Breaking News

హీరో మోటర్స్‌ రూ. 1,000 కోట్ల ఐపీవో 

Published on Fri, 09/11/2026 - 04:58

న్యూఢిల్లీ: ఆటో విడిభాగాల తయారీ దిగ్గజం హీరో మోటర్స్‌ తమ ఐపీవోకి సంబంధించి షేర్ల ధర శ్రేణి రూ. 79–84గా ఉంటుందని వెల్లడించింది. దీని ద్వారా కంపెనీ రూ. 1,000 కోట్లు సమీకరించనుంది. ప్రతిపాదిత పబ్లిక్‌ ఇష్యూ సెప్టెంబర్‌ 16న ప్రారంభమై 18న ముగుస్తుంది. సెప్టెంబర్‌ 23న లిస్ట్‌ కావొచ్చని అంచనా.  ఐపీవోలో భాగంగా రూ. 600 కోట్ల వరకు విలువ చేసే షేర్లను తాజాగా జారీ చేయనుండగా, ఆఫర్‌ ఫర్‌ సేల్‌ (ఓఎఫ్‌ఎస్‌) విధానంలో ప్రమోటర్లు రూ. 400 కోట్ల వరకు విలువ చేసే షేర్లను విక్రయించనున్నారు. ఓఎఫ్‌ఎస్‌లో ఓపీ ముంజల్‌ హోల్డింగ్స్‌ రూ. 395 కోట్ల షేర్లను, హీరో సైకిల్స్‌ రూ. 5 కోట్ల షేర్లను విక్రయించనున్నాయి. 

తాజా షేర్ల జారీ ద్వారా లభించే నిధుల్లో రూ. 190 కోట్ల మొత్తాన్ని నిర్దిష్ట రుణాలను తిరిగి చెల్లించివేసేందుకు, రూ. 200 కోట్లను ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్లాంటు విస్తరణకి యంత్రపరికరాలను కొనుగోలు చేసేందుకు కంపెనీ వినియోగించుకోనుంది. మిగతా మొత్తాన్ని ఇతర సంస్థల కొనుగోళ్లు, ఇతరత్రా కార్పొరేట్‌ అవసరాలకు ఉపయోగించుకోనుంది. హీరో మోటర్స్‌ 2025 జూన్‌లో రూ. 1,200 కోట్ల సమీకరణ కోసం డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసింది. దాని ప్రకారం తాజా షేర్ల జారీ ద్వారా రూ. 800 కోట్లు, ఓఎఫ్‌ఎస్‌ కింద రూ. 400 కోట్లు సమీకరించాలని సంస్థ భావించింది. ఆ తర్వాత తాజా షేర్ల జారీని రూ. 600 కోట్లకు కుదించడంతో మొత్తం ఐపీవో పరిమాణం రూ. 1,000 కోట్లకు పరిమితమైంది.  

Videos

YSRCP నేతలతో గుడివాడ అమర్నాథ్ అత్యవసర మీటింగ్

దుమ్మురేపుతున్న సామ్సంగ్.. ఫోల్డబుల్ ఫోన్ లో ఏది బెస్ట్

ప్రభుత్వ స్కూల్ లో దారుణం 9వ తరగతి విద్యార్థినిపై టీచర్....

ప్రియాంక చనిపోక ముందు రోజు... డాక్టర్ ప్రియాంక తండ్రి ఎమోషనల్ వీడియో

స్టార్టింగ్ లోనే భారీ షాక్.! చరణ్ కాదు కృష్ణుడు అవుట్?

Advocate : నేను కూడా ఏదో ఒక రోజు చనిపోతా... కానీ చనిపోయే ముందు

భారీగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు కొనకపోతే.. తులం ఎంతంటే?

ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు!

జుట్టు పట్టి.. చీర లాగి.. ద్రౌపదికి జరిగిన అవమానమే మాకు జరిగింది

బంజారా హిల్స్ లో బిగ్ యాక్సిడెంట్ మహిళలకు తీవ్ర గాయాలు

Photos

+5

హైదరాబాద్ లో ఆకట్టుకున్న వెరైటీ గణనాథులు (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సినీ నటి కృతి శెట్టి (ఫొటోలు)

+5

పుట్టినరోజున తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి శ్రియ శరణ్‌ (ఫొటోలు)

+5

కేరళ కుట్టీలా మారిపోయిన 'ధురంధర్' భామ.. (ఫొటోలు)

+5

చీరలో నాజూగ్గా నభా నటేశ్.. (ఫొటోలు)

+5

సౌండ్ బాక్స్‌తో గ్లామరస్ శ్రుతి హాసన్.. (ఫొటోలు)

+5

కామాఖ్య దేవాలయాన్ని దర్శించుకున్న ఉపాసన.. (ఫొటోలు)

+5

'ఖైదీ' పాప ఇప్పుడెలా ఉందో చూశారా? ఏడేళ్ల తర్వాత మళ్లీ కలిశారు (ఫొటోలు)

+5

ఆదిలాబాద్ జిల్లాలో పోలాల అమావాస్య వేడుకలు...(ఫొటోలు)