Breaking News

వాట్సాప్‌లో కొత్త రూల్.. వయస్సు వివరాలపై చర్చ!

Published on Sun, 08/02/2026 - 17:20

ప్రపంచంలో ఎక్కువమంది ఉపయోగించే మెసేజింగ్ యాప్‌లలో ఒకటైన వాట్సాప్‌లో కొత్త మార్పు కనిపిస్తున్నట్లు తెలుస్తోంది. కొంతమంది భారతీయ వినియోగదారులను తమ పుట్టిన తేదీ వివరాలు నమోదు చేయాలని వాట్సాప్ కోరుతున్నట్లు సమాచారం. దీంతో వాట్సాప్ వయస్సు ధృవీకరణ నిబంధనలను తీసుకురావడానికి సిద్ధమవుతోందా?.. అనే చర్చ మొదలైంది.

ప్రస్తుతం దీనికి సంబంధించిన సోషల్ మీడియా పోస్టులు కూడా వైరల్ అవుతున్నాయి. ఇందులో యూజర్లను పుట్టిన తేదీని నమోదు చేయమని కోరుతున్నట్లు కనిపించింది. బహుశా భారత ప్రభుత్వం నిబంధనల కారణంగా ఈ అప్డేట్ తీసుకొస్తోందా?, అనే సందేహం కలుగుతోంది.

అయితే.. ఈ విషయంపై ఇప్పటివరకు వాట్సాప్ కానీ, భారత ప్రభుత్వం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. కాబట్టి ఇది పూర్తిగా నిజమని నమ్మలేము. అధికారిక సమాచారం వచ్చే వరకు వేచి చూడాలి.

వయస్సు వివరాలు ఎందుకు?
వాట్సాప్.. తన యూజర్ల వయస్సు అడగడం ఇదే మొదటిసారి కాదు. కొన్ని సందర్భాల్లో ఖాతా ప్రారంభించే సమయంలో లేదా కొన్ని ప్రత్యేక ఫీచర్లను ఉపయోగించే సమయంలో వయస్సును నిర్ధారించేందుకు వాట్సాప్ ఈ వివరాలను అడుగుతుంది. ఇప్పుడు కూడా బహుశా ఇలాంటిదే యూజర్లకు కనిపించి ఉండవచ్చు.

వివిధ దేశాల్లో అమలవుతున్న కొత్త చట్టాలు, నిబంధనలకు అనుగుణంగా పనిచేయడం కోసం.. వయస్సు సమాచారం కూడా చాలా ఉపయోగపడుతుందని కంపెనీ చెబుతోంది. అంతేకాకుండా.. వినియోగదారులకు వారి వయస్సుకు సరిపోయే సేవలను అందించేందుకు కూడా ఈ వివరాలు ఉపయోగపడతాయి. ప్రస్తుతం వాట్సాప్‌లో అందుబాటులో ఉన్న కొన్ని మెటా ఏఐ ఫీచర్లు, స్టేటస్, ఛానల్స్‌లో కనిపించే ప్రకటనల విషయంలో కూడా వయస్సు ఆధారంగా అనుభవాన్ని అందించేందుకు ఈ సమాచారం ఉపయోగపడే అవకాశం ఉంది.

ఇదీ చదవండి: అందుకే వెండి ధరలు.. భారీగా తగ్గాయ్!

Videos

కామన్వెల్త్ లో భారత్ పతకాల పంట.. 13 స్వర్ణాలతో 4వ స్థానం..

మూవీ చూసి బాబాయ్ ఏం చెప్పాడంటే..

విరుపాక్షిని హత్య చేసే కుట్ర..! లోకేష్ ని వదిలిపెట్టం..

ఎమ్మెల్యే విరూపాక్షి అరెస్ట్ పై బుట్టా రేణుక స్ట్రాంగ్ రియాక్షన్

పెమ్మసాని పై అంబటి అదిరిపోయే సాంగ్

బాబుకు షాక్.. TDPపై జనసేన ఘన విజయం

మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించిన సీఎం రేవంత్

జూరాల వద్ద పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ

ఇరాన్ యుద్ధం పై ట్రంప్ కీలక నిర్ణయం..

విశాఖ యారాడ బీచ్ లో విషాదం..! అలల ఉధృతికి ఇద్దరు గల్లంతు

Photos

+5

Ujjaini Mahankali Bonalu : ఘనంగా సికింద్రాబాద్‌ ఉజ్జయినీ మహంకాళి బోనాలు (ఫోటోలు)

+5

ఫ్రెండ్‌షిప్ డే స్పెషల్.. దోస్తులతో మంచు లక్ష్మీ (ఫొటోలు)

+5

కాశీ పరమేశ్వరుడి సేవలో ధనశ్రీ వర్మ (ఫొటోలు)

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 02- 09)

+5

శ్రీవారి సేవలో యాంకర్ లాస్య-మంజునాథ్ జంట(ఫోటోలు)

+5

బ్లాక్‌ డ్రెస్‌లో దివ్య పిళ్లై స్టన్నింగ్‌ లుక్స్‌ (ఫోటోలు)

+5

చీరలో సంయుక్త.. ఎంత అందంగా ఉందో(ఫోటోలు)

+5

బ్లాక్ శారీలో మెరిసిన కాయదు లోహర్.. ఫోటోలు

+5

లండన్ ట్రిప్‌లో వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

మిల మిల మెరిసిన 'చెన్నై లవ్ స్టోరీ' తార (ఫొటోలు)