మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
ఇంగ్లీష్‌లో అనర్గళంగా మట్లాడాలనుకుంటే..ఆమె ఇంటర్వ్యూ చూడాల్సిందే!
Published on Fri, 09/04/2026 - 15:45
చాలామంది ఇప్పుడు సునాయాసం ఆంగ్ల భాష నేర్చుకుంటున్నారు. ఏఐ పుణ్యమా అని మొబైల్లోనే ఈజీగా నేర్చుకుంటున్నారు. కానీ మంచి పదజాలంతో సందర్భానికి అనుగుణమైన పద ప్రయోగంతో ఆకట్టుకునేలా నైపుణ్యం సాధించాలంటే ఆంగ్ల భాషపై మంచి పట్టు ఉండాలి. స్పోకెన్ ఇంగ్లీష్ మాదిరిగా పొడి పొడి పదాలతో కాకుండా చాలా శక్తిమంతమైన ఇడియమ్స్తో అనర్గళంగా మాట్లాడుతుంటే ఎవ్వరైన ఫిదా అవ్వుతారు.
అంతేగాదు మన పనులను కూడా సునాయాసంగా చక్కబెట్టేయగలుగుతాం. ఇప్పుడిదంతా ఎందుకంటే బాలీవుడ్ ప్రసిద్ధ నటి, మాజీ కేంద్ర మంద్రి బిజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ ఇటీవలి ఇంటర్యూపై అందర్నీ అమితంగా ఆకట్టుకుంది. అంతేగాదు ఆమె అనర్గళమైన ఆంగ్లభాష ప్రసంగంపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ఆంగ్ల భాష మెరుగుపరుచుకోవాలంటే ఆమె ఇంటర్వ్యూ చూస్తే చాలు కొత్త పదాలు నెన్నో నేర్చుకోవచ్చు, నిజంగా ఆమె ఓ ఆంగ్ల మాస్టర్ క్లాస్ అని అభివర్ణిస్తున్నారు అంతా.
ఆమె ఇటీవల బర్ఖాదత్ షో 'వీ ది విమెన్'లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి స్మృతి ఇరానీ, దర్శకుడు, నిర్మాత కరణ్ జోహార్ మధ్య జరిగిన సంభాషణ అశేష ప్రజలను అమితంగా ఆకట్టుకుంది. ఆమె అనర్గళంగా మాట్లుడుతున్న ఆంగ్లభాష శైలి అందర్నీ అటెన్షన్‌తో వినేలా చేయడమే కాదు..ఎంతో స్పష్టంగా, కచ్చితంగా వ్యక్తపరుస్తున్న విధానం ఎవ్వరినైనా కట్టిపడేస్తుంది.
ముఖ్యంగా ఆమె ఉపయోగించే పదజాలం, ఆత్మవిశ్వసంతో మాట్లుడుతున్న తీరు..ఆంగ్లభాష నేర్చుకోవాలనుకునే వారికి గొప్ప పాఠం అని అంటున్నారు నెటిజన్లు. కాగా, జర్నలిస్ట్ బర్ఖా దత్ ఆధ్వర్యంలో లండన్‌లో అంతర్జాతీయంగా తొలిసారిగా జరిగిన'వీ ది విమెన్' ఫెస్టివల్లో కరణ్‌జోహార్, స్మృతిల మధ్య జరిగిన సంభాషణ ఇది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఆ వీడియోపై లుక్కేయండి మరి.
Smriti Irani & Ekta Kapoor speak to Karan Johar: 'Kyuki' this is what success looks like. #wethewomen #openingdoors… https://t.co/B1RBTUIz8A
— barkha dutt (@BDUTT) December 9, 2017
(చదవండి: సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి! క్లయింట్‌ని వెతికిపెట్టినవారికి బంపరాఫర్)
Tags : 1