మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!
Breaking News
కల సంపూర్ణమైంది.. మెగా కోడలు ఉపాసన ఎమోషనల్
Published on Fri, 09/04/2026 - 14:40
రామ్ చరణ్ భార్య ఉపానస ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. శ్రీ కృష్ణ జన్మాష్టమిని తన పిల్లలతో కలిసి చరణ్-ఉపాసన సెలబ్రేట్ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోని పోస్ట్ చేసిన మెగా కోడలు.. తన కల సంపూర్ణమైంది అని క్యూట్ క్యాప్షన్ పెట్టుకొచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఖుషీ అయిపోతున్నారు.
2012లో చరణ్-ఉపాసన పెళ్లి చేసుకోగా.. 11 ఏళ్ల తర్వాత 2023లో వీళ్లకు కూతురు పుట్టింది. ఆమెకు క్లీంకార అని పేరు పెట్టుకుని అల్లారు ముద్దుగా పెంచుతున్నారు. ఇకపోతే ఈ ఏడాది జనవరిలో కవలలు(కొడుకు, కూతురు) పుట్టారు. వీళ్లకు శివరామ్, అన్వీరా అని పేర్లు పెట్టారు. తన ముగ్గురు పిల్లలతో కలిసి ఉపాసన.. కృష్ణాష్టమి సెలబ్రేట్ చేసుకుంది. ఈ క్రమంలోనే తన కల సంపూర్ణమైంది అన్నట్లు రాసుకొచ్చింది. ఈ ఫొటోలనూ అన్వీరా, శివరామ్ ముఖాలని దాచిపెట్టింది.
(ఇదీ చదవండి: అల్లరి నరేశ్ 'రంభ ఊర్వశి మేనక' రివ్యూ)
Tags : 1