Breaking News

బంగారం ఎందుకో చిన్నబోయింది!

Published on Thu, 07/30/2026 - 13:49

అంతర్జాతీయ వ్యాప్తంగా బంగారం ధరల్లో నెలకొన్న తీవ్ర అస్థిరత భారతీయ పసిడి ప్రియులను కొనుగోళ్లకు దూరంగా ఉంచుతున్నాయి. చారిత్రక ప్రాధాన్యమున్న గోల్డ్‌ విక్రయాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరపు ఏప్రిల్-జూన్ త్రైమాసికం కాలంలో దేశీయ బంగారం డిమాండ్ వార్షిక ప్రాతిపదికన 6 శాతం తగ్గి 131.4 టన్నులకు పడిపోయిందని వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ తన తాజా ‘క్యూ2 గోల్డ్ డిమాండ్ ట్రెండ్స్’ నివేదికలో వెల్లడించింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో దేశీయంగా 139.7 టన్నుల పసిడి వినియోగం నమోదైంది.

పరిమాణం తగ్గినా.. విలువలో ఆల్‌టైమ్ రికార్డు!

బంగారం కొనుగోలు పరిమాణంలో తగ్గుదల కనిపించినప్పటికీ ఆకాశాన్నంటిన ధరల కారణంగా విలువ రూపంలో బంగారం వాణిజ్యం సరికొత్త రికార్డు సృష్టించింది. ఈ ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో పసిడి వినియోగ విలువ గతేడాదితో పోలిస్తే ఏకంగా 50 శాతం పెరిగి రూ.1,98,100 కోట్లకు చేరింది. 2025 క్యూ2లో ఇది రూ.1,32,500 కోట్లుగా ఉంది. భౌతిక పరిమాణం తగ్గినా భారతీయుల పెట్టుబడి పోర్ట్‌ఫోలియోలో పసిడికే ప్రథమ స్థానం దక్కుతోందని డబ్ల్యూజీసీ భారత ప్రాంతీయ సీఈఓ సచిన్ జైన్ పేర్కొన్నారు.

ఆభరణాల విక్రయాలపై దెబ్బ.. కారణాలివే..

డబ్ల్యూజీసీ సమాచారం ప్రకారం, అత్యధిక క్షీణత ఆభరణాల (జువెల్లరీ) విభాగంలోనే నమోదైంది. క్యూ2లో ఆభరణాల డిమాండ్ 15 శాతం తగ్గి 75.1 టన్నులకు (గతేడాది 88.8 టన్నులు) పరిమితమైంది. దీనికి ప్రధాన కారణాలు..

  • పసిడి ధరలు నిరంతరం రికార్డు స్థాయిలో హెచ్చుతగ్గులకు లోనుకావడం, వినియోగదారులు వేచి చూసే ధోరణి అవలంబించడం.

  • దిగుమతి సుంకం పెంపు ప్రభావంతో దేశీయ మార్కెట్‌లో రీటైల్ ధరలు మరింత పెరిగాయి.

  • సుంకాలు పెరగడంతో అక్రమ రవాణా పెరిగిపోతోందని, ఇది అధికారిక బులియన్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతోందని నివేదిక ఆందోళన వ్యక్తం చేసింది.

కోలుకునే అవకాశం!

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ అంచనా ప్రకారం ఈ ఏడాది మొత్తానికి భారత్‌లో పసిడి డిమాండ్ 650-750 టన్నుల మధ్య నమోదుకావచ్చు. రాబోయే పండుగల సీజన్‌లో (దసరా, దీపావళి) ధరలు కొంత సద్దుమణిగితే బంగారం కొనుగోళ్లు తిరిగి పుంజుకుని మార్కెట్ పూర్వ వైభవాన్ని సంతరించుకునే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Videos

BIG Question: ఉప్పొంగిన ఉత్తరాంధ్ర.. జనసంద్రం పోటెత్తితే ఎలా ఉంటుందో తెలుసా?

పాతపట్నం MLA కారు యాక్సిడెంట్ కేసులో మీరు ఏం చేశారు..

BCCI నుంచి వైభవ్‌కు బిగ్ గిఫ్ట్.. వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్!

YS జగన్ శ్రీకాకుళం టూర్ పై పబ్లిక్ రియాక్షన్

బుర్ర పనిచేస్తుందా బాబు? CPR ఎందుకు చేస్తాడు.. బాబుకు జగన్ కౌంటర్

సీదిరి అప్పలరాజుని నాశనం చేయడం కోసం... జగన్ సంచలన కామెంట్స్

సీదిరి అక్రమ అరెస్ట్ పై YS జగన్ రియాక్షన్

జగన్ కీలక ప్రెస్ మీట్ @శ్రీకాకుళం

అంపోలు జైలు వద్ద YS జగన్ ప్రెస్ మీట్

జగన్ అభిమానులపై పోలీసులు లాఠీ ఛార్జ్

Photos

+5

పారిస్ ట్రిప్‌లో ‘సర్జా సిస్టర్స్’.. అర్జున్‌ చిన్న కూతురు ఫోటోలు వైరల్‌

+5

వైఎస్‌ జగన్‌ రాకతో ఉత్తరాంధ్ర జనసంద్రం (ఫొటోలు)

+5

ఒక శకం ముగిసింది.. అంతర్జాతీయ క్రికెట్‌కు రహానే గుడ్‌బై..(ఫొటోలు)

+5

ఈ చిన్నారే.. ఇప్పుడు ట్రెండింగ్‌ స్టార్‌! వెంకీ మామ కూతురి క్యూట్‌ (ఫొటోలు)

+5

చిరునవ్వుతో అభిమానులను ఫిదా చేసిన అనుపమ పరమేశ్వరన్ (ఫొటోలు)

+5

ట్రెడిషనల్ లుక్‌లో కట్టిపడేసిన అందాల భామ రజిష విజయన్ (ఫొటోలు)

+5

అప్సరసలా దివ్యమైన రూపంతో మెరిసిన శోభిత ధూళిపాళ (ఫొటోలు)

+5

హైదరాబాద్ : రవీంద్రభారతిలో ఇది.. అందెల రవళి (ఫొటోలు)

+5

హైదరాబాద్ : అంతర్జాతీయ పులుల దినోత్సవం...అదిగో పులి (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌