Breaking News

ఇంతకీ ఉన్నట్టా... లేనట్టా?

Published on Sun, 08/09/2026 - 00:57

అప్పట్లో పోయినోళ్ల జ్ఞాపకాలను నెమరేసుకుంటూ వారి గురించి మాట్లాడుకునేవారు. కాని ఇప్పుడు టెక్నాలజీ మారింది. ఇప్పుడు పోయినోళ్ల గురించి కాదు.. ఏకంగా పోయినోళ్లతోనే మాట్లాడేస్తున్నారు... అదెలా సాధ్యమంటే, ఉందిగా ఏఐ... మరణించిన వారి ఫోటోలను, వీడియోలు, వాయిస్‌లను ఏఐకి ఇస్తే అది వాటిని ప్రాసెస్‌ చేసి అచ్చం చనిపోయినవారే బతికొచ్చినట్టు రీక్రియేట్‌ చేస్తుంది. దీంతో వారు మనతో ఉన్న భావన కలుగుతుంది. కాని ఈ వింత వైనం ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది అన్నదానిపై ఎవరికీ స్పష్టత లేదు.

సాంకేతిక పరిభాషలో ఇలాంటి చాట్‌బాట్స్‌ని గ్రిఫ్‌ బాట్స్, డెడ్‌ బాట్స్‌ అని పిలుస్తారు. మరణించిన వ్యక్తులను మిస్‌ అవుతున్నామని బాధపడేవారు ఇలా ఏఐ సాయంతో వారిని చూసుకుంటూ వారితో మాట్లాడుకుంటూ సాంత్వన పొందుతున్నారు. కాని చావుపుట్టుకలు ప్రకృతి నైజం... వీటì కి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే ఫలితాలు కూడా ప్రతికూలంగానే ఉంటాయి. 

ఇటీవలే కొలరాడో విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్త జాక్‌ మ్యానింగ్‌ నేతృత్వంలో ఈ డెడ్‌ బాట్స్‌ వల్ల మానసిక పరివర్తనలో మార్పులను తెలుసుకునేందుకు ఓ పరిశోధన చేశారు. కొందరు వ్యక్తులపై చేసిన ఈ పరిశోధనలో కొన్ని వాస్తవాలు వెలుగు చూశాయి. నిజానికి కోల్పోయినవారిని తిరిగి చూస్తున్నామన్న ఆనందం సంబంధిత వ్యక్తుల్లో కనిపిస్తున్నా క్రమంగా అదో అలవాటులా మారుతున్నట్టు పరిశోధకులు తేల్చారు. అంటే మరణించినవారు తిరిగిరారన్న వాస్తవాన్ని వారు అంగీకరించలేకపోతున్నారన్నమాట.  

చట్టాలు లేవా? దీంతోపాటు నైతిక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరణించిన వ్యక్తి డిజిటల్‌ సమాచారాన్ని ఏఐ కోసం ఉపయోగించడానికి ముందస్తు అనుమతి అవసరమా? ఆ వ్యక్తి స్వరం, వ్యక్తిత్వం, సంభాషణా శైలిని పునర్నిర్మించే హక్కు ఎవరిది? గోప్యత, డేటా యాజమాన్యం, మరణానంతర హక్కులపై ఇప్పటికీ స్పష్టమైన నిబంధనలున్న చట్టాలే వీ ప్రస్తుతం అనేక దేశాల్లో లేవని నిపుణులు చెబుతున్నారు. సాంకేతికత ఎంత వేగంగా అభివృద్ధి చెందినా, దుఃఖం మాత్రం మానవ జీవితంలో అత్యంత వ్యక్తిగతమైన భావోద్వేగమేనని, వాస్తవాలను అంగీకరించి జీవితాన్ని కొనసాగించడమే ఉత్తమమని పరిశోధకులు అభి ప్రాయపడుతున్నారు.
 

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)