Breaking News

హీరోగా ఎంట్రీ ఇస్తున్న ప్రముఖ నటుడి కొడుకు.. డెబ్యూ మూవీ ఇదే!

Published on Sun, 09/06/2026 - 17:42

ప్రముఖ నటుడు శరత్ బాబు కుమారుడు ఆయుష్ తేజస్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి కట్టా జయ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. ఆస్ట్రేలియాకు చెందిన సీహెచ్ దివ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. నానిషా హీరోయిన్‌గా నటిస్తున్నారు. తాజాగా ఈ చిత్ర పూజా కార్యక్రమం అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ ముఖ్య అతిథిగా హాజరై చిత్రానికి క్లాప్ కొట్టి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ సందర్భంగా దర్శకుడు కట్టా జయ్ మాట్లాడుతూ.. ‘మా చిత్రం గ్రాండ్‌గా అన్నపూర్ణా స్టూడియోస్‌లో ప్రారంభం కావడం చాలా ఆనందంగా ఉంది. శరత్ బాబు గారి కుమారుడు ఆయుష్ తేజస్ మా సినిమాలో హీరోగా నటించడం ఎంతో సంతోషంగా ఉంది. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టిన వి.వి. వినాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా తొలి ప్రెస్ మీట్‌కు విచ్చేసిన మీడియా మిత్రులకు కృతజ్ఞతలు. ఇది మా డెబ్యూ మూవీ. ఈ చిత్రంలో పలువురు ప్రముఖ నటీనటులు భాగమవుతున్నారు. ప్రేక్షకులు, మీడియా మా సినిమాను ఆదరించి, ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను’అన్నారు.

హీరో ఆయుష్ తేజస్ మాట్లాడుతూ..‘మా సినిమా కథపై పూర్తి నమ్మకంతో, ఒక గొప్ప విజయాన్ని సాధిస్తామని విశ్వసిస్తున్నాం. మా సినిమా ప్రారంభోత్సవానికి విచ్చేసి క్లాప్ కొట్టిన వి.వి. వినాయక్ సార్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేతుల మీదుగా మా సినిమా ప్రారంభం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది మా టీమ్‌కు సంబంధించిన తొలి ప్రెస్ మీట్. మీడియా మిత్రులకు, ప్రేక్షకులకు నా ధన్యవాదాలు. మా సినిమాను అందరూ ఆదరించి, సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను’ అన్నారు.
 

Videos

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

కడప మెగా డీఎస్సీలో మరో బాగోతం.. నకిలీ కుల ధృవీకరణతో ఉద్యోగమా..?

చైనా మాస్టర్స్ విజేతలకు YS జగన్ అభినందనలు

Photos

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విశాఖ : రహదారిపై బైఠాయించి సచివాలయ ఉద్యోగుల ఆందోళన (ఫొటోలు)