Breaking News

ఎపిక్‌తో బిగ్‌ బ్లాక్‌బస్టర్‌ కొడుతున్నాం: విజయ్‌ దేవరకొండ

Published on Wed, 09/09/2026 - 00:49

‘‘ఆదిత్య హాసన్‌ తీసిన ‘90స్‌’ వెబ్‌ సిరీస్‌ చూశాక తను సినిమా చేస్తే కచ్చితంగా చూడాలనిపించింది. తన దర్శకత్వంలో ‘ఎపిక్‌’ మూవీలో నటించడం ఆనంద్‌ అదృష్టం. ఆనంద్‌ సినిమాల ఎంపిక, కెరీర్‌ పట్ల చాలా గర్వపడుతున్నాను. ఆనంద్‌ ఫిల్మోగ్రఫీలో ‘ఎపిక్‌’ లాంటి మరో మంచి చిత్రం చేరుతుంది. వైష్ణవి బ్రిలియంట్‌ పెర్ఫార్మర్‌. సెప్టెంబరు 11న ‘ఎపిక్‌’తో బిగ్‌ బ్లాక్‌ బస్టర్‌ కొడుతున్నాం’’ అని హీరో విజయ్‌ దేవరకొండ చెప్పారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్‌–ఫస్ట్‌ సెమిస్టర్‌’. 

ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి నిర్వహించిన ‘ఎపిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన విజయ్‌ దేవరకొండ మాట్లాడుతూ – ‘‘సెప్టెంబరు 11న ఆనంద్‌ దేవరకొండ ‘ఎపిక్‌’ ఉంది. అక్టోబరు 16న విజయ్‌ దేవరకొండ ‘రణబాలి’ సినిమా ఉంది. నవంబరులో దేవరకొండ రష్మిక ‘మైసా’ ఉంది... కాబట్టి నాన్‌స్టాప్‌గా మిమ్మల్ని (ఫ్యాన్స్‌) కలుస్తూనే ఉంటాను. తెలుగు సినిమాకి ఇది గొప్ప సంవత్సరం. 

నాన్‌స్టాప్‌గా ఫిల్మ్స్‌ వస్తున్నాయి... ప్రేక్షకులు చూస్తున్నారు.. హిట్స్‌ అవుతున్నాయి. రెండు రోజుల్లో ‘ఎపిక్‌’ వస్తుంది. ఆ తర్వాత నాని ‘ది ప్యారడైజ్‌’, ఆ తర్వాత ‘రణబాలి, మైసా’, తరుణ్‌ భాస్కర్‌ ‘ఈ నగరానికి ఏమైంది 2’ మూవీస్‌ వస్తున్నాయి. డిసెంబరులో ‘ఫౌజి’ మూవీ, బాలయ్యగారి ‘దాదా’ వస్తున్నాయి. ఈ ఏడాది ముగింపు సాలిడ్‌గా ఉండబోతోంది. రవితేజ అన్న ‘ఇరుముడి’ సూపర్‌గా ఉంది’’ అని చెప్పారు. మరో ముఖ్య అతిథి సందీప్‌ రెడ్డి వంగా మాట్లాడుతూ – ‘‘అర్జున్‌ రెడ్డి’ టైమ్‌లో నేను, విజయ్‌ కాలిఫోర్నియా వెళ్లాం. 

అప్పుడు ఆనంద్‌ ‘అర్జున్‌ రెడ్డి’ చర్చల్లో పాల్గొన్నాడు. ఐటీ జాబ్‌ చేస్తున్నాడు కానీ సినిమా అంటే మాకు ఉన్నంత పిచ్చి ఉందేంటీ అనుకున్నాను. సడన్‌గా ‘దొరసాని’ సినిమాతో హీరో అయ్యాడు. ‘ఎపిక్‌’ టీమ్‌కి ఆల్‌ ది బెస్ట్‌’’ అని పేర్కొన్నారు. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘కింగ్‌డమ్‌’ మూవీలో ‘అన్నా అంటే నేæ...’ పాట  మా అన్న విజయ్, నా బంధానికి సరి΄ోయేలా ఉంటుంది. ప్రతి ఫ్యామిలీలో ఒకరు ఆ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళుతుంటారు. మా ఫ్యామిలీలో విజయ్‌ అన్న అలాగ. ఇక ‘ఎపిక్‌’ మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది’’ అని చెప్పారు.

మనల్ని మనం నమ్మాలి: వైష్ణవీ చైతన్య
మంగళవారం ఉదయం జరిగిన విలేకరుల సమావేశంలో ‘ఎపిక్‌’ మూవీ గురించి వైష్ణవీ చైతన్య మాట్లాడుతూ– ‘‘ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌’లో కడలి అనే పాత్ర చేశాను. తన జీవితంలో ఉన్న సమస్యను డీల్‌ చేస్తూనే, తన జీవితాన్ని కడలి ఎలా ముందుకు నడిపించింది? అనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఈ పాత్ర ద్వారా మంచి సందేశం కూడా ఉంటుంది. గతంలో నేను ఏదైనా విషయం బయటకు మాట్లాడాలంటే కాస్త భయపడేదాన్ని.

 అయితే కడలి పాత్ర ద్వారా ముందు మనల్ని మనం నమ్మాలి. ఆత్మవిశ్వాసంతో ఉండాలి. మనల్ని మనం నమ్మినప్పుడే ఇతరులు మనల్ని నమ్ముతారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో ఏదో సమయంలో వారి కోసం వారు నిలబడాలని నేర్చుకున్నాను. ఈ సినిమా పరంగా పెద్ద చాలెంజ్‌ ఏంటంటే నేను కర్లీ హెయిర్‌తో కనిపించడమే. షూటింగ్‌ ఉందంటే... అందరికంటే ముందుగానే నేను నా హెయిర్‌ని సెట్‌ చేసుకోవాల్సి వచ్చేది. ప్రస్తుతం సితార బ్యానర్‌లో నితిన్‌గారితో ఓ సినిమా చేస్తున్నాను. అలాగే, తమిళంలో   రెండు సినిమాలు, హిందీలో ఒక సినిమా చేస్తున్నాను’’ అని చెప్పారు.

Videos

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)