Breaking News

మోటార్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేయలేదా? ఏం అవుతుందంటే..

Published on Thu, 08/27/2026 - 14:21

వాహనదారులకు బీమా అనేది కేవలం చట్టపరమైన నిబంధన మాత్రమే కాదు, అత్యవసర సమయాల్లో రక్షణ కవచం. అయితే వివిధ కారణాల వల్ల చాలా వరకు వెహికిల్‌ ఇన్సూరెన్స్‌ను రెన్యువల్‌ చేయించడానికి పెద్దగా ఆసక్తి చూపించరు. బిజీ లైఫ్‌స్టైల్ లేదా నిర్లక్ష్యం వల్ల రెన్యూవల్ గడువు ముగిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

గడువు దాటితే ఎదురయ్యే సమస్యలు

  • పాలసీ గడువు ముగిసిన మరుసటి క్షణం నుంచే బీమా రక్షణ నిలిచిపోతుంది. ఆ తర్వాత వాహనానికి ప్రమాదం జరిగినా, దొంగతనానికి గురైనా కంపెనీ ఎలాంటి పరిహారం చెల్లించదు.

  • మోటార్ వాహనాల చట్టం ప్రకారం థర్డ్-పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. లేకపోతే తొలిసారి రూ.2,000, పునరావృతమైతే రూ.4,000 వరకు జరిమానా లేదా 3 నెలల జైలు శిక్ష పడే అవకాశముంది.

  • ఇన్సూరెన్స్ లేనప్పుడు మీ వాహనం వల్ల మూడో వ్యక్తికి నష్టం వాటిల్లితే కోర్టు నిర్ణయించే లక్షల రూపాయిల నష్టపరిహారాన్ని మీ సొంత జేబు నుంచే చెల్లించాల్సి ఉంటుంది.

  • క్లెయిమ్ చేయనందుకు ప్రీమియంలో లభించే 20% నుంచి 50% నో క్లెయిమ్‌ బోసన్‌ డిస్కౌంట్‌, గడువు దాటిన 90 రోజులలోపు రెన్యూ చేయకపోతే పూర్తిగా రద్దవుతుంది.

  • లాప్స్ అయిన పాలసీని పునరుద్ధరించాలంటే ఇన్సూరెన్స్ సంస్థలు భౌతిక లేదా డిజిటల్ వాహన తనిఖీని నిబంధనగా పెడతాయి.

తక్షణమే ఏం చేయాలి?

ఇన్సూరెన్స్ లేనప్పుడు డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరం. ఇన్సూరెన్స్ పోర్టల్స్ లేదా యాప్‌ల ద్వారా ఆన్‌లైన్ ప్రాసెస్ ప్రారంభించండి. ప్రస్తుతం చాలా కంపెనీలు స్మార్ట్‌ఫోన్ ద్వారా ఇన్‌స్పెక్షన్ సౌకర్యం కల్పిస్తున్నాయి. ప్రీమియంలో స్వల్ప పొదుపు కోసం చూడకుండా గడువుకు ముందే రెన్యూవల్ చేసుకోవడం లేదా ఆటో-రెన్యూవల్ ఎంచుకోవడం శ్రేయస్కరం.

ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు.. తులం ఎంతంటే..

Videos

కూలిన శిక్షణ విమానం..ఇద్దరు పైలట్లు మృతి

750 మంది భారతీయులు ఎక్కడ..? కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

BIG ALERT: హిమాలయాల నుండి ముంచుకొస్తున్న మహా ప్రళయం

ఏషియన్ గేమ్స్ 2026 క్రికెట్ షెడ్యూల్ విడుదల.. భారత్, పాక్ మ్యాచ్లు ఎప్పుడంటే ?

DRDO మాజీ ఛైర్మన్ అసలు అక్కడ ఏం జరుగుతుందో లైవ్ లో చెప్పిన సతీష్ రెడ్డి

నేపాల్ వరదలకు కారణం ఇదే ఉస్మానియా ప్రొఫెసర్ చెప్పిన సంచలన విషయాలు..

చిన్న మంచు ముక్కకే నేపాల్ మునిగితే... హిమాలయాలు కరిగితే...? నేపాల్ వరదల వెనుక రహస్యం?

సైన్స్‌కు అర్థం కాని కైలాస రహస్యం..

నేపాల్‌లో భారీ వరద బీభత్సం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగులు!

చైనాకు తెలిసిన నేపాల్‌ను హెచ్చరించలేదా? చైనా పాపమే .. నేపాల్ కి శాపమా?

Photos

+5

రాఖీ పౌర్ణమి సందర్భంగా.. మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు చెప్పండిలా...(ఫొటోలు)

+5

ది రాజాసాబ్ బ్యూటీ మాళవిక మోహనన్ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

రంగారెడ్డిలో అంబరాన్నంటిన తీజ్ సంబురాలు (ఫొటోలు)

+5

కుందనపు బొమ్మలా నభా నటేష్ (ఫొటోలు)

+5

ఓనం వేడుకలో కృతి శెట్టి.. (ఫోటోలు)

+5

సంప్రదాయ దుస్తుల్లో మెరిసిన తార మంజు వారియర్..(ఫోటోలు)

+5

ఫ్యామిలీతో అనుపమ ఓనం సెలబ్రేషన్స్.. (ఫోటోలు)

+5

హైదరాబాద్‌ : చార్మినార్ వద్ద ఘనంగా మిలాద్-ఉన్-నబీ వేడుకలు (ఫొటోలు)

+5

రాఖీ పౌర్ణమి.. వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో సందడే సందడి (ఫొటోలు)

+5

'టాక్సిక్' మూవీ ట్రెండింగ్ లో నయనతార (ఫొటోలు)