Breaking News

గత 30 ఏళ్లు వేరు.. రాబోయే 30 ఏళ్లు వేరు!

Published on Mon, 09/07/2026 - 08:24

గత అనేక సంవత్సరాలుగా చూస్తే, ‘‘కొన్ని అంచనాలను ఏమాత్రం సందేహించాల్సిన అవసరం లేదు, వాటినే ప్రాతిపదికగా చేసుకుని పోర్ట్‌ఫోలియోను నిర్మించుకోవచ్చు’’ అనే విధంగా పెట్టుబడుల ధోరణులు ఉంటున్నాయి. ఆ అంచనాలేమిటంటే, ‘‘గ్లోబలైజేషన్‌ మరింతగా పెరుగుతుంది. ద్రవ్యోల్బణం చాలా మటుకు అదుపులోనే ఉంటుంది. సరఫరా వ్యవస్థలు మరింత సమర్ధవంతంగా మారతాయి. వృద్ధి బలహీనపడినప్పుడల్లా సెంట్రల్‌ బ్యాంకులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దుతాయి.’’ ఇదిగో, అచ్చం ఇలాగే జరుగుతుందనే ఊహలే, మొత్తం ఒక తరం ఇన్వెస్టర్ల పెట్టుబడుల అలవాట్లు, పోర్ట్‌ఫోలియో నిర్మాణానికి ప్రాతిపదికగా నిల్చాయి. అయితే, ఇక్కడ ప్రధాన సమస్యేమిటంటే, భవిష్యత్తు కూడా గతంలోలాగానే ఉంటుందనుకోవడమే.  

నిజానికి రాబోయే 30 ఏళ్లు.. గత 30 ఏళ్లకు పూర్తి భిన్నంగా ఉండొచ్చు. కోవిడ్‌ మహమ్మారి పరిస్థితుల్లో.. అంతర్జాతీయ సరఫరా వ్యవస్థలు ఎంత బలహీనమైనవో బట్టబయలైంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలనేవి .. వాణిజ్య సంబంధాలను మార్చివేశాయి. అన్ని దేశాలు మిగతా విషయాల కన్నా, ఎలాంటి పరిస్థితులు తలెత్తినా ఎదుర్కోగలిగే సామర్థ్యాలను పెంపొందించుకునేందుకు, గ్లోబల్‌ వ్యవస్థలపై ఆధారపడటం కన్నా దేశీయంగా తయారీకి, తమ తమ వ్యూహాత్మక ప్రయోజనాలకు ప్రాధాన్యమిచ్చే ధోరణి పెరుగుతోంది. ఇవేవో తాత్కాలిక పరిణామాలు కావు. ఇవి వ్యవస్థ స్వరూపంలో చోటు చేసుకుంటున్న మార్పులను ప్రతిబింబిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గత చరిత్రే ప్రాతిపదికగా పోర్ట్‌ఫోలియోని నిర్మించుకోవచ్చన్న అభిప్రాయాన్ని కూడా ఇన్వెస్టర్లు పునఃసమీక్షించుకోవాలి.  

నేటి పరిస్థితుల్లో వైవిధ్యం ఆవశ్యకత

ఒకప్పుడు ఏదైనా అసాధారణ పరిస్థితి తలెత్తితే తప్ప తీవ్ర హెచ్చుతగ్గులు ఉండేవి కావు. కానీ ప్రస్తుతం మార్కెట్లో ఇవి సర్వసాధారణంగా మారిపోయాయి. ఎప్పుడైనా సరే ఈ ఒడిదుడుకులను ఎదుర్కొనేందుకు డైవర్సిఫికేషన్‌ అనేది చక్కని ఇన్వెస్ట్‌మెంట్‌ సూత్రం. కానీ ప్రస్తుతం దీన్ని పాటించే తీరులో మార్పులు వచ్చేశాయి. గత కొద్ది దశాబ్దాలుగా వ్యాపారాలు, మార్కెట్‌ వృద్ధి అవకాశాలు కాస్త ఊహలకు అందే విధంగా ఉండేవి. వాటిని బేరీజు వేసుకుని పెట్టుబడులు పెట్టడం ద్వారా ఇన్వెస్టర్లు ప్రయోజనాలు పొందుతూ వచ్చారు. కానీ ప్రస్తుత బహుళధృవ ప్రపంచంలో, చాలా మటుకు వృద్ధికి ఊతమిచ్చే అంశాలపై అనిశ్చితి ఉంటోంది. వివిధ ప్రాంతాలవ్యాప్తంగా ఆర్థిక వృద్ధి విషయంలో అంతరాలు మరింత పెరుగుతున్నాయి.

ద్రవ్యోల్బణాన్ని కట్టడి చేయడమనేది ఊహించిన దానికన్నా కష్టంగా ఉంటోంది. పాలసీపరమైన నిర్ణయాలు, మార్కెట్లపై మరింత ప్రభావం చూపుతున్నాయి. భౌగోళిక–రాజకీయ పరిణామాలు రాత్రికి రాత్రే ఇన్వెస్టర్ల సెంటిమెంటును మార్చేసే విధంగా ఉంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రాబడుల కోసం ఒకే వనరుపై ఆధారపడటమనేది రిస్కీ వ్యవహారంగా మారుతోంది. ఇప్పుడు ఇన్వెస్టర్లకు ప్రధాన సవాలేమిటంటే, రాబోయే రోజుల్లో బాగా రాణించే పెట్టుబడి సాధనాన్ని గుర్తించడం కాదు. దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలనేవి ఏ ఒక్క ఆర్థిక పరిణామంపైనో, పాలసీ నిర్ణయంపైనో, మార్కెట్‌ వలయాలపైనో లేదా ఇన్వెస్ట్‌మెంట్‌ థీమ్‌పైనో ఆధారపడినదై ఉండకుండా చూసుకోవడమే అతి పెద్ద సవాలుగా మారింది.  

ప్రధాన లక్ష్యం ఏంటంటే..

సాధారణంగా రిస్క్‌ని తగ్గించుకునేందుకు ఉపయోగపడే విధానంగా డైవర్సిఫికేషన్‌ని నిర్వచిస్తారు. ఈ నిర్వచనం సరైనదే అయినప్పటికీ, సంపూర్ణమైనది కాదు. వాస్తవానికి భవిష్యత్తులో అనిశ్చితి ఉంటుందని, రాబోయే దశాబ్దంలో ఏ ఆర్థిక విధానాలు, మార్కెట్‌ సెగ్మెంట్, సెక్టార్‌ లేదా భౌగోళిక ప్రాంతం ఆధిపత్యం ఉంటుందనేది ఏ ఇన్వెస్టరు కూడా స్థిరంగా అంచనా వేయలేరనే విషయాన్ని గుర్తించడమే దీని ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు మారిపోతున్న నేపథ్యంలో మార్కెట్‌ ధోరణులకు అనుగుణంగా డైవర్సిఫికేషన్‌ ఉండాలి. దీన్ని ఆకళింపు చేసుకుంటే, భవిష్యత్తనేది గతం తరహాలోనే ఉండకపోవచ్చనేది గుర్తించి, కేవలం ఒకే అంచనా మీద ఆధారపడకుండా, రాబోయే రోజుల్లో ఎలాంటి సవాళ్లు ఎదురైనా, నిలబడగలిగేలా పోర్ట్‌ఫోలియో ఉండేలా జాగ్రత్తపడేందుకు వీలవుతుంది. సాధారణంగా ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటే వృద్ధి ఆధారిత అసెట్స్‌ ప్రయోజనం పొందుతాయి. అలాగే అనిశ్చితిలో ఫిక్స్‌డ్‌ ఇన్‌కం సాధనం స్థిరత్వాన్ని అందించవచ్చు.

ఇక ద్రవ్యోల్బణం,  భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు ఏర్పడినప్పుడు, పెట్టుబడి విలువ కోల్పోకుండా భద్రంగా కాపాడే సాధనంగా పసిడికి చరిత్ర ఉంది. దేశీయ మార్కెట్లలో దొరకని అవకాశాలను అంతర్జాతీయ పెట్టుబడి సాధనాలు అందుబాటులోకి తేవచ్చు. గతంలో ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లు, భౌగోళిక రాజకీయ పరిస్థితులు, సాంకేతిక ఆవిష్కరణల్లాంటి పరిణామాలు దాదాపు ఒకేసారి కలిసికట్టుగా వచ్చేవి. పెట్టుబడులపై రాబడులకు చోదకాలుగా నిలిచేవి. కానీ ఇప్పుడు అన్నీ ఏకకాలంలో జరగడం లేదు. పరిస్థితులను బట్టి ఒక్కో సాధనం ఒక్కో సమయంలో ఒక్కో రకం పనితీరు కనపరుస్తోంది. కనుక ప్రస్తుతం ఏదో ఒకే అసెట్‌పై అతిగా ఆధారపడి, దీర్ఘకాలిక ఆర్థిక ప్రణాళికలను వేసుకోవడం, రిసు్కతో కూడుకున్న వ్యవహారంగా ఉంటుంది.

ఇదీ చదవండి: మీ వీధిలోనే ఉన్నారు ఫైనాన్స్‌ గురువులు

భవిష్యత్తులో వృద్ధి కేవలం ఒకే మార్కెట్, ఒకే ప్రాంతం, లేదా ఒకే రంగం నుంచే వచ్చే అవకాశాలు లేవు. ఆరి్టఫిíÙయల్‌ ఇంటెలిజెన్స్, హెల్త్‌కేర్, క్లీన్‌ ఎనర్జీ, అధునాతన తయారీ, ఆర్థిక సాంకేతికత, డిజిటల్‌ మౌలిక సదుపాయాలవ్యాప్తంగా ఏకకాలంలో అనేక ఆవిష్కరణలు చోటు చేసుకుంటున్నాయి. వివిధ రకాల డెమోగ్రాఫిక్స్, సాంకేతిక, ఆర్థిక పోకడలతో వివిధ ప్రాంతాలు ప్రయోజనం పొందుతున్నాయి. దీనితో రేపటి భవిష్యత్తులో అవకాశాలనేవి, చిరపరిచితమైన కొద్ది అంశాలకే పరిమితం కాకుండా బహుళ మార్కెట్లు, ఇన్వెస్ట్‌మెంట్‌ థీమ్‌లవ్యాప్తంగా విస్తృతంగా ఉండొచ్చు. ఈ నేపథ్యంలో పోర్ట్‌ఫోలియో డైవర్సిఫికేషన్‌ అనేది ఒక రక్షణాత్మక వ్యూహంగానే కాకుండా వృద్ధి అవకాశాలను అందిపుచ్చుకునేందుకు ఒక చక్కని మార్గంగా కూడా ఉపయోగపడుతుంది. డైవర్సిఫికేషన్‌ వల్ల కచ్చితమైన లాభాలు వస్తాయని కాదు కానీ, గతంతో పోలిస్తే భిన్నంగా ఉండే భవిష్యత్తు కోసం ఇన్వెస్టర్లు సర్వసన్నద్ధంగా ఉండేందుకు ఇది తోడ్పడుతుంది.

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)