DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?
Breaking News
మీ షాపింగ్ బిల్లు పేపరు తెల్లగా మారుతోందా? అయితే ఇదే కారణం!
Published on Sat, 09/05/2026 - 09:26
మనం షాపింగ్ చేసినప్పుడు ఇచ్చిన రిసిప్ట్‌లలో కొన్ని రోజులకే అక్షరాలు కనిపించకుండా తెల్లగా మారిపోతుంటాయి. వీటిల్లో కొన్ని ముఖ్యమైన బిల్లులు కూడా ఉంటాయి. మరి వాటిని ఎలా దాచుకోవాలి?
షాపింగ్ మాల్స్‌లో సాధారణంగా రిసిప్ట్‌ల కోసం థర్మల్ పేపర్ని ఉపయోగిస్తుంటారు. ఈ పేపర్ పై వేడికి స్పందించే రసాయనాలు (ల్యూకో డైస్) పూతగా ఉంటాయి. ప్రింటర్ ప్రింట్ చేసేటప్పుడు వేడి తగలడంతో అక్కడ నల్లటి అక్షరాలు ఏర్పడతాయి. అలాగే ఈ పేపర్‌పై ఎండతగిలినా, గాలి తగిలినా అక్షరాలు మాయమవుతుంటాయి. అందువల్ల ముఖ్యమైన బిల్లులను వెంటనే మొబైల్లో స్పష్టమైన ఫోటో తీసి ఉంచుకోవడం లేదా స్కాన్ చేయడం అత్యంత సురక్షితమైన మార్గం.
ప్లాస్టిక్ ఫోల్డర్లు లేదా వాలెట్లలో ఉంచకుండా, పేపర్ ఎన్వెలప్లలో ఉంచి వెలుతురు, వేడి తగలని చల్లని ప్రదేశంలో దాచండి. లేదా బిల్లు తీసుకునేపుడే ఇమెయిల్ లేదా మెసేజ్ ద్వారా డిజిటల్ రిసిప్ట్లు పంపమని కోరండి. కొంతమంది బిల్లు చిరిగిపోకుండా సెల్లోటేప్ వేస్తుంటారు. కానీ సెల్లోటేప్లోని రసాయనాలు కొన్ని వారాల్లోనే ప్రింట్‌ని పూర్తిగా చెరిపివేస్తాయి.
ఇవీ చదవండి: బబుల్ రాప్ ఎలా పుట్టిందో తెలిస్తే షాకే!
Tags : 1