Breaking News

పీఎం కిసాన్ విడతపై అప్డేట్.. రూ.4,000 నిజమేనా?

Published on Thu, 09/03/2026 - 17:44

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan Samman Nidhi) యోజన ద్వారా డబ్బులు పొందుతున్న రైతులకు 24వ విడతకు సంబంధించి సోషల్ మీడియాలో కొన్ని వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈసారి ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ.4,000 జమ చేయబోతోందని, ఇప్పటికే డబ్బులు పంపడం మొదలుపెట్టిందని కొన్ని పోస్టుల్లో చెబుతున్నారు. అయితే.. ఈ వార్తల్లో నిజం లేదు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న రూ.4,000 విడత వార్తను పీఎం కిసాన్ అధికారిక ఎక్స్ ఖాతా కూడా ఖండించింది. 24వ విడతగా రూ.4,000 పంపుతున్నట్లు వచ్చిన వీడియోలు, పోస్టులు నకిలీవని స్పష్టం చేసింది. కాబట్టి.. ఇలాంటి సోషల్ మీడియా పోస్టులను చూసి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా.. తెలియని లింకులపై క్లిక్ చేసి బ్యాంక్ వివరాలు, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఇవ్వకూడదు.

24వ విడత ఎప్పుడు వస్తుంది?
పీఎం కిసాన్ పథకం 23వ విడతను జూన్ 20న విడుదల చేశారు. దీంతో 24వ విడత అక్టోబర్‌లో వచ్చే అవకాశం ఉందని సమాచారం. అయితే కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 24వ విడతకు సంబంధించి అధికారిక తేదీని ప్రకటించలేదు. కాబట్టి.. అక్టోబర్‌లోనే డబ్బులు వస్తాయని ఇప్పుడే ఖచ్చితంగా చెప్పలేం. ప్రభుత్వం అధికారిక ప్రకటన చేసిన తర్వాతే పూర్తి క్లారిటీ వస్తుంది.

రైతులు ఈ పనులు పూర్తి చేసుకోవాలి
తదుపరి విడత డబ్బులు ఎలాంటి ఇబ్బంది లేకుండా రావాలంటే రైతులు కొన్ని విషయాలను ముందుగానే చెక్ చేసుకోవాలి. 
➤e-KYC పూర్తి చేసుకోవాలి. 
➤బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ అయిందో లేదో చూసుకోవాలి. 
➤ఫార్మర్ ఐడీ లేకపోతే వెంటనే క్రియేట్ చేసుకోవాలి.
➤ఇంకా భూమి ధృవీకరణ చేయించుకోనట్లయితే, 24వ విడత రాకముందే దానిని చేయించుకోండి.
వీటిలో ఏదైనా పెండింగ్‌లో ఉంటే పీఎం కిసాన్ డబ్బులు రావడంలో సమస్య ఏర్పడే అవకాశం ఉంటుంది.

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)