BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?
Breaking News
‘రాకా’లో షారుక్.. రూ. 1000 కోట్ల బడ్జెట్.. అట్లీ ప్లాన్ అదుర్స్!
Published on Thu, 07/30/2026 - 17:15
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ సైన్స్ ఫిక్షన్ చిత్రం ‘రాకా’పై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. భారతీయ సినీ పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులలో ఒకటిగా భావిస్తున్న ఈ సినిమా గురించి తాజాగా మరో ఆసక్తికర సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని దాదాపు రూ.1,000 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్ కోసం అంతర్జాతీయ స్టూడియోలతో కలిసి చిత్ర బృందం పనిచేస్తోందని సమాచారం.
షారుక్ ఖాన్ కామియో?
ఈ చిత్రంలో బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆయన కామియోకు సంబంధించిన చిత్రీకరణ ఇంకా ప్రారంభం కాలేదని తెలుస్తోంది. విదేశాల్లో నిర్వహించే ప్రత్యేక షూటింగ్ షెడ్యూల్లో షారుక్‌కు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరించే అవకాశం ఉందట. అయితే ఈ విషయంపై చిత్ర నిర్మాణ సంస్థ నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
రెండు కాలాల్లో సాగే కథ
'రాకా' కథ రెండు విభిన్న కాలాల్లో సాగనున్నట్లు సమాచారం. ఒక భాగం పురాణ–వేద కాలంలోని గిరిజన నేపథ్యంలో ఉండగా, మరో భాగం ఆధునిక కాలంలో కొనసాగుతుందని తెలుస్తోంది. ఈ ప్రత్యేక కథన నిర్మాణమే సినిమాపై ప్రేక్షకుల్లో మరింత ఆసక్తిని పెంచుతోంది. ఆధునిక కాలానికి సంబంధించిన కథలో మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటిస్తున్నట్లు సమాచారం. మరోవైపు చారిత్రక భాగంలో దీపికా పదుకొణె కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రచారం జరుగుతోంది.
అలాగే జాన్వీ కపూర్, రష్మిక మందన్న కూడా అదే టైమ్‌లైన్‌లో ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇతర నటీనటుల్లో చెంబన్ వినోద్ జోస్, యోగి బాబు, ఫెమినా జార్జ్ కీలక పాత్రల్లో నటించనున్నట్లు తెలుస్తోంది. విజయ్ సేతుపతి కూడా ఈ ప్రాజెక్టులో భాగమవుతారనే ప్రచారం ఉన్నప్పటికీ, అల్లు అర్జున్, దీపికా పదుకొణె పేర్లను మినహాయించి పూర్తి తారాగణాన్ని చిత్ర బృందం ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు.
రిలీజ్ ఎప్పుడంటే..?
'రాకా' విడుదల తేదీని మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు సమాచారం. భారీ బడ్జెట్ కావడంతో.. ఒకే సినిమాగా రిలీజ్ చేస్తే బ్రేక్ ఈవెన్‌లో ఇబ్బందులొస్తాయని.. అట్లీ భావిస్తున్నాడట. పార్ట్ 1, పార్ట్ 2 రిలీజ్ చేస్తే కేజీయఫ్, పుష్ప, బాహుబలిలా ఈ చిత్రం కూడా ఎక్కువ వసూళ్లను సాధిస్తుందని నిర్మాతలు భావిస్తున్నారట. వచ్చే ఏడాది సమ్మర్లో పార్ట్ 1 రిలీజ్ చేసి.. మరుసటి ఏడాదిలో పార్ట్ 2ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నారట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
Tags : 1