Breaking News

అప్‌స్టాక్స్‌తో యూఎస్‌ స్టాక్స్‌

Published on Tue, 09/08/2026 - 04:36

న్యూఢిల్లీ: దేశీ ఇన్వెస్టర్లు యూఎస్‌ స్టాక్స్‌ కొనుగోలు చేసేందుకు వీలుగా అప్‌స్టాక్స్‌ సొంత ప్లాట్‌ఫామ్‌ను ఆవిష్కరించింది. దీంతో యూఎస్‌లో లిస్టయిన 8,000కుపైగా కంపెనీల షేర్ల కొనుగోలుకి వీలు చిక్కనుంది. అంతేకాకుండా మరో 2,000 ఎక్సే్ఛంజ్‌ ట్రేడెడ్‌ ఫండ్స్‌(ఈటీఎఫ్‌లు)లోనూ ఇన్వెస్ట్‌ చేయవచ్చని ఒక ప్రకటనలో స్టాక్‌ ట్రేడింగ్‌ అండ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ అప్‌స్టాక్స్‌ తెలియజేసింది. 

యాప్‌ ద్వారా గ్లోబల్‌ దిగ్గజాలు యాపిల్, టెస్లా, అమెజాన్, గూగుల్‌ తదితర షేర్లను సొంతం చేసుకోవచ్చని తెలియజేసింది. దీనిలో భాగంగా ఇన్వెస్టర్లు కనీసం 1 డాలరుతో పెట్టుబడులు ప్రారంభించవచ్చని వెల్లడించింది. తద్వారా పూర్తి షేరుని కాకుండా దీనిలో కొంత భాగాన్ని సైతం కొనుగోలు చేయవచ్చని వివరించింది. అంతర్జాతీయ మార్కెట్లో పెట్టుబడులు దేశీ వెల్త్‌ ఎకోసిస్టమ్‌ తదుపరి దశ వృద్ధిని ప్రతిబింబిస్తాయని అప్‌స్టాక్స్‌ సహవ్యవస్థాపకుడు, సీఈవో రవి కుమార్‌ పేర్కొన్నారు. దేశీ ఇన్వెస్టర్లు ఈ ప్లాట్‌ఫామ్‌ ద్వారా గ్లోబల్‌ స్టాక్స్‌లో ఇన్వెస్ట్‌ చేయవచ్చని తెలియజేశారు.  

పెట్టుబడులు ఇలా 
వినియోగదారులు తమ దేశీ బ్యాంక్‌ ఖాతాల ద్వారా రూపాయలలోనే పెట్టుబడులు చేపట్టవచ్చని అప్‌స్టాక్స్‌ పేర్కొంది. ఇవి ఆటోమేటిగ్గా డాలర్లలోకి మారి్పడి అవుతాయని తెలియజేసింది. ఇన్వెస్టర్లు యూఎస్‌ మార్కెట్ల ట్రేడింగ్‌ సమయంకానప్పుడు కూడా ఆఫ్టర్‌ మార్కెట్‌ ఆర్డర్ల ద్వారా కొనుగోలు ఆర్డర్లు నమోదు చేయవచ్చని వివరించింది. స్పేస్‌ ఎక్స్‌ప్లొరేషన్, ఏఐతోపాటు.. ఇతర వర్ధమాన టెక్నాలజీలు, ఇతర రంగాలలో పెట్టుబడులకు యూఎస్‌ స్టాక్స్‌ వీలు కలి్పస్తాయని పేర్కొంది. ఆర్‌బీఐ అనుమతించిన ఎల్‌ఆర్‌ఎస్‌ ద్వారా మార్గదర్శకాలకు లోబడి ఇందుకు అవకాశముంటుందని తెలియజేసింది.

 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)