‘ఎంపీ డెవలపర్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

Published on Fri, 08/14/2026 - 12:42

దక్షిణాది చిత్రసీమలో ప్రముఖ కథానాయికగా గుర్తింపు పొందిన నటి సమంత కొత్త బాధ్యతలను స్వీకరించారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ నిర్మాణ సంస్థ ‘ఎంపీ డెవలపర్స్’(MP Developers) తమ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా సమంతను నియమించినట్లు ప్రకటించింది.

ఈ భాగస్వామ్యానికి ఒక ప్రత్యేకమైన, భావోద్వేగ అనుబంధం ఉందని కంపెనీ చెప్పింది. ఎంపీ డెవలపర్స్ సంస్థ ప్రస్థానం, నటి సమంత కెరీర్.. రెండూ చెన్నైలోని పల్లవరం ప్రాంతం నుంచే ప్రారంభం కావడం విశేషం. చెన్నై మూలాల నుంచి ప్రపంచ స్థాయి గుర్తింపు సాధించే దిశగా సాగుతున్న తమ ప్రయాణానికి సమంత చేరిక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుందని కంపెనీ ప్రతినిధులు పేర్కొన్నారు.

14 ఏళ్ల విశ్వసనీయత.. 250కి పైగా ప్రాజెక్టులు

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 2012లో స్థాపించిన ఎంపీ డెవలపర్స్ గత 14 ఏళ్ల కాలంలో రియల్ ఎస్టేట్ రంగంలో విశేష పురోగతిని సాధించింది.  ఇప్పటివరకు 250కి పైగా నివాస ప్రాజెక్టులను పూర్తి చేసింది. 3,000 కంటే ఎక్కువ కుటుంబాల నమ్మకాన్ని గెలుచుకుంది. చెన్నై, కోయంబత్తూర్ నగరాల్లో ప్రస్తుతం 1.5 మిలియన్ చదరపు అడుగుల (15 లక్షల చ.అ) కంటే ఎక్కువ విస్తీర్ణంలో వివిధ ప్రాజెక్టుల నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయి.

ఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ యాజమాన్యం స్పందిస్తూ.. ‘ఇల్లు అనేది కేవలం నాలుగు గోడల భవనం మాత్రమే కాదు; అది ఒక కుటుంబం భవిష్యత్తు కలలకు పునాది. అత్యుత్తమ లొకేషన్, సమర్థవంతమైన డిజైన్, నిర్మాణ నాణ్యత, కస్టమర్ల సుదీర్ఘకాల ప్రయోజనాలే లక్ష్యంగా మేము పనిచేస్తున్నాం’ అని తెలిపింది.

గ్రోత్ గ్యారెంటీ హోమ్స్

సొంతింటి కలను నెరవేర్చుకోవడంతోపాటు ఇల్లు కొనడాన్ని భవిష్యత్తుకు బలమైన పెట్టుబడిగా మార్చే దిశగా ఎంపీ డెవలపర్స్ ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ అనే వినూత్న భావనను అందుబాటులోకి తెచ్చింది.

‘ఎంపీ డెవలపర్స్’ బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత

ఈ ప్రాజెక్టుల ప్రధాన ముఖ్యాంశాలు

  • అధిక అభివృద్ధి అవకాశాలు ఉన్న ప్రాంతాలను ఎంపిక చేయడి.

  • మెరుగైన రవాణా / కనెక్టివిటీ సౌకర్యాలు కల్పించడం.

  • ఆచరణాత్మకమైన, స్థలాన్ని సమర్థవంతంగా వినియోగించే గృహాలను రూపొందించడం.

విస్తరణ దిశగా అడుగులు

ఈ సందర్భంగా ఎంపీ డెవలపర్స్ మేనేజింగ్ డైరెక్టర్ ప్రవీణ్ మలినేని మాట్లాడుతూ.. ‘మా 14 సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో ఈ రోజు ఒక కీలకమైన కొత్త అధ్యాయం ప్రారంభమైంది. 250కి పైగా ప్రాజెక్టులు పూర్తి చేసి 3,000 కుటుంబాల విశ్వాసాన్ని పొందడం మా బాధ్యతను మరింత పెంచింది. సమంతతో ఈ కొత్త భాగస్వామ్యం మా బ్రాండ్ గుర్తింపును మరింత బలోపేతం చేస్తుంది. ఇది ‘గ్రోత్ గ్యారెంటీ హోమ్స్’ సందేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. తమిళనాడులోని ద్వితీయ శ్రేణి నగరాలతో పాటు ఎన్‌ఆర్‌ఐ వినియోగదారులను ఆకట్టుకునేలా అంతర్జాతీయ స్థాయిలో విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేశాం’ అన్నారు. ‘Built for Living. Guaranteed for Growth’ అనే స్పష్టమైన విధానంతో నాణ్యమైన ఇళ్లను అందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి కుటుంబం భవిష్యత్తు పురోగతికి విలువ జోడించడమే లక్ష్యంగా ఎంపీ డెవలపర్స్ తన తదుపరి ప్రయాణాన్ని వేగవంతం చేస్తోందన్నారు.

ఇదీ చదవండి: ఒక్కరోజులో మారిన బంగారం ధరలు..

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)