పర్యావరణహిత బెలూన్‌లు..! జస్ట్‌ తొమ్మిది నెలల్లో..

Published on Thu, 08/13/2026 - 17:15

ఇటీవల కాలంలో చిన్న పిల్లల బర్త్‌డే పార్టీ నుంచి మరే ఏదైనా ఈవెంట్‌ అయినా ప్రధాన ఆకర్షణ బెలూన్‌ల డెకరేషనే ఉంటుంది. వాటితో చేసిన ఆర్చ్‌లకు క్రేజ్‌ ఎక్కువ. దాంతో ఎటు చూసినా..ఏ వేడుకైనా బెలున్‌ డెకరేషన్‌ అత్యంత హైలెట్‌గా ఉంటుంది. వీటివల్ల బెలూన్‌ వ్యర్థాలు అధికమై వన్య ప్రాణాలతో సహా పర్యావరణానికి హానికరమనేది పర్యావరణ ప్రేమికులు ఆవేదన. ఈ సమస్యకు ఎన్నో ఏళ్లుగా చెక్‌ పెట్టాలని మేధావులు, ప్రముఖులు ఆలోచిస్తున్న తరుణంలో లండన్‌ శాస్త్రవేత్తలు సరికొత్త బెలూన్‌లను ఆవిష్కరించారు. పైగా వీటి వ్యర్థాల ప్రభావం పరిసరాలపైన తక్కువగానే ఉంటుందట. పైగా సులభంగా భూమిలో కలిసిపోతాయట కూడా. మరి ఆ బెలూన్‌ల విశిషాల గురించి సవివరంగా తెలుసుకుందామా.

సాధారణంగా బెలూన్లు విచ్ఛిన్నం కావడానికి ఏళ్ల తరబడి సమయం తీసుకుంటుంది. అలాగే అవి వాతావరణంలోకి హానికరమైన రసాయనాలను విడుదల చేయగలవని చెబుతున్నారు పరిశోధకులు. ముఖ్యంగా సముద్ర జీవులు, పక్షులు మరణాలకు ఈ బెలున్‌ వ్యర్థాలే కారణం అని పలు నివేదికలు చెబుతున్నాయి. ఆ నేపథ్యంలోనే లండన్‌ శాస్త్రవేత్తలు 'బయోలూన్'గా పిలిచే సరికొత్త బెలూన్‌లను ఆవిష్కరించారు. 

సాధారణ బెలూన్‌ కంటే ఇదేమి అంత ఖరీదైనది కాదు. ఊదడం కూడా సులభమే. సాధారణ బెలూన్లను బలంగా, సాగే గుణం వచ్చేలా చేయడానికి ఒక ప్రక్రియతో శుద్ధి చేస్తారని చెప్పుకొచ్చారు ఇంపీరియల్‌ పీహెచ్‌డీ పరిశోధకురాలు జూలియానా కమింగ్‌. కానీ ఆ ప్రక్రియ కారణంగా అవి పూర్తిగా విచ్ఛిన్నం కాకుండా ప్రకృతిలోకి విషపూరిత రసాయనాలను విడుదల చేస్తాయని అన్నారు. అయితే తాము రూపొందించిన ఈ బెలూన్‌లు పూర్తిగా విచ్ఛిన్నం కాగలవు, అలాగే ఎలాంటి సంకలితాలు లేకుండా సులభంగా మట్టిలో కలిసిపోయేలా పదార్థాలను ఉపయోగిస్తామని అన్నారు. 

ఇటీవల బెలూన్‌ ఆర్చ్‌లకు బాగా ప్రజాదరణ పెరిగింది. అదికాస్తా పర్యావరణానికి అత్యంత ప్రమాదకారంగా తయారైందని పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేగాదు ఒక అధ్యయనం ప్రకారం..సముద్ర పక్షులు తినడానికి కారణమయ్యే సముద్ర వ్యర్థాలలో బెలూన్ శకలాలు అత్యంత కీలకమైనవని అన్నారు. అలాగే పక్షులు గట్టి ప్లాస్టిక్‌ను మింగడం కంటే బెలూన్ల వల్ల 32 రెట్లు ఎక్కువగా మరణం సంభవిస్తుందని ఆ అధ్యయనంలో తేలింది. బయోలూన్‌లా కాకుండా, 100% జీవవిచ్ఛిన్నం చెందేవిగా లేబుల్ చేయబడిన బెలూన్లు కూడా తరచుగా పూర్తిగా విచ్ఛిన్నం కావని మెలియా పేర్కొన్నారు. 

ఇక్కడ తాము చేసిన బయోలూన్ కూడా అదే రబ్బరు పదార్థంతో మొదలవుతుంది, కానీ హానికరమైన సంకలితాలు లేకుండా పాలిమర్ గొలుసులను కలిపే ఒక పద్ధతిని ఉపయోగిస్తామని వెల్లడించారు. ఈ బెలూన్‌లు వచ్చే రెండేళ్ల లోపే వాణిజ్యపరంగా అందుబాటులోకి రానున్నాయని అన్నారు. అంతేగాదు ఈ పర్యావరణహిత బెలూన్‌ల తయారీలో ఉపయోగించిన పదార్థాలనే భవిష్యత్తులో గ్లౌజులు, సర్జికల్‌, నాన్‌ సర్జికల్‌ లేటెక్స్‌, వైద్య పరికరాలు, దుస్తులు, కండోమ్‌ వంటి వాటి వరకు విస్తరించాలని చూస్తున్నట్లు తెలిపారు. 

(చదవండి: "53 పెళ్లి సంబంధాలు".. ఓ ఎక్సెల్‌ షీట్‌.. చివరకు దొరికిన ‘మిసెస్‌ రైట్‌’!)

 

Videos

రాజమండ్రి ప్రియాంక ఘటనపై విద్యార్థులు భారీ ర్యాలీ

సంగారెడ్డిలో లక్ష మందితో భారీ బహిరంగ సభ

ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో సంచలన నిజాలు బయట పెట్టిన లాయర్

నల్గొండ జిల్లాలో రూపారెడ్డి హత్య కేసులో వీడని మిస్టరీ

గోవాడ షుగర్ ఫ్యాక్టరీ అమ్మకానికి కుట్ర.. చంద్రబాబును ఏకిపారేసిన అమర్నాథ్

నన్ను, హైదరాబాద్ రమ్మని చెప్పి , రాహుల్ సిప్లిగంజ్ బాధితురాలి సంచలన వీడియో...

మిల్లుల్లో మాయం అవుతున్న ప్రభుత్వ ధాన్యం

కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్

విజయ నగరంలో దారుణం ప్రియురాలిని చంపి..

Viral Video: దంపతులపై కుక్క‌ దాడి... భార్యాభర్తలకు తీవ్ర గాయాలు వైరల్ వీడియో

Photos

+5

అఖిల్‌ రాజ్‌, నాగదుర్గ జంటగా ‘శనార్తి’ సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

వెకేషన్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ చిల్.. (ఫోటోలు)

+5

'అమీర్ లోగ్' హీరోయిన్ వేద జలంధర్ బ్యూటీ ఫుల్ (ఫొటోలు)

+5

మిర్చి కంటే ఘాటుగా 'టాక్సిక్' కియారా గ్లామర్ (ఫొటోలు)

+5

హీరో శర్వానంద్ 'జార్జ్ క్రిష్' మూవీ ప్రారంభం (ఫొటోలు)

+5

'ఇరుముడి' సినిమా ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

‘అమీర్ లోగ్’ సినిమా ట్రైలర్ ఆవిష్కరణ (ఫొటోలు)

+5

'ప్యార్ ప్రేమ కళ్యాణం'మూవీ ప్రెస్‌మీట్ (ఫొటోలు)

+5

కర్నూలులో వైఎస్‌ జగన్‌కు జననీరాజనం.. కదం తొక్కిన కార్యకర్తలు (ఫొటోలు)

+5

'అగధ' మూవీ కామాక్షి భాస్కర్ల స్పెషల్‌ (ఫొటోలు)