Breaking News

ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్లకు పెరుగుతున్న ఆదరణ

Published on Thu, 09/03/2026 - 11:59

ఫ్లెక్సీక్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్‌ పథకాల్లో ఈ ఏడాది జనవరి–జూలై మధ్య రూ.49,915 కోట్ల నికర పెట్టుబడులు వచ్చాయి. గత ఏడాది ఇదే కాలంలో నమోదైన రూ.39,187 కోట్లతో పోలిస్తే ఇది 27 శాతం అధికం. మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌ షేర్ల మధ్య పెట్టుబడులను మార్చుకునే వెసులుబాటు ఉండటంతో ఇన్వెస్టర్లు ఈ ఫండ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారని పరిశ్రమ వర్గాలు పేర్కొన్నాయి. ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్లలో ఫోలియోల సంఖ్య, నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) కూడా గణనీయంగా పెరిగాయి. జూలై 2026 నాటికి ఈ కేటగిరీ ఫోలియోలు 2.44 కోట్లకు చేరాయి. ఏడాది క్రితం ఇవి 1.94 కోట్లుగా ఉన్నాయి. అంటే సుమారు 50 లక్షల ఫోలియోలు పెరిగాయి.

ఇదే సమయంలో ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్ల ఏయూఎం రూ.4.94 లక్షల కోట్ల నుంచి రూ.6 లక్షల కోట్లకు పెరిగింది. జూలైలో నెలవారీ పెట్టుబడులు స్వల్పంగా నెమ్మదించినప్పటికీ.. జూన్‌లో రూ.5,231 కోట్లు రాగా, జూలైలో రూ.4,709 కోట్లు వచ్చాయి. మొత్తం ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌ ప్రవాహాల్లో ఈ కేటగిరీ తన బలమైన వాటాను నిలబెట్టుకుంది. మార్చి త్రైమాసికంలో రూ.24,651 కోట్లు, జూన్‌ త్రైమాసికంలో రూ.20,555 కోట్ల చొప్పున పెట్టుబడులు వచ్చాయి.  

ఫండ్‌ మేనేజర్‌ ఆధారిత వ్యూహాలకు ఆదరణ

ఫ్లెక్సీక్యాప్‌ కేటగిరీ ఫోలియోలు, ఆస్తుల పరంగా బలమైన వృద్ధిని నమోదు చేసిందని క్వాంటమ్‌ ఏఎంసీ సీఐవో చిరాగ్‌ మెహతా తెలిపారు. గత 12 నెలల్లో మొత్తం ఈక్విటీ నికర పెట్టుబడి ప్రవాహంలో 27 శాతం వాటాను, గత నెలలో 19 శాతం వాటాను ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్లు దక్కించుకున్నాయని పేర్కొన్నారు. కేవలం రాబడుల కోసం మాత్రమే కాకుండా, మార్కెట్‌ పరిస్థితులకు అనుగుణంగా పెట్టుబడులను మార్చుకునే ఫండ్‌ మేనేజర్‌ ఆధారిత వ్యూహాల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారని తెలిపారు. అంతర్జాతీయ వడ్డీ రేట్ల మార్పులు, భౌగోళిక రాజకీయ పరిణామాలు, కంపెనీల ఆదాయాల్లో వ్యత్యాసాలు, అధిక వాల్యుయేషన్ల నేపథ్యంలో లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌ విభాగాల మధ్య పెట్టుబడులను మార్చుకునే వెసులుబాటు ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్లకు ప్రధాన బలంగా మారిందని మెహతా వివరించారు.

ఫ్లెక్సీక్యాప్‌ విభాగంలోకి క్వాంటమ్‌  

క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ ‘క్వాంటమ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌’ను ప్రారంభించింది. లార్జ్, మిడ్, స్మాల్‌క్యాప్‌ షేర్లలో పెట్టుబడులు పెట్టే ఓపెన్‌–ఎండెడ్‌ డైనమిక్‌ ఈక్విటీ పథకం ఇది. సాంప్రదాయ పెట్టుబడి విధానాలతో పాటు ‘ప్రాఫిట్‌–పూల్‌ మైగ్రేషన్‌’ అనే విధానాన్ని కూడా అనుసరిస్తుంది. వివిధ పరిశ్రమల్లో లాభాల వాటా ఏ విభాగాల వైపు మారుతుందో గుర్తించి, అందుకు అనుగుణంగా పెట్టుబడులను మళ్లించడం ఈ విధానం ఉద్దేశం. దీనికి జీఏఆర్‌పీ (గ్రోత్‌ అట్‌ ఏ రీజనబుల్‌ ప్రైస్‌), బాటమ్‌–అప్‌ స్టాక్‌ ఎంపిక విధానాలను జోడించారు. క్వాంటమ్‌ ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ న్యూ ఫండ్‌ ఆఫర్‌ (ఎన్‌ఎఫ్‌ఓ) ఆగస్టు 21న ప్రారంభమైంది. రేపు (సెపె్టంబర్‌ 4న) ముగియనుంది. సెపె్టంబర్‌ 11 నుంచి ఈ పథకంలో కొనుగోలు, విక్రయాలకు అవకాశం ఉంటుంది. దాదాపు 20 ఏళ్ల కార్యకలాపాల అనంతరం క్వాంటమ్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అందిస్తున్న పథకాల సంఖ్య 14కు చేరింది.

ఇదీ చదవండి: ఒక్కసారిగా బంగారం ధరలు రివర్స్‌!

#

Tags : 1

Videos

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

వీడిన ఉత్కంఠ...! సీఎం రేవంత్ సంచలన నిర్ణయం

కాంగ్రెస్ పార్టీ వీడనున్న కొండా దంపతులు...?

AP: ఇద్దరి IPS ల సస్పెన్షన్ ఎత్తివేత

కొండా సురేఖపై వేటు..

గుడ్ మార్నింగ్ ధర్మవరం కార్యక్రమంలో కేతిరెడ్డి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)