Breaking News

ఒకే జానర్‌కు ఫిక్స్‌ కాలేదు: సుమంత్‌

Published on Wed, 09/09/2026 - 00:40

‘‘ఒక నటుడిగా ఇప్పటివరకూ విభిన్నమైన జానర్స్‌లో డిఫరెంట్‌ పాత్రలు చేశాను. ఒకే జానర్‌లో సినిమాలు చేయాలని ఎప్పుడూ ఫిక్స్‌ కాలేదు. హీరో పాత్రలు చేయడంతో పాటు బలమైన సపోర్టింగ్‌ రోల్స్, విలన్‌ రోల్స్‌ కూడా చేశాను. ఇప్పుడు కూడా విలన్‌ రోల్స్, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా చేయడానికి సిద్ధంగానే ఉన్నాను. అయితే ఆ క్యారెక్టర్స్‌లో డెప్త్‌ ఉండాలి’’ అని సుమంత్‌ చెప్పారు. సుమంత్, ఐశ్వర్యా రాజేష్‌ లీడ్‌ రోల్స్‌లో  సిద్ధు జొన్నలగడ్డ, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు, లక్ష్మణ్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 11న రిలీజ్‌ కానుంది. ఈ సందర్భంగా మంగళవారం విలేకరులతో సుమంత్‌ చెప్పిన విశేషాలు...

‘మహేంద్రగిరి వారాహి’లో యూట్యూబ్‌ ప్లాట్‌ఫామ్‌ ద్వారా మూఢనమ్మకాల గురించి చర్చించే క్యారెక్టర్‌లో నటించాను. ఇదొక డివోషనల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ సినిమా అయినప్పటికీ ఇందులో ఫ్యామిలీ డ్రామా, యాక్షన్‌ సీక్వెన్స్, వాణిజ్యపరమైన అంశాలు కూడా మిళితమై ఉన్నాయి. ఒక వంశంలోని వ్యక్తులు 33 ఏళ్ల వయసు దాటిన తర్వాత చనిపోవడం అనే పాయింట్‌ మా సినిమా ట్రైలర్‌లో కనిపించింది. ఈ పాయింట్‌ ‘మురారి’ సినిమాను కూడా గుర్తు చేస్తున్నప్పటికీ మా ‘మహేంద్రగిరి వారాహి’ కథ, స్క్రీన్‌ప్లే చాలా భిన్నంగా ఉంటాయి.

దర్శకుడు సంతోష్‌ ఈ సినిమా కంటే ముందు నాకు వేరే కథ చెప్పాడు. కానీ ఆ కథ నచ్చలేదు. ఆ తర్వాత ‘మహేంద్రగిరి వారాహి’ కథ చెప్పగా నచ్చింది. వేదాలు, పురాణాల పట్ల మంచి అవగాహన ఉన్న సంతోష్‌కి ఇది సరైన సబ్జెక్ట్‌ అనిపించింది. ఈ చిత్రం ఇంటర్వెల్, ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్‌ ఎపిసోడ్స్‌ అద్భుతంగా ఉంటాయి. ముందు ఈ సినిమాను ఇంత బిగ్‌ స్కేల్‌లో తీస్తారని అనుకోలేదు. షూటింగ్‌ 60 శాతం పూర్తయిన తర్వాత నిర్మాత లక్ష్మణ్‌గారు మాకు తోడయ్యారు. ఈ సినిమాలోని ఓ సీరియస్‌ కీ రోల్‌ను సిద్ధు జొన్నలగడ్డ చేశాడు. సంగీత దర్శకుడు అనూప్‌ రూబెన్స్‌ గారి రీ–రికార్డింగ్, మ్యూజిక్‌ ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి.

ప్రస్తుతం మైథాలజీ ట్రెండ్‌ నడుస్తోందని ఈ సినిమా చేయలేదు. ‘కార్తికేయ 2, ‘కాంతార’ సినిమాల కంటే ముందే ఈ సినిమా టైటిల్‌ను రిజిస్టర్‌ చేయించాం. కాకపోతే ఆ సమయంలో మా సినిమా మేకింగ్‌కు సరైన నిర్మాత సహకారం లేదు. ఏడాది ఆ తర్వాత మధుగారు, ఆ తర్వాత లక్ష్మణ్‌గారు ఈ సినిమా ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు. 

ఇటీవల జరిగిన మా సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అఖిల్‌ గురించి సరదాగా మాట్లాడాను. తనని అయ్యగారు అని పిలుస్తుంటారట. అక్కినేనిగారి అందరి మనవళ్లలో నేనే పెద్దవాడిని. పెద్దవాడిని కాబట్టి అయ్యగారు అంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో సరదాగా అన్నాను. అది ట్రెండ్‌ అయ్యిందని మా వాళ్ళు నాకు చెప్పారు.  

Videos

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)