Breaking News

'ఎపిక్‌' లాంటి సినిమాలు చేయడం చాలా కష్టం: రష్మిక

Published on Sat, 09/05/2026 - 03:46

‘‘ఎపిక్‌’ ట్రైలర్‌ చాలా నచ్చింది. మంచి రొమాంటిక్, కామెడీ వైబ్‌లో ఉంది. ఇలాంటి సినిమాలు చేయడం చాలా కష్టం. ఈ నెల 11న మీతో (ప్రేక్షకులతో), యూనిట్‌తో కలిసి ఈ సినిమాను థియేటర్లో చూసేందుకు ఎదురు చూస్తున్నాను. ఈ నెల 10న  ప్రీమియర్స్‌ వేస్తున్నారు... చూసి ఎంజాయ్‌ చేయండి’’ అని రష్మిక మందన్నా పేర్కొన్నారు. ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవీ చైతన్య జోడీగా నటించిన చిత్రం ‘ఎపిక్‌–ఫస్ట్‌ సెమిస్టర్‌’. 

ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో శ్రీకర స్టూడియోస్‌ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలవుతోంది. శుక్రవారం నిర్వహించిన ఈ చిత్రం ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి ముఖ్య అతిథిగా హాజరైన హీరోయిన్‌ రష్మిక మందన్నా మాట్లాడుతూ– ‘‘ఎపిక్‌’ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌కి వస్తారా? అని ఆనంద్‌ మెసేజ్‌ చేశాడు. ‘రణబాలి’ షూట్‌లో హైదరాబాద్‌లో ఉన్నాను. తప్పకుండా వస్తానని, వచ్చేశాను. ఆనంద్‌ చాలా కష్టపడతాడు. తన సినిమాలు బాగా ఆడాలి, మంచి వసూళ్లు రావాలి. వైష్ణవి కోసం అద్భుతమైన పాత్రలు రాస్తుండటం గొప్ప విషయం. 

ఆదిత్య హాసన్‌ ఈ మూవీని అద్భుతంగా తీశారనిపిస్తోంది’’ అని తెలిపారు. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘వదినమ్మతో (రష్మిక) ఇంట్లో ఎక్కువగా మాట్లాడను. కానీ, ‘ఎపిక్‌’ ప్రమోషన్స్‌ గురించి నన్ను అడిగి మరీ తెలుసుకుని సపోర్ట్‌ చేశారు. విజయ్‌లాంటి అన్నయ్య, రష్మికలాంటి వదినమ్మ ఉన్నందుకు అదృష్టవంతుణ్ణి. ‘ఎపిక్‌’ భావోద్వేగమైన, అందమైన సినిమా’’ అని చెప్పారు.

Videos

DSCలో బయటపడ్డ దొంగ సర్టిఫికెట్లు.. జైలా? రాజీనామానా?

గోదావరిలోకి దూకిన ఒకే కుటుంబానికి చెందిన నలుగురు

అగ్ని పరీక్షలో గెలిచి హౌస్ లోకి వెళ్లేది ఎవరంటే?

CBI ఎంక్వైరీ వేయండి... నీకు మంత్రిగా ఉండే అర్హత లేదు రాజీనామా చేయ్

సాక్షి అకౌంట్ల బ్లాక్ పై సీనియర్ జర్నలిస్టులు సీరియస్

ప్రభుత్వమే ఇబ్బంది పెడితే ఎవరికి చెప్పుకోవాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగుల గగ్గోలు

తమ్ముడి సర్టిఫికెట్లు పెట్టిన అన్నకు టీచర్ ఉద్యోగం.. నిజం ఒప్పుకున్న పెద అప్పల్రాజు

బయటపడ్డ లోకేష్ DSC అక్రమాల పుట్ట బాబు వెన్నులో వణుకు...

వైభవ్ పై BCCI ప్రత్యేక నిఘా

ఎవరు మంత్రి కావాలి..? ఎవరి మాట వినాలి?

Photos

+5

ఏడాదిన్నర తర్వాత వస్తున్న వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!