Breaking News

హైరింగ్‌ జోరు

Published on Wed, 09/09/2026 - 00:12

న్యూఢిల్లీ: దేశీయంగా ఆగస్టులో వైట్‌ కాలర్‌ ఉద్యోగుల నియామకాలు జోరుగా జరిగాయి. గతేడాది ఆగస్టుతో పోలిస్తే 14 శాతం పెరిగాయి. ఇందుకు ఆటో, హెల్త్‌కేర్, రిటైల్‌ తదితర రంగాలు దన్నుగా నిల్చాయి. ఇన్ఫో ఎడ్జ్‌కి చెందిన నౌకరీడాట్‌కామ్‌ నివేదికలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. దీనికి సంబంధించిన నౌకరీ జాబ్‌స్పీక్‌ ఇండెక్స్‌ గతేడాది ఆగస్టులో 2,664గా ఉండగా ఈ ఏడాది 3,028కి చేరింది. ఐటీయేతర, ఐటీ విభాగాలవ్యాప్తంగా, వివిధ స్థాయిల్లో అనుభవమున్న వారిని కంపెనీలు గణనీయంగా నియమించుకున్నాయి. 

అయితే, ఈ రిక్రూట్‌మెంట్స్‌ని పండగ సీజన్‌ కోణంలో చూడాల్సి ఉంటుందని ఇన్ఫో ఎడ్జ్‌ (ఇండియా) ఎండీ, సీఈవో హితేష్‌ ఓబెరాయ్‌ తెలిపారు.  తదుపరి హైరింగ్‌ ధోరణులపై స్పష్టత రావచ్చని ఆయన పేర్కొన్నారు. నౌకరీడాట్‌కామ్‌ సైట్‌లో ప్రతి నెలా వచ్చే కొత్త ఉద్యోగాల పోస్టింగ్స్, రిక్రూటర్లు చేసే సెర్చ్‌ల ఆధారంగా భారత్‌లో జాబ్‌ మార్కెట్, నియామకాల ధోరణులను ఈ సూచీ ట్రాక్‌ చేస్తుంది. ఆఫీసు ఉద్యోగాలను వైట్‌–కాలర్‌ జాబ్స్‌గా వ్యవహరిస్తారు. రిపోర్ట్‌ ప్రకారం.. 

ఆగస్టులో ఆటో రంగంలో అత్యధికంగా 19 శాతం హైరింగ్‌ వృద్ధి నమోదైంది. ఈ బాటలో హెల్త్‌కేర్‌ 16%, రిటైల్‌ 15%,  ఇన్సూరెన్స్‌ 12%, ఐటీ 11%, బ్యాంకింగ్‌ 10%, ఎఫ్‌ఎంసీజీ 10%, బీపీవో/ఐటీఈఎస్, ఆయిల్‌..గ్యాస్, రియల్‌ ఎస్టేట్‌ 8% చొప్పున వృద్ధి చెందాయి. ఫార్మా/బయోటెక్‌లో రిక్రూట్‌మెంట్‌ ఫ్లాట్‌గా ఉండగా, ఆతిథ్యం..ట్రావెల్‌ రంగాల్లో హైరింగ్‌ 4 శాతం, విద్యా రంగంలో 8 శాతం తగ్గింది. 

ఎక్స్‌పీరియన్స్‌పరంగా చూస్తే ఫ్రెషర్ల రిక్రూట్‌మెంట్‌ 15 శాతం, 4–7 ఏళ్ల అనుభవం ఉన్న వారి హైరింగ్‌ 10 శాతం పెరిగింది. 8–12 ఏళ్ల అనుభవం ఉన్న వారి హైరింగ్‌ 16 శాతం, 13–16 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌ (18 శాతం), 16 ఏళ్లు పైగా ఉంటే 13 శాతం మేర రిక్రూట్‌మెంట్‌ పెరిగింది. 
 మెట్రో నగరాలలో 23 శాతం హైరింగ్‌తో హైద రాబాద్‌ అగ్రస్థానంలో నిల్చింది. కోల్‌కతా (22 శాతం), చెన్నై (20 శాతం) ఆ తర్వాత రెండు స్థానాల్లో ఉన్నాయి.  

Videos

చిన్న శ్రీను పార్టీ మారడంపై బొత్స హాట్ కామెంట్స్

హైదరాబాద్ లో ఘోర రోడ్డు ప్రమాదం

వైఎస్ జగన్ 27% IR ఇస్తామన్నారు, ఇచ్చారు...! నువ్వు ఏం ఇచ్చావ్ బాబు

అసలు గేమ్ ఇదేనా..? అడ్డంగా దొరికిపోయింది.. ఇక నందన చాప్టర్ క్లోజ్!

AlphaGeo: డేంజర్ జోన్ లో హైదరాబాద్.. ప్రకృతి వార్నింగ్

YS జగన్ పాదయాత్ర డేట్ ఫిక్స్

వివేకా కేసులో వీడిన మిస్టరీ...? కారుమూరి సంచలన వ్యాఖ్యలు

తెలియదు.. గుర్తులేదు.. మర్చిపోయా.. పోలీసులకు సాదిక్ ఖాన్ సమాధానాలు?

Paradise: ఆ పాట లేకుండానే రిలీజ్.?

2029.. ఏ ఒక్కడిని వదిలిపెట్టను... అనిల్ కుమార్ యాదవ్ మాస్ వార్నింగ్

Photos

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)

+5

భార్య ప్రేమలో నాగశౌర్య.. క్యూట్‌ మూమెంట్స్‌ (ఫొటోలు)

+5

ఓయూలో ఘనంగా 85వ స్నాతకోత్సవం (ఫోటోలు)

+5

‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. (ఫొటోలు)

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)