Breaking News

బిట్‌కాయిన్‌పై సంచలన అంచనా.. త్వరలోనే $1 మిలియన్!

Published on Sun, 08/30/2026 - 12:42

క్రిప్టో కరెన్సీ మార్కెట్‌లో బిట్‌కాయిన్ భవిష్యత్తుపై బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావో (CZ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక్కో బిట్‌కాయిన్ విలువ భవిష్యత్తులో 1 మిలియన్‌ డాలర్లకు (ప్రస్తుత మారక విలువ ప్రకారం సుమారు రూ.9.5 కోట్లు) చేరడం ఖాయమని, ఇందుకు 25 ఏళ్లు పట్టకపోవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇటీవల హాంకాంగ్‌లో జరిగిన బిట్‌కాయిన్‌ ఆసియా 2026 సదస్సులో ‘బిట్‌కాయిన్‌ శతాబ్ధి’ పేరుతో జరిగిన చర్చలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

అయితే బిట్‌కాయిన్‌ను కేవలం ధర ఆధారంగా అంచనా వేయడం సరికాదని చాంగ్‌పెంగ్ జావో స్పష్టం చేశారు. రాబోయే దశాబ్దంలో దాని వినియోగం, చెల్లింపుల్లో వినియోగం, సంస్థాగత స్వీకరణ భారీగా పెరగాల్సిన అవసరం ఉందన్నారు. పెద్ద ఎత్తున బిట్‌కాయిన్ చెల్లింపులు జరగడం, రిటైర్మెంట్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, పెట్టుబడి నిధులు, ప్రభుత్వాల రిజర్వ్ ఆస్తుల్లో బిట్‌కాయిన్‌కు స్థానం లభించడం వంటి పరిణామాలు కీలక మైలురాళ్లుగా మారతాయని పేర్కొన్నారు.

బంగారాన్ని మించుతుందా?

భవిష్యత్తులో బిట్‌కాయిన్ ప్రాధాన్యత బంగారాన్ని మించే అవకాశం ఉందని చాంగ్‌పెంగ్ జావో అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా తదుపరి బుల్‌ మార్కెట్‌లో బిట్‌కాయిన్ మార్కెట్ విలువ పరంగా బంగారాన్ని అధిగమించవచ్చని ఆయన పేర్కొన్నట్లు ది బ్లాక్ నివేదించింది.

అయితే ప్రస్తుతం ఈ రెండింటి మధ్య భారీ వ్యత్యాసం ఉంది. ఇటీవలి మార్కెట్ డేటా ప్రకారం బిట్‌కాయిన్ ధర ఆగస్టు చివర్లో సుమారు 80,000 డాలర్ల వద్ద కొనసాగుతోంది. ఆగస్టు 25న ఇది 80,600 డాలర్ల ప్రాంతాన్ని తాకింది. దీంతో 1 మిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరాలంటే ప్రస్తుత స్థాయి నుంచి బిట్‌కాయిన్ దాదాపు 12 రెట్లు పెరగాల్సి ఉంటుంది.

AI, స్టేబుల్‌కాయిన్లదే తదుపరి దశ

క్రిప్టో రంగంలో వచ్చే పదేళ్లలో కేవలం బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా స్టేబుల్‌కాయిన్లు, టోకెనైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), AI ఏజెంట్లు కీలక పాత్ర పోషిస్తాయని సీజెడ్‌ అంచనా వేశారు. టోకెనైజ్డ్ ఆస్తులు, డిజిటల్ చెల్లింపులు వేగంగా విస్తరించడంతో సంప్రదాయ ఆర్థిక వ్యవస్థతో క్రిప్టో రంగం అనుసంధానం మరింత బలపడుతుందని ఆయన అన్నారు.

బిట్‌కాయిన్ ప్రధానంగా దీర్ఘకాలిక పొదుపు, రిజర్వ్ ఆస్తిగా ఎదగవచ్చని, మరోవైపు స్టేబుల్‌కాయిన్లు రోజువారీ చెల్లింపులు, ట్రేడింగ్, అలాగే AI ఏజెంట్ల మధ్య జరిగే మెషిన్-టు-మెషిన్ లావాదేవీల్లో కీలకంగా మారవచ్చని ఆయన వివరించారు.

Videos

మందు తాగి NEET పరీక్షకు.. బయటకు గెంటేసిన సెక్యూరిటీ

యువ ప్రధానికి బిగ్ ఛాలెంజ్.. నేపాల్ పునర్నిర్మాణం అంత ఈజీ కాదు

ధర్మాన ప్రసాద్ పై అక్రమ కేసు

నీకే చెప్తున్నా.. జగన్ పై విజయసాయి రెడ్డి వ్యాఖ్యలు.. ఇచ్చిపడేసిన సజ్జల

బిర్యానీ సెంటర్లో పెరుగు కోసం కొట్లాట

కీవ్ లో రష్యా డ్రోన్ల బీభత్సం.. 37 మంది మృతి

నువ్వేం ఎమ్మెల్యే అమ్మ బాబు.. తాగడానికి నీళ్లు ఇవ్వడం చేతకాలేదు నీకు..!

'అచ్చ కాంగ్రెస్' వర్సెస్ 'పచ్చ కాంగ్రెస్' రేవంత్ కు ఎమ్మెల్యేల మద్దతు ఉందా?

మనిషి కంట్రోల్ తప్పిన 700 రోబోల రహస్య దాడి!

ఇరుముడి మిస్ చేసుకున్న స్టార్ హీరోలు వీళ్ళే..!

Photos

+5

సమంత ప్రెగ్నెన్సీ గ్లో చూశారా? (ఫొటోలు)

+5

చీరకట్టుతో రీతూ వర్మ ( ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఉత్సాహంగా 10కె రన్ (ఫోటోలు)

+5

షూటింగ్‌ కోసం ఓనం మిస్‌.. ర్యాండమ్‌ ఫొటోలతో కల్యాణి సందడి..(ఫొటోలు)

+5

ఇది చీరల సీజన్.. గ్లామరస్ శ్రద్ధాదాస్ (ఫొటోలు)

+5

'యేషనాగుల కట్టమీద' పాట రిలీజ్.. షూటింగ్ టైంలో ఇలా (ఫొటోలు)

+5

నెల్లూరులో సందడి చేసిన సినీనటి నిధి అగర్వాల్ (ఫొటోలు)

+5

నాగార్జున బర్త్‌డే స్పెషల్‌.. తెరపై చూడని అరుదైన ఫొటోలు

+5

మరోసారి పెళ్లి పీటలెక్కిన సీరియల్‌ నటి.. వైరల్‌గా (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ సినిమా ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)