లండన్‌లో ధ్రువ తార

Published on Wed, 09/02/2026 - 03:50

సాధారణంగా ఏడేళ్ల వయసున్న పిల్లలు అప్పుడప్పుడే కూడికలు, తీసివేతలను నేర్చుకుంటూ ఉంటారు. కానీ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన ఏడేళ్ల చిన్నారి కట్టా ధ్రువ జీవ్యాన్‌ రెడ్డి లండన్‌ వేదికగా 16 ఏళ్ల వయస్సు విద్యార్థులు హాజరయ్యే మ్యాథ్స్‌ పరీక్షలో 8వ గ్రేడ్‌ సాధించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.

జీవ్యాన్‌ రెడ్డి స్వస్థలం శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా. ధ్రువకుమార్‌రెడ్డి, ఐశ్వర్యాదేవి జీవ్యాన్‌ రెడ్డి తల్లిదండ్రులు. వీరు ఉద్యోగరీత్యా గత ఐదేళ్లుగా లండన్‌లో నివాసముంటున్నారు. జీవ్యాన్  కు నర్సరీకి వెళ్లక ముందే సంఖ్యలు, కూడికలు, తీసివేతలపై ఆసక్తి ఉండేది. ఫస్ట్‌క్లాస్‌ చదువుతున్న సమయంలోనే సెకండరీ ఎడ్యుకేషన్‌ స్థాయి మ్యాథ్స్‌ పుస్తకాలలోని లెక్కలను పరిష్కరించేవాడు. అలా బ్రిటన్‌లో గత మే నెలలో నిర్వహించిన పియర్సన్   ఎడెక్సెల్‌ జనరల్‌ సర్టిఫికెట్‌ ఇన్   సెకండరీ ఎడ్యుకేషన్   (జీసీఎస్‌ఈ) హయ్యర్‌ మ్యాథమేటిక్స్‌ పరీక్షకు హాజరైన జీవ్యాన్‌ 8 వ గ్రేడ్‌ సాధించాడు. 240 మార్కులకు గాను 196 మార్కులను సాధించి అందరినీ అబ్బురపరిచాడు.

‘ఏ’ లెవెల్‌ టెస్ట్‌కు సన్నద్ధం...
జీసీఎస్‌ఈలో 8వ గ్రేడ్‌ సాధించడం ఎంతో ఆనందంగా ఉందనీ.. కష్టమైన లెక్కలకు భిన్న పద్ధతుల్లో సమాధానాల్ని కనుగొనడం అంటే తనకు ఆసక్తి అని చెబుతున్నాడు జీవ్యాన్‌. వచ్చే ఏడాది ఏ–లెవల్‌ టెస్ట్‌ కోసం సన్నద్ధమవుతున్నట్టు చెప్పాడు. ప్రజలకు ఉపయోగపడే రోబోలను ఆవిష్కరించడమే తన లక్ష్యమని అంటున్నాడు ఈ బాల మేధావి. జీవ్యాన్‌తో పరీక్షలు రాయించి రికార్డులు సృష్టించడం తమ లక్ష్యం కాదనీ.. సరైన దిశలో సాగేలా ప్రోత్సహించడమే తమ ధ్యేయమని అతని తల్లిదండ్రులు ధ్రువ కుమార్‌ రెడ్డి, ఐశ్వర్యాదేవి అంటున్నారు. 

జీవ్యాన్‌ గణితంలోనే కాకుండా పలు చెస్‌ పోటీలలోనూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఏడేళ్ల పిన్నవయసులోనే అంతర్జాతీయ వేదికపై తెలుగువారి ఖ్యాతిని చాటిచెప్పిన జీవ్యాన్‌ రెడ్డిపై ప్రశంసల వర్షం కురుస్తోంది.
– మూలే యోగానంద రెడ్డి,సాక్షి, నెల్లూరు (టౌన్‌) 

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)