Breaking News

డాక్యుమెంటరీగా వారణాసి మేకింగ్‌

Published on Tue, 08/18/2026 - 02:05

మహేశ్‌ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతున్న సినిమా   ‘వారణాసి’. ప్రియాంకా చోప్రా, పృథ్వీరాజ్‌ సుకుమారన్   ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ 80 శాతానికిపైనే పూర్తయినట్లు రాజమౌళి పేర్కొన్నారు. అయితే ఈ మూవీ జర్నీలో జార్జియాకు చెందిన సినిమాటోగ్రాఫర్‌– డాక్యుమెంటరీ డైరెక్టర్‌ గోగితా చిక్వాడ్జే భాగమయ్యారట. ‘వారణాసి’ మేకింగ్‌ డాక్యుమెంటరీని ఆయన చిత్రీకరిస్తున్నారని టాక్‌. ఈ సినిమా షూటింగ్‌ని అక్టోబరుకల్లా పూర్తి చేయాలని రాజమౌళి టార్గెట్‌గా పెట్టుకున్నారట.

అయితే ‘వారణాసి’ ప్రయాణాన్ని డాక్యుమెంటరీగా చిత్రీకరించే బాధ్యతలను గోగితా చిక్వాడ్జేకు అప్పగించారట రాజమౌళి. ఈ మూవీ ప్రీ ప్రోడక్షన్స్  నుంచే గోగితా తన పనిని ప్రారంభించార ట. నటీనటుల రిహార్సల్‌ సీన్స్ , వర్క్‌ షాప్స్, లొకేషన్స్ , మేకింగ్, సెట్‌ వర్క్స్‌... ఇలాంటివన్నీ ఈ డాక్యుమెంటరీలో ఉంటాయనే టాక్‌ ఫిల్మ్‌నగర్‌ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. అయితే ఈ అంశాలపై పూర్తిస్థాయి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఎస్‌ఎస్‌ కార్తికేయ, కేఎల్‌ నారాయణ నిర్మిస్తున్న  ‘వారణాసి’ 2027 ఏప్రిల్‌ 7న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

Videos

Telangana SIR: 90 లక్షల మందికి నోటీసులు -CEO సుదర్శన్ రెడ్డి

పిఠాపురంలో TDPకి బిగ్ స్ట్రోక్..!

భారత్ ఎన్నికలపై ట్రంప్ ఫోకస్..! అమెరికాలో కొత్త రూల్స్ కు పిలుపు

రేవంత్ పై కోపమా అక్కా.. CM టూర్ లో మంత్రి మిస్సింగ్

ఫారిన్ మెడికల్ స్టూడెంట్స్ పై జూడాల సమ్మె ప్రభావం

ప్రియాంక కేసులో కీలక మలుపు నిందితులకు పోలీస్ కస్టడీ

BJPకి షాక్ ఇస్తూ.. విజయ్ ని మెచ్చుకున్న అన్నామలై..

అర్ధరాత్రి ఆపరేషన్..! పెద్ది సుదర్శన్ రెడ్డి విగ్రహం తొలగింపు

దారి తప్పిన మమ్ముట్టి చివరికి ఏమైందంటే..?

మహిళతో TDP నేత సంచలన ఆడియో లీక్

Photos

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్ తిలక్ వర్మ (ఫొటోలు)

+5

18 ఏళ్లు పూర్తి చేసుకున్న కోహ్లి (ఫొటోలు)

+5

న్యూయార్క్‌ : 'ఇండియా డే పరేడ్ 2026'లో పూజా హెగ్డే సందడి (ఫొటోలు)

+5

కందుకూరులో వైభవంగా తేళ్ల పంచమి... పోటెత్తిన భక్తజనం (ఫొటోలు)

+5

హైదరాబాద్ : కన్నుల పండువగా ఇస్కాన్‌ దేవాలయ స్వర్ణోత్సవాలు (ఫొటోలు)

+5

ఫ్యామిలీతో ప్రియాంక చోప్రా సందడి (ఫొటోలు)

+5

చిరునవ్వులు చిందిస్తూ శ్రియా సోయగాలు (ఫొటోలు)

+5

వయ్యారాలు ఒలకబోస్తున్న రకుల్‌ (ఫొటోలు)

+5

‘ఇరుముడి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

బండ్ల గణేశ్‌ కూతురు పెళ్లిలో టాలీవుడ్ తారల సందడి (ఫోటోలు)