Breaking News

12 ఏళ్లకే ‘వానర సేన’ను నడిపించిన ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా?

Published on Sat, 09/05/2026 - 10:16

తన పన్నెండేళ్ల వయసులో పిల్లల సైన్యాన్ని నడిపిన ఈ చిన్నారి.. దేశం కోసం ఐదేళ్ల వయసులోనే తనకు ఎంతో ఇష్టమైన బొమ్మను త్యాగం చేసింది. ఆ చిన్నారి మరెవరో కాదు.. భారత ప్రధానిగా చరిత్ర సృష్టించిన ఇందిరా గాంధీ!

మన దేశ ఏకైక మహిళా ప్రధాని ఇందిరా గాంధీకి ఐదేళ్ల వయసులో ఒక బొమ్మ అంటే చాలా ఇష్టం. అది ఇంగ్లాండ్‌ నుంచి తండ్రి నెహ్రూ తెచ్చి ఇచ్చింది. ఆ సమయంలో మహాత్మా గాంధీ ‘విదేశీ వస్తువులను బహిష్కరించండి’ అని పిలుపునిచ్చారు.

ఆ పిలుపుతో ఇందిర తన విదేశీ బట్టలన్నింటినీ మంటల్లో వేసింది. ఒక స్నేహితుడు ‘నీ బొమ్మ కూడా విదేశీదే’ అని చెప్పాడు. చిన్నారి ఇందిర చాలా రోజులు ఆలోచించి, బాధపడుతూనే ఆ బొమ్మను చితిలో వేసింది. బొమ్మ కంటే దేశం ముఖ్యం మరి.

ఇందిరకు 12 ఏళ్లు వచ్చేసరికి 1930లో ‘వానర సేన’ అనే పిల్లల సైన్యాన్ని స్థాపించింది. బ్రిటిష్‌ పోలీసులు పిల్లలను అనుమానించరు కదా, అందుకే ఈ పిల్లలు రహస్యంగా ఉత్తరాలు చేరవేసేవారు, జెండాలు కుట్టేవారు, ఉద్యమకారులకు సహాయం చేసేవారు. మహనీయులు అలా బాల్యం నుంచే గొప్ప పనులు చేస్తారు.

ఇవీ చదవండి: అంకెలే ఆమె మనోబలం

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!