యంగా ఉంటోంది.

ఇదీ చదవండి: 2030 నాటికి 20 లక్షల కొలువులు..!

Videos

10 వేలతో 9 లక్షల లాభం.. HDFC Flexi Cap Fund రికార్డ్ రిటర్న్స్

జగన్ లేకపోతే నేను లేను.. అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్న బద్దుకొండ అప్పలనాయుడు

2లక్షలు వసూలు చేసిన హిజ్రాలపై కేసు

చేసిందంతా ఆ ఇద్దరే! జూడో అసోసియేషన్ లీలలు

ముంచుకొస్తున్న 76 కిలోమీటర్ల ఉపద్రవం.. నాసా కెమెరాకు చిక్కిన సాక్ష్యం

పుష్ప రేంజ్ లో ఛేజింగ్.. పరారైన స్మగ్లర్లు

స్పిరిట్ ని తొక్కండి చూద్దాం... క్రిటిక్స్ కు వంగా తమ్ముడు సవాల్

భక్తుల దర్శనానికి సిద్ధమైన ఖైరతాబాద్ గణేషుడు

వాళ్ళు నా దగ్గర డబ్బు తీసుకుని ఒక్కటే హామీ ఇచ్చారు.. బాధితుడు షాకింగ్ నిజాలు

కార్యకర్తల కోసం కదిలిన జగనన్న.. గోల్డ్, సిల్వర్ కార్డ్స్

Photos

+5

'మండాడి' సినిమా సక్సెస్ మీట్ (ఫోటోలు)

+5

విజయవాడను ముంచెత్తిన భారీ వర్షం...చెరువులను తలపిస్తున్న రోడ్లు (ఫొటోలు)

+5

వినాయక చవితి రోజు తప్పక సమర్పించాల్సిన 21 పత్రాలు.. (ఫొటోలు)

+5

బేబీ బంప్‌తో సమంత.. ఈ ఫోటోలు చూశారా?

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (సెప్టెంబర్ 13 -సెప్టెంబర్ 19)

+5

'ఎపిక్' షూటింగ్‌లో ఆనంద్-వైష్ణవి గ్యాంగ్ ఇలా (ఫొటోలు)

+5

వినాయకుడికి ఇష్టమైన 10 ప్రసాదాలు... మీరు ఓ లుక్ వేయండి (ఫొటోలు)

+5

సమంత స్టన్నింగ్‌ లుక్స్‌ అదుర్స్‌ (ఫొటోలు)

+5

ఖైరతాబాద్‌ మహాగణపతి ఆగమన కార్యక్రమం (ఫొటోలు)

+5

‘ది ప్యారడైజ్‌’ సినిమా ప్రెస్ మీట్ (ఫొటోలు)