Breaking News

గిల్ట్‌ వదిలేయ్‌.. గెలుపు ఓన్‌చేసుకో!

Published on Wed, 09/09/2026 - 14:13

క్యాబ్‌ ఎక్కి డ్యూటీకి వెళుతుంటే సంతోషం లేదు.ఆఫీస్‌లో బాస్‌ సీట్‌లో కూచున్నా ఏదో నిరాశ. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరుగుతుంటే అపరాధభావం. మంచిగా బతికే స్థితికి వచ్చినా మంచిగా బతకలేని ఆందోళన.‘΄పాపం... వాళ్లలాగే ఉన్నారే’ ‘అయ్యో.. వీళ్లనలా దాటేసి వచ్చానే’...అని మదనపడుతూ గెలుపును ఎంజాయ్‌ చేయలేక΄ోతున్నారు. సైకాలజీలో దీనినే ‘సక్సెస్‌ యాంగ్జయిటీ’ లేదా  ‘ది గ్లో అప్‌ గిల్ట్‌’ అంటున్నారు. గెలుపు దారిలోని మహిళలు ఏం చేయాలి?

కె.బాలచందర్‌ ‘అంతులేని కథ’ కాలాన్ని మనం ఇంకా దాటలేదు.‘అంతులేని కథ’లో ఇంటి అమ్మాయి ఇంటిని మోయాలన్న రూల్‌. ఆడపిల్ల ఎదిగొస్తే తమ్ముళ్లు, చెల్లాయిలు, ఖాళీగా ఉన్న తండ్రి, నోములు నోచే తల్లి... వీరందరి కోసం కర్పూరంలా కరిగిపోవాలి. అప్పుడు అలా ఉంటే ఇప్పుడు ఇంటి అమ్మాయి ఎదిగొస్తే ఆమెకు ఏదో తెలియని ఆందోళన. 

‘కుటుంబ స్థాయి కంటే పెద్ద స్థానాన్ని తీసుకున్నాను. మా వాళ్లకు దూరమవుతానా... నేను ఎలా ఒదిగి ఉండాలి... నేను నాలా ఉండొచ్చా’ అని చేయని తప్పుకు గిల్ట్‌.  పల్లెటూళ్ల నుంచి సిటీకు వచ్చి, హాస్టల్‌ గదుల్లో ఉంటూ, ఎన్నో అవమానాలను తట్టుకుని కెరీర్‌లో టాప్‌పొజిసన్‌కు చేరుకున్నాక ఇదీ స్థితి. బ్యాంక్‌ బ్యాలెన్స్‌ పెరిగి, నచ్చిన కార్‌ కొన్నా హైపర్‌ క్రిటిసిజమ్, ఆత్మీయులు ఎడం పెట్టడం లాంటివి ఎక్కడ ఎదురవుతాయోనని ఫీలవుతుంటారు. దీనినే స్ధూలంగా ‘గ్లో అప్‌ గిల్ట్‌’ అనీ లేదా ‘సక్సెస్‌ యాంగ్జయిటీ’ అనీ అంటున్నారు.

రెండు కేస్‌ స్టడీలు
లావణ్య (వైజాగ్‌ టు హైదరాబాద్‌): లావణ్యది మధ్యతరగతి కుటుంబం. వైజాగ్‌లో చదువుకుని హైదరాబాద్‌  టాప్‌ ఐటీ కంపెనీలో ప్రాజెక్ట్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగింది. నెలకు రెండు లక్షల జీతం. ఊరికి వెళ్లినప్పుడు బంధువుల దగ్గర, స్నేహితుల దగ్గర ఏదో తప్పు చేసినట్టు అణిగి ఉంటుంది. తన బ్రాండెడ్‌ బట్టలు, ఫోన్‌ చూసి వాళ్లు ఎక్కడ ఇన్ఫీరియర్‌గా ఫీలవుతారో అని భయపడుతుంది. ఫ్రెండ్స్‌ మధ్య తన సక్సెస్‌ ముచ్చట్లు అస్సలు ఎత్తదు. ఎదిగినందుకు సంతోషపడాలో, అందరికీ దూరమవుతున్నందుకు ఏడవాలో అర్థం కావడం లేదామెకు.

సరిత (వరంగల్‌ టు బెంగళూరు): సరిత బెంగళూరులో స్టార్టప్‌ పెట్టి సక్సెస్‌ అయింది. సొంతంగా ఫ్లాట్‌ కొంది. కానీ వరంగల్‌లోనే ఉంటూ ఇంకా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న తన అన్నయ్య, వదినలను చూసినప్పుడు సరిత మనసు విలవిలలాడుతుంది. ‘నేనొక్కదాన్నే ఇంత సుఖపడుతున్నాను’ అనే ఒక వింత గిల్ట్‌ ఫీలింగ్‌ ఆమెను ప్రశాంతంగా నిద్రపోనివ్వడం లేదు.

ఇలా ఎందుకు?
మన దగ్గర అమ్మాయిల పెంపకం అంటే.. ‘ఆడపిల్ల అందరినీ కలుపుకునిపోవాలి, మన దగ్గర ఎంత ఉన్నా ఎదుటివారి దగ్గర తగ్గి ఉండాలి... ఇంటిలోని ప్రతి ఒక్కరినీ కనిపెట్టుకుని ఉండాలి’... అని చిన్నప్పటి నుంచే  మైండ్‌లో బలంగా నాటేస్తారు. అబ్బాయి సక్సెస్‌ అయితే వాడికేమీ దిగులుండదు. వాడు పుట్టిందే సక్సెస్‌ అయ్యేందుకు. కుటుంబం, సమాజం వాణ్ణి గర్వంగా చూస్తుంది. 

అదే అమ్మాయి సక్సెస్‌ అయితే ‘అందరూ తలా ఒక చేయివేసి నిన్ను ఈ స్థితికి తెచ్చాం. మా త్యాగాలు, ప్రోత్సాహం నీ వెంట ఉన్నాయి’ అన్నట్టుగా ఉంటుంది ధోరణి. దాంతో గెలిచిన అమ్మాయి ‘నా ఎదుగుదల వల్ల నా కుటుంబంలో ఈగోలు దెబ్బతింటున్నాయా? సమాజం నన్ను అహంకారి అనుకుంటుందా?’ అని లోలోపల రంధి పడాలి.

ఎలా ముందు కెళ్లాలి?
గెలిచిన, గెలుపొందే బాటలో ఉన్న అమ్మాయిలు మొదట ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. మీరు పొందిన గెలుపు మీకు లాటరీలో రాలేదు. దీని వెనుక మీ నిద్రలేని రాత్రులు, కన్నీళ్లు, కష్టం, టాలెంట్‌ ఉన్నాయి. కాబట్టి మీ సక్సెస్‌ గురించి ఎవరికీ ‘సారీ’ చెప్పాల్సిన అవసరం లేదు. మీరు ఎదగడం అంటే ఇతరులను తొక్కేయడం కాదు. 

మీరు ఎత్తుకు ఎదిగితేనే, మీ చుట్టూ ఉన్న మరో నలుగురు అమ్మాయిలకు దారి చూపించగలరు. మీ లైఫ్‌స్టైల్, కష్టార్జితాన్ని ఎంజాయ్‌ చేయడానికి వెనకాడాల్సిన పని లేదు. పాత బంధాలతో కనెక్ట్‌ కావడానికి డబ్బు, హోదా అవసరం లేదు... ఒక చిన్న ఆత్మీయమైన పలకరింపు చాలు.

కుటుంబం ఎలా సపోర్ట్‌ చేయాలి?
ఒక అమ్మాయి గెలిచినప్పుడు కుటుంబం ఆమెకు కిరీటం పెట్టక్కర్లేదు. కానీ ఆమె మనసుపై గిల్ట్‌ భారాన్ని మోపకుండా ఉంటే చాలు. ఇంట్లో మగవారితో సమానంగా లేదా అంతకంటే ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు ఆమెను చూసి ఈర్ష్య పడకుండా, గర్వంగా ఓన్‌ చేసుకోవడం భర్తకు, తండ్రికి అలవాటు కావాలి. ఆమె తన డబ్బుతో కొనే వస్తువులను, ఆమె కెరీర్‌ డెసిషన్స్‌ని కించపరచకూడదు. ‘నువ్వు బాగా ఎదిగావు.. మేము నీ పక్కన ఉన్నాం’ అనే ఒక్క మాట కుటుంబం నుంచి వస్తే ఆ అమ్మాయి మనసులో ఉన్న గిల్ట్‌ అంతా కరిగి΄పోతుంది. 

గెలుపు అమ్మాయిలకు అబ్బాయిలకు వేరు వేరు కాదు. ఎవరికైనా సరే గెలుపు అనేది అహంకారం కాదు.. ఒక బాధ్యత, న్యాయమైన హక్కు. మన ఇంటి అమ్మాయి రెక్కలొచ్చి ఎగిరితే గూటికి దూరమయ్యానని ఏడవకూడదు, గూటిలోని మిగతా పక్షులకు ఉన్నత ఎత్తులకు ఎలా తీసుకెళ్లాలో చూడాలి. మన గెలుపు దారిలో వారూ ఉంటారు అని కేరీ చేయగలిగితే చాలు. మన దారిలో మనం వెళుతూ వారికి మనం ఉన్నాం అని చెప్తే చాలు. కాబట్టి విజేతలూ.... మీ సక్సెస్‌ కిరీటాన్ని మీ తలపై గర్వంగా ధరించండి. గిల్ట్‌ వదిలేయండి.. గెలుపును వంద శాతం ఓన్‌ చేసుకోండి.          

‘నాట్‌ సారీ’ మైండ్‌... సక్సెస్‌ఫుల్‌ మహిళలు ప్రతిరోజూ తమకు తాము చెప్పుకోవాల్సిన మూడు పాజిటివ్‌ లైసెన్స్‌: 

గెలుపు నా హక్కు. దీనికోసం నేను సమాజానికి గానీ, ఎవరికీ గానీ ‘సారీ’ చెప్పాల్సిన అవసరం లేదు 

నేను ఆర్థికంగా, వ్యక్తిగతంగా మరింత ఎత్తుకు ఎదిగితేనే నా చుట్టూ ఉన్న మరో నలుగురికి దారి చూపించగలను 

నా నిద్రలేని రాత్రులు, నా కష్టానికి దక్కిన ప్రతిఫలమే ఈ విజయం. దీనిని నేను వంద శాతం మనస్ఫూర్తిగా ఎంజాయ్‌ చేస్తాను. 

#

Tags : 1

Videos

బెయిల్ వచ్చింది.! బిగ్ బాస్ లోకి రమానందన ఎప్పుడంటే?

జియో రూ.111 రీఛార్జ్ మతిపోగొట్టే బెనిఫిట్స్

నేషనల్ అవార్డు... క్యాష్ బహుమతిగా ఇస్తే, ఈ రోజు లోకేష్ జాబ్ ఇవ్వకుండా చేశాడు

నేను వస్తున్నానా లేదా అని నా అడ్వకేట్ ఇంటికి CCకెమెరాలు పెట్టించడం ఏంటీ

కులం గొప్పది కాదు మానవత్వం గొప్పది

మజ్జి శ్రీను పార్టీ మారడంపై బొత్స ఇంటి వద్ద అత్యవసర మీటింగ్

బాబును ఇమిటేట్ చేస్తూ ఏకిపారేసిన జగన్

కూకట్ పల్లి హోటల్ లో దారుణం కుళ్లిన 30 కేజీల మటన్, 20 కేజీల చికెన్

అందర్నీ కొనేసింది.! షాకింగ్ నిజాలు బయటపెట్టిన బాధితుడు

పాన్ ఇండియా బరిలోకి దిగుతున్నారా? డిసెంబర్ లో ఒకేసారి సినిమాలు

Photos

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)