Breaking News

సముద్రాన్నే సవాల్‌ చేసిన ఈతగాడు.. కేవలం వారికోసమే!

Published on Fri, 08/21/2026 - 08:16

మీరెప్పుడైనా ఓ వంద మీటర్ల దూరం ఈత కొట్టారా? బావిలోనో, స్విమ్మింగ్‌ పూల్‌లోనో, అటు నుంచి ఇటుకి ఆపసోపాలు పడి ఈత కొట్టే బ్యాచే కదా మనమంతా.. కాని సముద్రంలో సుదీర్ఘంగా ఈతకొట్టేవాళ్లను చూశారా? ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఒక దేశం నుంచి మరొక దేశానికి ఈత కొట్టే గజ ఈతగాడిని చూశారా? అంత దూరం ఎలా ఈత కొట్టాడు? అది కూడా సముద్రంలో... అని అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ మీద ఓ లుక్కేయండి...

అది స్వీడన్‌ దేశ తీరం... గాలివాటంగా ఉంది.. సముద్రంలోని నీరు వణికించేలా ఉంది. 2022 ఆగస్టు నెల..బార్ట్లో మీజ్‌ కుబ్కోవ్‌స్కీ అనే 27 ఏళ్ల యువకుడు సముద్రంలోకి దిగాడు...ఈతకొట్టడంప్రారంభించాడు. ఐదు, పది కిలోమీటర్లు కాదు 32 గంటలు ఈది 115 కిలోమీటర్లు వెళ్లాడు. కాని వాతావరణం సముద్రాన్ని హెచ్చరించింది..సముద్రం ఉప్పెన రూపం దాల్చింది.. అల్లకల్లోలం అయ్యేలోపే బార్ట్లో తప్పించుకున్నాడు.

అంతటితో ఆగలేదు..2023 మళ్లీ ఈదడానికి సిద్ధపడ్డాడు. ఈసారి 40 గంటలు ఈది 116.7 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నాడు. కాని వాతావరణం తన ప్రతాపాన్ని చూపి మళ్లీ పైచేయి సాధించింది. తర్వాత 2024 ముచ్చటగా మూడో ప్రయత్నంప్రారంభించాడు. కాని ఈసారి 19 గంటలకే వాతావరణం బలమైన పరిస్థితిని పూర్తిగా తన అదుపులోకి తీసుకుంది... కాని బార్ట్లో71.7 కిలోమీటర్లు వెనక్కి తగ్గాడు. 2025లో నాలుగో ప్రయత్నం...ఈసారి మాత్రం విజయం చేతికి చిక్కి తప్పించుకుంది. ఆగస్టు 17న బయలుదేరిన కుబ్కోవ్‌స్కీ 55 గంటలపాటు ఈది 159 కి.మీల దూరానికి చేరుకున్నాడు. పక్కనున్న పోలాండ్‌ దేశ తీరానికి కాస్త దూరంలోకి వచ్చి తీవ్రమైన అలసటతో అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. వెంటనే సహాయక బృందం అతడిని కాపాడింది.

చివరగా 2026 జూలై 31... ఈసారి కూడా 55 గంటల పది నిమిషాల పాటు నిర్విరామంగా ఈతకొట్టి పోలాండ్‌ తీరానికి చేరుకున్నాడు. బాల్టిక్‌ సముద్రాన్ని ఈదిన తొలి వ్యక్తిగా కుబ్కోవ్‌స్కీ నిలిచాడు. నాలుగుసార్లు సముద్రం అతడిని ఆపింది. ఐదోసారి మాత్రం అతడు సముద్రాన్ని గెలిచాడు. ఇంత ప్రయత్నానికి కారణం లేకపోలేదు. కేన్సర్‌తో బాధపడే పిల్లల కోసం నిధులు సేకరించాలని ప్రతి ఏటా కుబ్కోవ్‌స్కీ సముద్రంపై అలుపెరగని యుద్ధం చేశాడు. ఈ విజయాన్ని పిల్లలకు అంకితం చేసి, తన భగీరథ ప్రయత్నం ద్వారా వచ్చిన మొత్తాన్ని పిల్లల వైద్యానికే ఇచ్చేసి ధైర్యశాలిగా, ఔదార్యం నిండిన మంచి మనిషిలా మిగిలాడు.

అతని అలుపెరగని ప్రయత్నం చూసి ఆశ్చర్యపోనివారంటూ లేరు.. బలమైన అలలు.. వణికించే నీళ్లు.. ఏమాత్రం తేడా వచ్చినాప్రాణానికే ప్రమాదం... కాని అవేవి అతడిని ఆపలేదు. గజినీ మహమ్మద్‌లా సముద్రం చేతిలో ఎన్నిసార్లు ఓడినా మళ్లీ ప్రతి దాడికి సిద్ధపడుతూనే ఉన్నాడు.

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)