Breaking News

మా రాంబాబు గాడి పొల్యూషన్‌ పొదుపులు! 

Published on Fri, 08/21/2026 - 03:58

‘‘కాలుష్యం కాలుష్యం అంటూ ఏదో గగ్గోలు పెడుతూ ఉంటారు గానీ... అసలు పొల్యూషన్‌ వల్ల ఎంత పొదుపో తెల్సా?’’ అంటూ తెగ స్పీచుతున్నాడు మా రాంబాబుగాడు.  ఏం జరిగిందంటూ వాళ్లావిడను పలకరించాన్నేను. 

‘‘పొదుపూ... పొదుపూ అంటూ మీ ఫ్రెండుగారు చేస్తున్న పనులేమిటో చూస్తున్నారా.  పొల్యూషన్‌ ఎక్కువ ఉండే పంజగుట్ట సెంటర్‌లో నిల్చుంటే జస్ట్‌ ఓ గంట సేపుంటే రోజుకు 20 సిగరెట్లు తాగినంత అట. ఓరోజు పాన్‌డబ్బా దగ్గకు వెళ్లి కాస్ట్‌లీ పెద్ద సిగరెట్ల పెట్టె రేటెంతో తెలుసుకున్నారు. అంతే... రోజూ ఆ పంజగుట్ట సెంటరుకెళ్లి నిల్చుండిపోతున్నారు. అదేమిటంటే... ‘చూశావా... ఒక్క సిగరెట్టూ కొనకుండా రోజూ 500 రూపాయలకు పైగా ఆదా చేస్తున్నాను తెల్సా’ అంటున్నారండీ ఆయన’’ అంటూ  వాపోయింది. 

‘‘నేను మాట్లాడ...’’ అంటూ ఏదో చెప్పబోతుండగానే... కట్‌ చేసి కంప్లెయింట్స్‌ కొనసాగించింది. 
‘‘అంతేనా... ‘పంజగుట్టలో పొల్యూషన్‌ మాత్రమే కాదండీ.. ఆ రద్దీ తాలూకు ట్రాఫిక్‌ శబ్దాలూ, ఎడాపెడా రణగొణధ్వనులూ, ఆగకుండా హారన్లూ... బోల్డంత సౌండు పొల్యూషన్‌ కూడా కదండీ... వద్దండీ’ అన్నా. ఆ మాట వినగానే... ‘పిచ్చిదానా... ఈమధ్యే ఓ సర్వేలో తేలిందేమిటంటే... ఆ శబ్దాల మధ్య ఉండటం అంటే పేద్ధ పేద్ధ స్పీకర్లున్న మ్యూజిక్‌ సిస్టమ్‌లో డీజే సౌండ్లతో ఒక పాటను ఫుల్‌ వాల్యూమ్‌తో విన్నట్టట. చూశావా... ఫ్రీగా సిగరెట్లే కాదు... ఎగస్ట్రాగా బోలెడన్ని పాటలు ఫ్రీగా విన్నట్టే కదా! ఇగ... మనింట్లో మ్యూజిక్‌ సిస్టమ్‌ కొనాల్సిన అవసరమేముంది చెప్పు’ అంటూ పొదుపు పాఠాలు చెబుతున్నారండీ’’ అంటూ ఇంకా దిగులుపడిపోయింది. 

‘‘అరెరె... అలాగా’’ అంటుండగానే... 
‘‘అంతేనా... మొన్న సమ్మర్‌లో కాలుష్యం వల్ల వాతావరణంలో వేడి బాగా పెరిగిపోయి ఎక్కడో గుడ్డు పగలగొట్టి రోడ్డు మీద వేస్తే కుతకుతా ఉడికి ఆమ్లెట్‌ అయ్యిందని టీవీలో న్యూసొచ్చింది. అంతే... మర్నాటి నుంచీ ఎప్పుడు ఆమ్లెట్‌ కావాలనుకున్నా రోడ్డు మీదే వెయ్యి. అసలే ఈ మధ్య సిలెండరు ధరలు బాగా పెరిగాయి. రోడ్డుమీదే వంట చెయ్‌... గ్యాసు పొదుపు చెయ్యి’ అంటూ లెక్చర్లిస్తున్నారండీ’’ అంటూ మరో ఫిర్యాదు. 

‘‘ఏరా’’ అంటూ వాణ్ణి పలకరించబోతుంటే ఏదో గొప్పపని సాధించినవాడిలాగా చిద్విలాసంగా కనిపిస్తూ... మాంఛి గీర పోజుతో స్టైల్‌గా చుట్టూ చూస్తున్నాడు వాడు. వాళ్లావిడ మాత్రం కళ్లనీళ్లొత్తుకుంటూ కనిపించింది. వాడి దారిలోనే వాణ్ణి ఎలా దారిలోకి తేవాలో తెలియక... చివరగా ఓ చిన్న ట్రిక్కు ప్లే చేశా. 
‘‘ఒరేయ్‌ రాంబాబుగా... నీకో విషయం తెలుసా? ఇకపై పొల్యూషన్‌ మీద కూడా జీఎస్‌టీ వేస్తున్నారట’’ అన్నా. 
‘‘ఊరుకో... పొల్యూషన్‌ మీద జీఎస్‌టీ ఏమిట్రా?’’ అన్నాడు వాడు. 

‘‘ఎందుకు వేయరూ... జీఎస్‌టీ అంటే ఏమిటి? గూడ్స్‌ అండ్‌ సర్వీసెస్‌ ట్యాక్స్‌. పొల్యూషన్‌ ఓ వస్తువు అనుకుందాం. దాన్ని నువ్వు ఫ్రీగా వాడుకుంటున్నావు. అంతేకాదు... ఆ కాలుష్యమేమో నీకు రోజూ ఉచితంగా సిగరెట్లు సప్లైచేస్తూ, ఫ్రీగా మ్యూజిక్‌ వినిపిస్తూ... ఇంతటి సర్వీసు ఇస్తుంటే... మన గవర్నమెంటు ఊరికే చూస్తూ ఉంటుందా? అందుకే నీలాంటి ‘ఫ్రీగా వస్తే ఫినాయిలు’ బాపతుగాళ్లను ఐడెంటిఫై చేసి జీఎస్‌టీ వసూలు చేయబోతున్నారట తెల్సా!’’ అంటూ హెచ్చరించా. దాంతో... దిగులుగా చూస్తూ ఇంటికి బయల్దేరిపోయాడు మారాంబాబుగాడు.


– యాసీన్‌
 

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)