Breaking News

E20 పెట్రోల్‌పై ఆందోళనలు.. పరీక్షల్లో తేలింది ఇదే!

Published on Sat, 08/08/2026 - 17:11

భారత్‌లో ఈ20 పెట్రోల్‌పై గత కొంతకాలంగా.. పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇథనాల్ కలపడం వల్ల ఇంధన నాణ్యతపై ప్రభావం పడుతుందా?.. క్లోరైడ్, తేమ లేదా నీరు కలిసే అవకాశం ఉందా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. ఇండియన్ ఆయిల్, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ వంటి ప్రభుత్వ రంగ చమురు సంస్థలు దేశవ్యాప్తంగా ఈ20 పెట్రోల్ నమూనాలను పరీక్షించాయి.

దేశంలోని రిఫైనరీల నుంచి సేకరించిన 100కు పైగా పెట్రోల్ నమూనాలను పరీక్షించగా.. వాటిలో క్లోరైడ్ స్థాయి 1 ppm లేదా అంతకంటే తక్కువగా నమోదైంది. 80 డిస్టిలరీల నుంచి సేకరించిన ఇథనాల్ నమూనాల్లో క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగా ఉంది. డిపోలు, టెర్మినల్స్ నుంచి సేకరించిన 80కి పైగా ఈ20 నమూనాల్లో కూడా క్లోరైడ్ స్థాయి 3 ppm కంటే తక్కువగానే ఉన్నట్లు చమురు సంస్థలు తెలిపాయి.

ఇదే సమయంలో.. దేశవ్యాప్తంగా సుమారు 90,000 పెట్రోల్ బంకుల్లోని భూగర్భ ట్యాంకులను కూడా తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో ట్యాంకుల్లోకి నీరు చేరినట్లు ఎలాంటి ఆధారాలు కనిపించలేదని సంస్థలు పేర్కొన్నాయి. దీంతో ఈ20 పెట్రోల్ నాణ్యతపై వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, సాధారణంగానే ఈ20 పెట్రోల్‌ను ఉపయోగించవచ్చని చమురు సంస్థలు చెబుతున్నాయి.

చమురు సంస్థలు ఎన్ని చెబుతున్నా.. ఈ20పై వినియోగదారుల నుంచి విమర్శలు మాత్రం వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా పాత వాహనాల్లో 20 శాతం ఇథనాల్ కలిగిన పెట్రోల్ వాడటం వల్ల మైలేజ్ తగ్గడం లేదా వాహనం పనితీరులో మార్పులు రావచ్చని కొందరు చెబుతున్నారు. ముఖ్యంగా పాత వాహనాలలో సమస్యలు ఎక్కువగా తలెత్తుతున్నట్లు వాహన వినియోగదారులు పేర్కొంటున్నారు.

Videos

ఆ కోపంతోనే కారుతో ప్రియాంకను ఢీకొట్టారు

నువ్వు బిరియాని కనిపెడితే ఇరానీలు ఏం చేసినట్లు? బాబుపై బుగ్గన సెటైర్లే సెటైర్లు

DSCలో అంధుడిని మోసం చేసిన లోకేష్

షూస్ వేసుకొని వెంకన్న విగ్రహం తీసుకున్న కేంద్ర మంత్రి పెమ్మసాని

దిశా చట్టాన్ని పేరు మార్చి అయినా చట్టాన్ని అమలు చెయ్.. అనితకు వరుదు కళ్యాణి సూచన

రఫేల్ ది గేమ్ చేంజర్

నీ కంటే అడుక్కున్నవాడు నయం..! బాబు,లోకేష్ ని ఏకిపారేసిన లక్ష్మీ పార్వతి

అన్యాయం జరిగిన వారికి ఉద్యోగాలు ఇవ్వాల్సిందే

లోన్ తీసుకున్నారా? ఇక EMI వేధింపులు ఉండవు

కండిషన్ క్రిటికల్ చివరి ప్రయత్నాలు

Photos

+5

ప్రెగ్నెన్సీతో సమంత.. ఆగస్టు ఎనర్జీతో ఇలా (ఫొటోలు)

+5

వేశ్య పాత్రలో అదరగొట్టిన వామికా గబ్బి.. ఈ బ్యూటీ బ్యాగ్‌గ్రౌండ్‌ తెలుసా? (ఫొటోలు)

+5

సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ మూవీ HD స్టిల్స్

+5

హైదరాబాద్ : అమ్మవారికి బంగారు బోనం సమర్పించిన కొణిదెల నిహారిక .. ఫొటోలు వైరల్

+5

హైదరాబాద్ లో సందడి చేసిన ‘కాంతారా’ ఫేమ్‌ రుక్మిణి వసంత్‌ (ఫొటోలు)

+5

‘కొరియన్‌ కనకరాజు’ సినిమా సక్సెస్‌ సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

విజయ్ విడాకుల కేసులో ట్విస్ట్.. ట్రెండింగ్‌లో ఫ్యామిలీ ఫోటోలు

+5

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో బోనాల పండుగ (ఫొటోలు)

+5

ఒంగోలు : భక్తితో వేల్ కావడి ఉత్సవం (ఫొటోలు)

+5

'కనకరాజు'తో హ్యాట్రిక్ కొట్టిన రితికా నాయక్ (ఫొటోలు)