Breaking News

UPI ఛార్జీలపై కేంద్రం కీలక ప్రకటన!

Published on Sat, 08/08/2026 - 19:44

యూపీఐ చెల్లింపులపై ఛార్జీలు వసూలు చేయబోతున్నారంటూ.. ఇటీవల వార్తలు రావడంతో వినియోగదారుల్లో సందేహాలు మొదలయ్యాయి. ముఖ్యంగా పేమెంట్ అండ్ సెటిల్మెంట్ సిస్టమ్స్ యాక్ట్ 2007లో మార్పులకు సంబంధించిన బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందిన తర్వాత ఈ చర్చ మరింత పెరిగింది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తాజాగా క్లారిటీ ఇచ్చింది. సాధారణ యూపీఐ చెల్లింపులకు వినియోగదారుల నుంచి ఎలాంటి ట్రాన్సాక్షన్ ఛార్జీలు వసూలు చేయబోమని కేంద్రం స్పష్టం చేసింది.

అంటే ఎప్పటిమాదిరిగానే.. ఒక వ్యక్తి మరో వ్యక్తికి యూపీఐ ద్వారా డబ్బులు పంపడం ఉచితంగానే కొనసాగుతుందన్నమాట. అయితే కొన్ని పరిమితమైన వ్యాపార లావాదేవీల విషయంలో మాత్రం భవిష్యత్తులో చిన్న మొత్తంలో ఛార్జీలు విధించే అవకాశం ఉందని ప్రభుత్వం తెలిపింది. దీనినే ఎండీఆర్ (మర్చంట్ డిస్కౌంట్ రేట్) అంటారు.

ఉదాహరణకు.. ఒక షాప్‌లో యూపీఐ ద్వారా చెల్లించినప్పుడు, ఆ చెల్లింపును ప్రాసెస్ చేసినందుకు వ్యాపారి చెల్లించే రుసుమే ఎండీఆర్. ప్రస్తుతం యూపీఐలో ఎండీఆర్ సున్నాగా ఉంది కాబట్టి సాధారణంగా వ్యాపారులు యూపీఐ చెల్లింపులు తీసుకున్నందుకు ఎలాంటి ఫీజు చెల్లించడం లేదు.

ఒకవేళ భవిష్యత్తులో ఎండీఆర్‌ను ప్రవేశపెట్టినా, అది ప్రతి యూపీఐ చెల్లింపుపై ఉండదని కేంద్రం స్పష్టం చేసింది. ఒక నిర్దిష్ట పరిమితి దాటిన కొన్నింటికి మాత్రమే, అదీ చాలా తక్కువ రేటుతో ఛార్జీ ఉండే అవకాశం ఉందని సమాచారం. ముఖ్యంగా.. P2P (వ్యక్తి నుంచి వ్యక్తికి) చెల్లింపులు మాత్రం ఉచితంగానే ఉంటాయని ప్రభుత్వం వెల్లడించింది. కాబట్టి సాధారణంగా మనం చేసే యూపీఐ పేమెంట్లకు ఛార్జీలు వస్తాయనే ఆందోళన ఇకపై అవసరం లేదు.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)