మాన్యువల్‌ కార్లకు ఎందుకింత డిమాండ్?

Published on Tue, 08/11/2026 - 18:44

టెక్నాలజీ ఎంత వేగంగా మారుతున్నా.. కొత్త మోడళ్లు మార్కెట్లోకి వస్తున్నా.. భారతీయ డ్రైవర్లకు ఇప్పటికీ ‘మాన్యువల్‌’ గేర్‌బాక్స్‌లపై నమ్మకం కొనసాగుతోంది. సెకండ్‌ హ్యాండ్‌ (యూజ్డ్‌) కార్ల మార్కెట్లో క్లచ్‌ పెడల్‌తో నడిచే వాహనాలదే ఆధిపత్యం కొనసాగుతోంది. ‘గేర్స్‌ ఆఫ్‌ గ్రోత్‌–2025’ నివేదిక ప్రకారం.. 2025లో విక్రయమైన యూజ్డ్‌ కార్లలో 72 శాతం మాన్యువల్‌ గేర్‌బాక్స్‌ వాహనాలే ఉన్నాయి. అయితే, ఆటోమేటిక్‌ కార్ల వాటా 28 శాతంగా ఉంది. అంటే ఆటోమేటిక్‌ కంటే మాన్యువల్‌ కార్లను ఎంచుకునే వారి సంఖ్య దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉంది. వయసు, లింగం, ప్రాంతాల వారీగా పరిశీలిస్తే.. మాన్యువల్‌ కార్ల ఆధిపత్యం కొనసాగుతున్నప్పటికీ, ఆటోమేటిక్‌ వాహనాల వైపు ఆసక్తి క్రమంగా పెరుగుతోందని నివేదిక వెల్లడించింది.

యువతలో 'ఆటోమేటిక్‌'పై ఆసక్తి
యువ కొనుగోలుదారులు, ముఖ్యంగా 35 ఏళ్లలోపు వారు మార్కెట్‌ సగటుతో పోలిస్తే ఆటోమేటిక్‌ కార్లకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ట్రాఫిక్‌ రద్దీ, డ్రైవింగ్‌లో సౌలభ్యం, మారుతున్న జీవనశైలి కారణంగా కొత్త తరం కొనుగోలుదారులు ఆటోమేటిక్‌ వాహనాల వైపు ఆకర్షితులవుతున్నారు. ముఖ్యంగా బెంగళూరు, ముంబై వంటి నగరాల్లో రోజువారీ ప్రయాణాల్లో క్లచ్‌ వినియోగం తగ్గించడం ఆటోమేటిక్‌ కార్లకు అనుకూలంగా మారుతోంది.

భవిష్యత్తులో యువత ఆదాయ స్థాయి పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌ కార్ల మార్కెట్‌ మరింత విస్తరించే అవకాశం ఉంది. అయితే 45 ఏళ్లు పైబడిన కొనుగోలుదారులు మాత్రం మాన్యువల్‌ కార్లపైనే ఎక్కువ విశ్వాసం చూపుతున్నారు. తక్కువ నిర్వహణ వ్యయం, సులభమైన మరమ్మతులు, ఎక్కువ రీసేల్‌ అవకాశాలు ఇందుకు కారణాలుగా నివేదిక పేర్కొంది.

ఏది కొనాలి?
మాన్యువల్‌ లేదా ఆటోమేటిక్‌.. ఏది సరైన ఎంపిక అనేది కొనుగోలుదారుల వినియోగ అవసరాలపై ఆధారపడి ఉంటుంది. ఎక్కువగా నగరాల్లో, ముఖ్యంగా ట్రాఫిక్‌ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రయాణించే వారికి ఆటోమేటిక్‌ కార్లు సౌకర్యవంతమైన ఎంపికగా నిలుస్తాయి. పదేపదే క్లచ్‌ నొక్కాల్సిన అవసరం లేకపోవడం, డ్రైవింగ్‌ సులభంగా ఉండటం వీటి ప్రధాన ప్రయోజనాలు. మరోవైపు ఎక్కువ దూరాలు ప్రయాణించే వారు, చిన్న పట్టణాలు లేదా గ్రామీణ ప్రాంతాల్లో వినియోగించే వారు, తక్కువ నిర్వహణ వ్యయాన్ని కోరుకునే వారికి మాన్యువల్‌ కార్లు ఇప్పటికీ మెరుగైన ఎంపికగా ఉన్నాయి.

అయితే.. సెకండ్‌ హ్యాండ్‌ ఆటోమేటిక్‌ కారు కొనుగోలు చేసే వారు గేర్‌బాక్స్‌ పనితీరు, సర్వీస్ రికార్డు, తనిఖీ నివేదికలు, వారంటీ అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌లో సమస్యలు వస్తే మరమ్మతు వ్యయం మాన్యువల్‌ కార్లతో పోలిస్తే చాలా ఎక్కువగా ఉంటుంది.

మాన్యువల్‌ కార్లకు ఎందుకు డిమాండ్‌?
సెకండ్‌ హ్యాండ్‌ కార్ల మార్కెట్‌లో మాన్యువల్‌ కార్ల ఆధిపత్యానికి ప్రధానంగా మూడు కారణాలు ఉన్నాయి. ఇందులో తొలి కారణం ధర. మాన్యువల్‌ కార్ల కొనుగోలు ధరతో పాటు నిర్వహణ ఖర్చు (సర్వీసింగ్ వ్యయం) కూడా తక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చిన్న పట్టణాల్లో ‘విలువ’కు ప్రాధాన్యం ఇచ్చే కొనుగోలుదారులు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నారు. రెండోది అలవాటైన డ్రైవింగ్‌. దేశంలో ఎక్కువ మంది డ్రైవింగ్‌ను మాన్యువల్‌ కార్లతోనే ప్రారంభించారు.

కాబట్టి సెకండ్‌ హ్యాండ్‌ కొనుగోలు చేసేవారు తమకు పరిచయమైన గేర్‌ వ్యవస్థనే ఎంచుకుంటున్నారు. మూడోది ఉత్తమ రీసేల్‌ విలువ. మాన్యువల్‌ కార్లకు దేశవ్యాప్తంగా ఎక్కువ మంది కొనుగోలుదారులు ఉంటారు కాబట్టి సులభంగా విక్రయించవచ్చు. మరోవైపు మాన్యువల్‌ గేర్‌బాక్స్‌తో పోలిస్తే ఆటోమేటిక్‌ ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థను పరిశీలించడం కష్టంగా ఉంటుంది. టార్క్‌ కన్వర్టర్, ఏఎంటీ, సీవీటీ, డ్యూయల్‌ క్లచ్‌ వంటి ఆటోమేటిక్‌ వ్యవస్థల్లో సమస్యలు వస్తే మరమ్మతు ఖర్చు ఎక్కువగా ఉంటుంది.

నగరాల్లో ఆటోమేటిక్స్‌.. పట్టణాల్లో మాన్యువల్స్‌
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే మెట్రో నగరాల్లో ఆటోమేటిక్‌ కార్ల వాటా ఎక్కువగా ఉంది. అధిక ట్రాఫిక్, సౌకర్యవంతమైన ప్రయాణానికి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల నగర వినియోగదారులు ఆటోమేటిక్‌ మోడళ్లను ఎంచుకుంటున్నారు. మెట్రో మార్కెట్లలో మారుతీ బాలెనో, హోండా సిటీ మోడళ్ల ఆటోమేటిక్‌ వేరియంట్లకు డిమాండ్‌ కనిపిస్తోంది. మరోవైపు నాన్‌-మెట్రో మార్కెట్లలో తక్కువ ధర, తక్కువ నిర్వహణ వ్యయం కలిగిన మోడళ్లకు డిమాండ్‌ కొనసాగుతోంది. మారుతీ స్విఫ్ట్‌ డిజైర్, వ్యాగన్‌ఆర్, ఆల్టో, గ్రాండ్‌ ఐ10 వంటి కార్లు ఈ మార్కెట్లలో ఎక్కువగా ప్రాచుర్యం పొందుతున్నాయి.

Videos

భారతి సిమెంట్స్ కేసులో కూటమి ప్రభుత్వానికి గట్టి షాకిచ్చిన హైకోర్టు

చిరు NEXT మూవీ టైటిల్ లీక్.. వద్దు వద్దు అంటున్న ఆపుకోలేక నోరు జారిన చిరంజీవి

ఆ సీఐ చుట్టూ కూటమి రాజకీయం..!

LB నగర్ పీఎస్ లో కానిస్టేబుల్ ఆత్మహత్య

కేకును కోస్తే అరెస్ట్ చేసి నడి రోడ్డుపై నడిపించారు.. మెడికల్ విద్యార్థిని ప్రియాంకను చంపేస్తే మాత్రం వారిని

నేడు MLA, MLCలతో వైఎస్ జగన్ కీలక సమావేశం

నా కాలు విరిగినా.. నా ప్రాణం పోతాదన్నా జగనన్న కోసం ఎలాంటి కష్టానైనా...

EVM ట్యాపరింగ్ జరిగిందో లేదో చంద్రబాబే చెప్పాలి..! ఉండవల్లి అరుణ్ కుమార్ షాకింగ్ కామెంట్స్

రాజమండ్రి పోలీసులు అందరూ ఎలాంటివారంటే..! డాక్టర్ ప్రియాంక ఘటనపై అడ్వకేట్ బాల కామెంట్స్

నా భర్తను అక్రమంగా అరెస్ట్ చేసి... సీదిరి అప్పలరాజు భార్య సంచలన వ్యాఖ్యలు

Photos

+5

హైదరాబాద్‌లో మొదలైన వినాయక చవితి 2026 సందడి (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ మూవీ టీజర్ రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘విశ్వనాథ్ & సన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌...(ఫొటోలు)

+5

‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ సెలబ్రేషన్స్‌...ముఖ్య అతిథిగా చిరంజీవి (ఫొటోలు)

+5

హాఫ్ శారీలో చిన్న పిల్లలా హీరోయిన్ నభా నటేశ (ఫొటోలు)

+5

ఫైరింగ్ కియారా.. అందం ఏ మాత్రం తగ్గలే (ఫొటోలు)

+5

ఐశ్వర్య రాజేశ్ ఇంతలా మారిపోయిందేంటి? (ఫొటోలు)

+5

యంగ్ హీరోతో నయన్ లవ్ పోజులు (ఫొటోలు)

+5

‘అగధ’ మూవీ ప్రీ రిలీజ్‌ ఈవెంట్ (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం క్యూట్ ఫ్యామిలీ.. వెకేషన్ (ఫొటోలు)