భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు
Breaking News
‘కల్కి2’పై బిగ్ అప్డేట్..!
Published on Tue, 09/01/2026 - 13:01
దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ‘ఐయామ్ ది గేమ్’. ఈ చిత్రం సెప్టెంబర్ 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. వేఫెరర్ ఫిలిమ్స్ సమర్పణలో నహాస్ హిదాయత్ దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్, జోమ్ వర్గీస్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లోని పార్క్ హయత్ హోటల్లో సోమవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన నాగ్ అశ్విన్ మాట్లాడుతూ ‘కల్కి2’కి సంబంధించిన అప్డేట్ను పంచుకున్నారు. ఇప్పుడీ వీడియో వైరల్ అవుతోంది.
‘ఇప్పటివరకు పది రోజుల షూటింగ్ చేశాం. ఇంకా చాలా చేయాల్సి ఉంది. ప్రభాస్‌కు సమయం దొరకపోవడంతో లేట్ అవుతుంది. అతనికి సమయం దొరికాక పెద్ద షెడ్యూల్ ప్లాన్ చేస్తాం’ అని వెల్లడించారు.
ఎక్కువమంది చదివింది: శుభవార్త చెప్పిన హీరోయిన్ నిత్యామేనన్
2024లో విడుదలై..
కాగా ప్రభాస్ - నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ 'కల్కి 2898 ఏడీ'. 2024 జూన్ 27న విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ.1100 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దిశాపటానీ, దీపికా పదుకొణె కీలక పాత్రల్లో నటించారు. ఇప్పుడు ‘కల్కి2’ కోసం అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ తరహాలో ‘కల్కి2’కి సంబంధించిన అప్డేట్ అభిమానుల్లో ఉత్సాహన్ని నింపుతోంది.
Kalki Part 2 Update by Nag Ashwin:
Only 10 days of shooting have been completed so far! #Prabhas pic.twitter.com/goJsSMHdJk— Movies4u Official (@Movies4u_Officl) August 31, 2026
Tags : 1