ఆ తల్లి కన్నపేగు మన జెండా నూలుపోగు

Published on Wed, 08/12/2026 - 00:42

1927 డిసెంబర్‌ 19. గోరఖ్‌పూర్‌ జైలులో ఒక తల్లి తన 30 ఏళ్ల కొడుకును చివరిసారి కలిసింది. బ్రిటిష్‌ ప్రభుత్వం అతణ్ణి ఆ రోజు ఉరి తీయబోతోంది. కాని ఆ తల్లి కళ్లలో నీళ్లు లేవు. గొంతులో వణుకు లేదు. బదులుగా గర్వం ఉంది. ఆమె పేరు మూల్‌మతి దేవి. ‘సర్ఫరోషీ కి తమన్నా’ అని దేశాన్ని ఊపిన రాంప్రసాద్‌ బిస్మిల్‌ను కన్నతల్లి. ఆగస్టు 15 నాడు మనం జెండా ఎగురవేస్తున్నప్పుడు ఇలాంటి తల్లుల త్యాగాలను గుర్తు చేసుకోవాలి.

జైలులో ఉన్న ఆ కొడుకు తల్లిని చూడగానే ఉద్వేగంతో కన్నీరు కార్చాడు. ఆ రోజే తనకు ఆఖరు అని అతనికి తెలుసు. తల్లికీ తెలుసు. కాని ఆ తల్లి చలించలేదు. కొడుకును చూసి ఏడ్వలేదు. ‘ఎందుకురా ఏడుస్తావు? నిన్ను ఏడిపించడం రాకనే కదా బ్రిటిష్‌ ప్రభుత్వం నిన్ను చూసి భయపడింది’ అంది. ‘నేను నిన్ను మళ్లీ చూడలేనని ఏడుస్తున్నాననమ్మా... భయంతో కాదు’ అన్నాడు కొడుకు.

అప్పటిదాకా తాను జైలులో రాసిన ఆత్మకథను ఆమెకు ఇచ్చాడు. ఆమె దానిని టిఫిన్‌ డబ్బాలో దాచి రహస్యంగా బయటకు తెచ్చింది. ఆ తర్వాత ఆ ఆత్మకథ ‘కాకోరీ కే షహీద్‌’ పేరుతో పుస్తకమై లక్షలమందికి స్పూర్తినిచ్చింది. ఆ రోజు జైలు గోడలు కూడా సిగ్గుపడేంత ధైర్యం చూపిన ఆ తల్లిపేరు మూల్‌మతి దేవి.
ఆమె కన్న వీరపుత్రుడు, దేశభక్తుడే రాంప్రసాద్‌ బిస్మిల్‌.

ధిక్కారం ఆమె ధోరణి
ఉత్తర ప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో 11 ఏళ్ల వయసులో అత్తగారింట్లో మూల్‌మతి అడుగు పెట్టే సమయానికి ఆమెకు చదువు లేదు. లోకం తెలియదు. కాని భర్త సహకారంతో ఆమె చదువుకుంది. ఆడపిల్లలు పుడితే చంపేసే ఆ ఇంటిలో అత్తగారిని, బంధుగణాన్ని ఎదిరించి ఐదుమంది ఆడపిల్లలను కన్నది. పెద్ద కొడుకు రాంప్రసాద్‌ బిస్మిల్‌ అల్లరి చిల్లరగా తిరుగుతుంటే ‘నువ్వు చేయాల్సింది ఇలా బతకడం కాదు. దేశం కోసం బతకాలి’ అని నూరిపోసింది. ‘మా అమ్మ లేకపోతే నేను నాశనం అయి ఉండేవాణ్ణి’ అని రాంప్రసాద్‌ బిస్మిల్‌ తన ఆత్మకథలో రాసుకున్నాడు. బిస్మిల్‌ విప్లవవాద సాహిత్యం రాస్తుంటే మూల్‌మతి తన పొదుపు డబ్బును కొడుకు చేతిలో పెట్టి ‘దేశం మేలుకోవాలి నాన్నా. నువ్వు రాయి, నేనున్నా’ అని ప్రోత్సహించింది. దేశభక్తుల వెతుకులాటలో బ్రిటిష్‌వారు ఇళ్లను గాలిస్తుంటే ‘నా కొడుకు దొంగ కాదు, దేశాన్ని కాపాడే సిపాయి’ అని ఊర్లో గర్వంగా చెప్పుకునేది.

కాకోరి ట్రైన్‌ యాక్షన్‌
రాంప్రసాద్‌ బిస్మిల్‌ ‘హిందూస్తాన్‌ రిపబ్లికన్‌ అసోసియేషన్‌’ స్థాపించి బ్రిటిష్‌ వారిపై ఆయుధాలతో తిరగబడాలని ఆయుధాలకు కావాల్సిన డబ్బుకోసం 1925 లో లక్నో సమీపంలోని కాకోరి స్టేషన్‌ వద్ద రైలును కొల్లగొట్టి ఎనిమిది వేల రూపాయలు స్వాధీనం చేసుకున్నాడు. అది ప్రజల సొమ్మే. సుంకాల పేరుతో బ్రిటిష్‌ దోచిన సొమ్ము. అది కబ్జా చేయడం నేరం కాదని బిస్మిల్‌ అనుకున్నాడు. కాని బ్రిటిష్‌వారు ఈ దాన్ని తమకు పరువు తక్కువగా భావించారు. భారీ వేట కొనసాగించి రాంప్రసాద్‌ బిస్మిల్‌ను, అతనితో పాటు రైలు యాక్షన్‌లో పాల్గొన్న అష్ఫఖుల్లా ఖాన్, మరికొంతమందిని అరెస్టు చేశారు. రాంప్రసాద్‌ తోపాటు మొత్తం నలుగురికి ఈ కేసులో ఉరిశిక్ష పడింది. 1927లో ఉరిశిక్ష అమలు చేస్తే రెండేళ్లు రాం ప్రసాద్‌ గోరఖ్‌పూర్‌ జైలులో గడిపాడు. ఉరిశిక్షకు ముందు తల్లిని కలిశాడు. ఉరిశిక్షలో ఉరితాడును ముద్దాడుతూ రాంప్రసాద్‌ చివరి మాట...‘బ్రిటిష్‌ సామ్రాజ్యం నాశనం కావాలి’. ఆ శక్తి, స్థయిర్యం మూల్‌మతిది.

ఒక కొడుకు పోయినా...
బిస్మిల్‌ను ఉరితీస్తే దేశం మొత్తం దుఃఖంలో మునిగింది. కానీ మూల్‌మతి దేవి కొద్దిరోజులకే ఒక బహిరంగ సభకు వెళ్లి వేలాది మంది ముందు మైక్‌ పట్టుకుని ‘నా పెద్ద కొడుకు దేశం కోసం ప్రాణం ఇచ్చాడు. నా చిన్న కొడుకును కూడా ఇప్పుడే అర్పిస్తున్నాను. అవసరమైతే నా ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరినీ ఇస్తాను’ అంది.  కడుపు కోత మానకముందే రెండో కొడుకును అదే త్యాగానికి సిద్ధం చేసింది. ఆ తర్వాత ఆమె మీద బ్రిటిష్‌ వారి పరోక్ష నిర్బంధం కొనసాగింది. రూపాయి రూపాయికి ఆమె అల్లాడాల్సి వచ్చింది. ఎన్ని కష్టాలు పడినా ధైర్యంగా ఎదుర్కొంది. షాజహాన్ పూర్‌లో స్త్రీలకు దేశభక్తి గేయాలు నేర్పేది. చరఖా తిప్పమని, ఖాదీ కట్టమని చెప్పేది. దేశం కోసమే బతుకుతూ చివరి ఊపిరి వదిలింది.

వారి త్యాగమే....
ఆగస్టు 15న మనం రంగురంగుల బెలూన్లు ఎగురవేస్తాం. తీపి పంచుకుంటాం. కానీ ఈ స్వేచ్ఛ వెనుక మూల్‌మతి లాంటి తల్లులు ఉన్నారు. వాళ్లు కొడుకులను కనలేదు. అమరవీరులను కన్నారు. ఈరోజు మనం స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నాం అంటే అందుకు కారణం సరిహద్దులోని సైనికుడు మాత్రమే కాదు... ఇంట్లో కూర్చుని కొడుకును యుద్ధానికి పంపిన తల్లి కూడా. సెల్యూట్‌ టు మూల్‌మతి దేవి. అమ్మా నీ పాదాలకు వందనాలు.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)