Breaking News

సన్యాసం కోసం..రూ. 47 కోట్ల కంపెనీ అమ్మకానికి!

Published on Fri, 09/04/2026 - 10:45

కొందరు జీవితంలో మంచి సక్సెస్‌ అందుకుని కూడా సాధారణ జీవితాన్ని గడుపుతుంటారు. కొందరు ఏకంగా ఆ డబ్బుదర్పం పై మమకారం లేకుండా నిరాకారంగా జీవించేందుకు సిద్ధపడి సన్యాసం స్వీకరిస్తుంటారు. ఎలాంటి వాటిపై ఆశ, కోరికలకు తావులేకుండా అత్యంత నిరాడంబరంగా బతకడం అంటే మాటలు కాదు. అందులోనే శ్రీమంతుడిలా బతికిన వాడికి ఇది మరింత కష్టం కానీ. ఈ వ్యక్తి అంత పెద్ద నిర్ణయమే తీసుకుని ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోతారు. 

ఆ అనూహ్య నిర్ణయం తీసుకున్న వ్యక్తే థాయ్ వ్యాపారవేత్త సిరిపాంగ్ అక్కరశ్రీయుక్. సన్యాసం స్వీకరించి అడవిలో మంచి చోటు చేసుకుని ధ్యానం చేసుకుంటూ తన మిగిలిన జీవితాన్ని గడపాలనుకుంటున్నాడు. తనకు భోజనం తెచ్చే సహాయక సన్యాసి తప్ప మరెవ్వరితో సంబంధం పెట్టుకోకూడదని భావిస్తున్నట్లు తెలిపాడు. తన శేష జీవితాన్ని ఆధ్యాత్మిక సాధనలోనే గడపాలని స్ట్రాంగ్‌గా నిర్ణయించుకున్నాడు హేవల్సశ్రీ అనే థాయ్‌ ఐస్‌క్రీమ్‌ బ్రాండ్‌ చైర్మన్‌ సిరిపాంగ్‌. 

ఆ నేపథ్యంలోనే సుమారు రూ. 47 కోట్లు విలువ చేసే తన బ్రాండెండ్‌ హేవెల్స్‌ ఐస్‌క్రీం వ్యాపారాన్ని అమ్మేయాలని అనుకుంటున్నాడు. దశాబ్దాలుగా తాను నిర్మించిన కంపెనీ నుంచి ఆ వ్యాపారవేత్త వైదొలగాలని అనుకుంటున్నాడట. ఈ జీవితం కోసమే 15 ఏళ్లుగా ప్లాన్‌ చేస్తున్నట్లు వెల్లడించాడు. ఆయన 2016లో బౌద్ధమతం వైపు ఆకర్షితులై బుద్దుని నుంచి పొందిన విజయం అనే పుస్తకం కూడా రాశారు. 

ఇంకో రెండేళ్లలో సన్యాసం స్వీకరించనున్నట్లు సోషల్‌ మీడియా వేదికగా పోస్ట్‌లో తెలిపాడు సిరిపాంగ్‌. అంతేగాదు తనకు మంచి క్లయింట్‌ని వెతికిపెట్టి వారికి కూడా భారీ ఆఫర్‌ ప్రకటించాడు. వాళ్లకు సుమారు కోటి రూపాయలు పైనే రిఫరల్‌ ఫీజు కింద ఇస్తానని ప్రకటించాడు. కాగా సిరిపాంగ్‌ తన హేవెల్స్‌ ఐస్‌క్రీం బ్రాండ్‌ని 1999లో ప్రారంభించారు. థాయ్‌లాండ్‌లో ఇది ప్రసిద్ధి చెందిన వ్యాపారం. మూడేళ్లలోపే 22 శాఖలకు విస్తరించింది. ధాయ్‌లాండ్‌లో ప్రతి షాపింగ్‌మాల్‌లో తప్పక ఉండేది ఈ ఐస్‌క్రీమ్‌ దుకాణం. అ

యితే గత రెండేళ్లుగా హేవెల్స్‌కి షాపింగ్‌ మాల్స్‌లో స్థలం దొరకక్క ఎదుర్కొంటోంది. ప్రతి షాపింగ్‌ మాల్‌ అందుకు తమ వద్ద స్థలం లేదని చెప్పేయడంతో ప్రస్తుత ఈ బ్రాండ్‌ ఐస్‌క్రీం దుకాణాలు కనిపించకుండా పోయాయి. ప్రస్తుతం ఆ బ్రాండ్‌ ఉనికి దాదాపుగా కనుమరుగైపోయింది. ఆ నేపథ్యంలో ఆయన ఇలా నిర్ణయం తీసుకుని ఉండొచ్చనేది సన్నిహిత వర్గాల సమాచారం. 

కాగా ఈయన అమ్మేయాలనకుకుంటున్న తన వ్యాపార సామ్రాజ్యంలో లభించేవి...2.77 ఎకరాల భూమితో పాటు, ఒక కార్యాలయ భవనం, ఒక ఫ్యాక్టరీ, యంత్ర పరికరాలు, హావెల్స్ ఐస్ క్రీమ్ & ఫాస్ట్ ఫుడ్ అవుట్‌లెట్ లైసెన్స్‌లు, కంపెనీ ట్రేడ్‌మార్క్‌లతోపాటు 37 ఏళ్లుగా కూడగట్టిన నైపుణ్యం, ఐస్‌క్రీం రెసీపీలు తదితరాలన్ని  పొందొతారని సిరిపాంగ్‌ పోస్ట్‌లో పేర్కాన్నారు. 

(చదవండి: సాధువుగా మారి..54 ఏళ్ల వయసులో సీఆర్పీఎఫ్‌ పోలీస్‌గా!)

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)