పాట పాడినందుకు విధుల నుంచి తొలగించారు..! ఇవాళ ఏకంగా..

Published on Thu, 08/13/2026 - 18:08

డ్యూటీలో పాడపాడటమే శాపమై ఉపాధిని కోల్పోయేలా చేసింది. విధి ఒకడోర్‌ మూసేస్తే మరో దారి తెరుచుకుంటుంది అనేలా అతడికి మరో అవకాశం వెత్తక్కుంటూ వచ్చి..తనకు నచ్చిన విధంగా బతకేలా చేసింది. 

ఈ ఘటన కోల్‌కతాలో చోటుచేసుకుంది. సుమారు 40 ఏళ్ల వయసున్న షోవోన్ చక్రవర్తి, సాల్ట్ లేక్‌లోని సెక్టార్ Vలో ఒక ఆఫీసులో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. స్వతహాగా అతడు సంగీత కళాకారుడు. అతను శాంతినికేతన్‌లోని సంగీత్‌ భవన్‌లో విద్యార్థులకు సంగీతం బోధించేవాడు. అయితే ఆ చక్రవర్తికి సంగీతం ద్వారా వచ్చే ఆదాయం అతని ఖర్చులను తీర్చలేకపోయింది. అదీగాక కరోనా మహమ్మారి అతడి జీవితాన్ని పూర్తిగామార్చేసింది. ఆ టైంలో బోధించే విద్యార్థుల సంఖ్య తగ్గడంతో ఆర్థిక ఒత్తిళ్లు అధికమై..జీవనోపాధి కోసం సెక్యూరిటీ గార్డుగా పనిచేయక తప్పలేదు. 

అలా అతడు విధి నిర్వహణలో ఉండగా ఒకరోజు రవీంద్రనాథ్‌ ఠాగూర్‌ పాటను ఆలపిస్తుండగా ఎవరో రికార్డు చేసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. అతడు సంగీత విద్వాంసుడు కావడంతో చాలా అలవోకగా ఆ ప్రసిద్ధ సంగీతాన్ని సునాయాసంగా ఆలపించాడు. పైగా నెటిజన్లు కూడా అతడి గాత్రానికి మంత్రముగ్ధలై ప్రశంసల వర్షం కురిపించారు. కానీ అతడు పనిచేసే చోట యజమానులకు ఇదంత నచ్చలేదు. పైగా అతడిని తక్షణమే ఉద్యోగం నుంచి తొలగించారు. అతడి కథను చిత్రనిర్మాత ప్రతీమ్ డి గుప్తాకి నెట్టింట షేర్‌ చేయడంతో..యూనిఫాం ధరిస్తే..ప్రతిభను వదిలేయమనడం సరైంది కాదంటూ నెట్టింట చర్చలు మొదలయ్యాయి. 

అయితే చిత్ర నిర్మాత ప్రతీమ్‌ మాత్రం ఆయన ఆర్థికపరిస్థితులు అనుకూలించక ఈ వృత్తిలో వచ్చారే తప్ప ఆయన సెక్యూరిటీ గార్డు కాదు. పైగా పిల్లలకు సంగీత నేర్పించాలనేది అతడి ధ్యేయం. పైగా ఎవరినీ వ్యక్తి ఎలాంటి ఆర్థిక సాయం కూడా కోరలేదు. అతడి కథ వైరల్‌ వీడియో ద్వారా చాలామందికి చేరింది, పైగా అతడికి మద్దతిచ్చేందుకు సాయం చేసేందుకు చాలామంది ముందుకు వచ్చారు. 

కానీ అతడికి కావాల్సింది అది కాదంటూ బెంగాలీ గాయకుడు రూపంకర్ బాగ్చి రంగంలోకి దిగి అక్టోబర్‌లో కోల్‌కతాలోని కళా మందిర్ ఆడిటోరియంలో చక్రవర్తి కోసం సంగీత కచేరిని ఏర్పాటు చేసి ప్రోత్సహించారు. ఇలాంటి సాయం అతడికి తిరిగి సంగీతకారుడిలా జీవించే గొప్ప అవకాశంగా ఉంటుందని అన్నారు రచయిత, చిత్ర నిర్మాత ప్రతీమ్‌. అంతేగాదు షిప్ట్‌లో ఉండి సెక్యూరిటీ గార్డు పాటపడటం తప్పుకాదు..అతడు కొద్దిసేపు కళకారుడిగా ఉండాలని ఆశపడటమే తప్పు అని అన్నారు. 

(చదవండి: పర్యావరణహిత బెలూన్‌లు..! జస్ట్‌ తొమ్మిది నెలల్లో..)

 

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)