Breaking News

నిర్మాతల సంక్షేమమే మా లక్ష్యం 

Published on Mon, 09/07/2026 - 04:58

లక్డీకాపూల్‌: చిన్న నిర్మాతల సమస్యలపై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి, త్వరలో ప్రకటిస్తామని తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ (టీఎఫ్‌పీసీ) అధ్యక్షుడు సి. కల్యాణ్‌ వెల్లడించారు. చిన్న నిర్మాతలు తమ సినిమాలను విడుదల చేసేందుకు అనేక ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల్లో దాదాపు 95 శాతం మంది నిర్మాతలు మద్దతు ఇవ్వడం తమపై ఉన్న నమ్మకానికి నిదర్శనమన్నారు. నిర్మాతల సంక్షేమమే తమ లక్ష్యం అని, వారికి లోటు రాకుండా చూసుకుంటామని హామీ ఇచ్చారు. 

నిర్మాతలందరూ ఒకే తాటిపై నడవాలని పిలుపునిచ్చారు. గత రెండున్నరేళ్లుగా అందరూ కలిసి ముందుకు రాలేకపోయారని, ఇకపై కలిసి పని చేయాలని సి. కల్యాణ్‌ అన్నారు. ఆదివారం జరిగిన తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ఎన్నికలలో మొత్తం 1,168 ఓట్లకు గాను 643 మంది సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.

 సి. కల్యాణ్‌ అధ్యక్షుడిగా, ఉపాధ్యక్షులుగా మోహన్‌ వడ్లపట్ల, కేఎల్‌ దామోదర్‌ ప్రసాద్, కోశాధికారిగా చదలవాడ శ్రీనివాసరావు, జాయింట్‌ సెక్రటరీలుగా అమ్మిరాజు కానుమిల్లి, టి. రామసత్యనారాయణ గెలుపొందారు. ఎగ్జిక్యూటివ్‌ కమిటీ సభ్యులుగా పద్మిని నాగులపల్లి, రవిశంకర్‌ యలమంచిలి, సునీల్‌ నారంగ్, మోహన్‌ గౌడ్, కృష్ణప్రసాద్‌ శివలెంక, డీవీవీ దానయ్య, వంశీ నందిపాటి, పల్లి కేశవరావు, డీఎస్‌ శ్రీనివాసరావు, శ్రీనివాసరావు వజ్జా, జె. పుల్లారావు, బాపిరాజు బల్లిపాడు, రామకృష్ణ గౌడ్, నయీమ్‌ అహ్మద్‌ ఎస్‌.కె., కె. నిరంజన్‌ రెడ్డి ఎన్నికయ్యారు.    

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)