Breaking News

అనుపమ ఎవరినీ నిందించలేదు.. హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే: అదితి శంకర్‌

Published on Thu, 08/20/2026 - 14:17

హీరోయిన్‌ అనుపమ పరమేశ్వరన్‌ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడిస్తూ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా మాజీ ప్రియుడితో ఉన్న బంధంలో తాను ఎదుర్కొన్న మానసిక వేదన గురించి ఆమె చెప్పిన మాటలు చర్చనీయాంశంగా మారాయి. రెండేళ్ల పాటు ఆ బంధంలో నరకం చూశానంటూ అనుపమ చేసిన వ్యాఖ్యలపై అభిమానులు స్పందిస్తూ ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. తాజాగా ఈ అంశంపై నటి అదితి శంకర్‌ స్పందించారు. అనుపమ తన అనుభవాన్ని ధైర్యంగా, నిజాయతీగా పంచుకున్నారని ప్రశంసించారు.

‘వన్స్‌మోర్‌’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అనుపమ వ్యాఖ్యల గురించి ఆమెను ప్రశ్నించగా.. ‘అనుపమ ఇంటర్వ్యూ చూశాను. ఆమె కామెంట్స్‌పై ఒక్కొక్కరికి ఒక్కో అభిప్రాయం ఉండొచ్చు. కానీ, తాను ఎదుర్కొన్న ఇబ్బందిని అంత ధైర్యంగా పంచుకున్నందుకు ఆమెకు హ్యాట్సాఫ్‌ చెప్పాలి. ఆమె మాటల్లో నిజాయతీ కనిపించింది’ అని అదితి అన్నారు.

అనుపమ ఎవరినీ నిందించడానికి లేదా కించపరచడానికి ఈ విషయాలను బయటపెట్టలేదని అదితి అభిప్రాయపడ్డారు. ఆమె తనకు ఎదురైన అనుభవాన్ని మాత్రమే పంచుకున్నారని, అది చాలామందికి అవగాహన కలిగించే విషయమని పేర్కొన్నారు.

‘చాలామంది పురుషులు, మహిళలు తీవ్రమైన మానసిక ఘర్షణలతో కూడిన బంధాల్లో ఉంటున్నారు. తాము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారో కూడా కొన్నిసార్లు వారికి అర్థం కాదు. ఇలాంటి విషయాల గురించి అనుపమలా ఓపెన్‌గా మాట్లాడటం వల్ల.. అలాంటి పరిస్థితుల్లో ఉన్నవారికి తమ బంధం గురించి ఆలోచించే అవకాశం, కొంత స్పష్టత లభిస్తుంది’అని అదితి తెలిపారు.

అనుపమ ఏం చెప్పారు?
మాజీ బాయ్‌ఫ్రెండ్‌ పేరును ప్రస్తావించకుండా ఇటీవల అనుపమ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. గతంలో ఓ బంధం తనపై తీవ్ర ప్రభావం చూపిందని ఆమె పేర్కొన్నారు. ఆ వ్యక్తి ప్రవర్తన కారణంగా ఒక నటిగా, మహిళగా తనను తాను నిందించుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రెండేళ్ల పాటు ఆ బంధంలో తాను నరకం అనుభవించినట్లు చెప్పుకొచ్చారు.

అనుపమ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ కావడంతో అభిమానులు, నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు. ఆమె ఎదుర్కొన్న పరిస్థితులను గుర్తుచేసుకుంటూ ధైర్యంగా ఉండాలని, తన అనుభవాన్ని పంచుకున్నందుకు అభినందిస్తూ పలువురు పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అదితి శంకర్‌ చేసిన వ్యాఖ్యలు కూడా ఇప్పుడు వైరల్‌గా మారాయి. అనుపమకు మద్దతుగా ఆమె చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు సానుకూలంగా స్పందిస్తున్నారు.

Videos

ఏపీ కానిస్టేబుల్ అనుమానాస్పద మృతి

Watch Live: హైదరాబాద్ లో జగన్ జనసంద్రం

భారత సైన్యం దెబ్బ.. మంచు కొండల్లో చైనాకు దిమ్మతిరిగే షాక్!

ఇది సార్ మా బ్రాండ్.. రాకాలో హాలీవుడ్ నటుడు..?

ఐయామ్ Gen-Z అంటూ ఆర్మీ పై రెచ్చిపోయిన యువతీ

బాబు కొత్త కుట్రలు.. YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు

టీడీపీ కార్యకర్త కీచకత్వం.. 8 ఏళ్ల బాలికకు వేధింపులు

TDP నేతకు బిగ్ షాక్

బాబు ఇంట్లో డైనింగ్ టేబుళ్లు పగిలిపోతాయి... నువ్వు ఎవడివి నాపై CBI వేయడానికి..!

YS అవినాష్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు..

Photos

+5

‘ఇరుముడి’మూవీ ప్రెస్‌మీట్‌...బేబీ నక్షత్ర ఏం చెప్పిందో తెలుసా?

+5

నలుపు చీరలో వితిక షేరు గ్లామర్ ఫోటోలు (ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : హైటెక్స్‌లో హిమ్‌టెక్స్‌ ప్రదర్శన (ఫొటోలు)

+5

స్టన్నింగ్ లుక్‌లో అందాల తార పూజా హెగ్డే (ఫొటోలు)

+5

చీరలో మరింత అందంగా కనిపిస్తున్న ప్రియాంకా అరుళ్ మోహన్ (ఫొటోలు)

+5

చీరకట్టులో సొగసుల విందు.. నివేదా థామస్ (ఫొటోలు)

+5

విజయవాడ : వరలక్ష్మీ వ్రతం... పూల మర్కెట్‌లో విపరీతమైన రద్దీ (ఫొటోలు)

+5

నటి మాళవిక శర్మ గ్లామర్ ఫోటోలు వైరల్

+5

'అమీర్ లోగ్' సినిమా ప్రీ-రిలీజ్ వేడుక (ఫొటోలు)