విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి
Breaking News
ఏపీలో చిరంజీవి కూమార్తె సుస్మితకు పదవి
Published on Tue, 09/08/2026 - 14:10
మెగాస్టార్ చిరంజీవి పెద్ద కూతురు, ఫ్యాషన్ డిజైనర్, సినీ నిర్మాత కొణిదెల సుస్మితకు ఆంధ్రప్రదేశ్‌లో పదవి దక్కింది. విజయవాడలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఇంద్రకీలాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా ఆమె నియమితులయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ ధర్మాదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు అధికారికంగా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఆలయానికి వచ్చే భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడం, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలపై సూచనలు చేయడం, ప్రత్యేక ఉత్సవాల నిర్వహణలో భాగస్వామ్యం కావడం వంటి అంశాల్లో సుస్మిత కొణిదెల తన సేవలను అందించనున్నారు. ఇదిలా ఉంటే.. తెలంగాణ ప్రభుత్వం కూడా ఇప్పటికే మెగా కుటుంబానికి ఓ పదవిని ఇచ్చింది. తెలంగాణలోని యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం పాలకమండలి సభ్యురాలిగా చిరంజీవి సతీమణి సురేఖను నియమించిన సంగతి తెలిసిందే.
ఇక సుస్మిత విషయానికొస్తే.. ఫ్యాషన్ డిజైనర్‌గా కెరీర్‌ని ప్రారంభించిన ఆమె.. ప్రస్తుతం సినీ నిర్మాతగా రాణిస్తున్నారు. గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్ అనే నిర్మాణ సంస్థను స్థాపించి.. వరుస సినిమాలు నిర్మిస్తున్నారు. తన తండ్రి చిరంజీవిని హీరోగా పెట్టి ఆమె నిర్మించిన చిత్రం ‘మన శంకర వర ప్రసాద్ గారు’ ఈ సంక్రాంతికి విడుదలై విజయాన్ని అందుకుంది.
Tags : 1