డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?
Breaking News
నెలకు రూ.2 లక్షల జీతం.. అయినా పేదవాడినే!
Published on Mon, 07/27/2026 - 14:54
డబ్బు ఎక్కువగా ఉంటే.. జీవితంలో ఎలాంటి సమస్యలు ఉండవని చాలామంది భావిస్తారు. కానీ.. మనసులో ఉండే భయం, చిన్నప్పటి అనుభవాలు, బాధ్యతలు కూడా మన సంతోషాన్ని ప్రభావితం చేస్తాయనేది నిజం. దీనికి బెంగళూరులో నివసిస్తున్న 26 ఏళ్ల టెకీ కథ మంచి ఉదాహరణ.
రెడ్దిట్ పోస్టులో వైరల్ అవుతున్న సమాచారం ప్రకారం.. బెంగళూరులో నివసిస్తున్న యువకుడు ప్రస్తుతం నెలకు రూ.2 లక్షలు సంపాదిస్తున్నాడు. అతనికి ఎలాంటి అప్పులు లేవు. అయినప్పటికీ.. తాను ఇప్పటికీ పేదవాడిననే భావనతో జీవిస్తున్నానని తన మనసులో మాట చెప్పాడు.
చిన్నప్పటి నుంచి అతని కుటుంబం చాలా పేదరికంలో జీవించింది. వారి కుటుంబ ఆదాయం నెలకు రూ.6,000 నుంచి రూ.7,000 మాత్రమే ఉండేది. ఒక చిన్న 10×10 గదిలో అందరూ ఉండేవారు. ఆ రోజుల్లో డబ్బు కోసం పడిన కష్టాలు అతని మనసులో బలంగా నాటుకుపోయాయి. అందుకే.. మంచి ఉద్యోగం సంపాదించి తన కుటుంబ జీవితాన్ని మార్చాలనే లక్ష్యంతో కష్టపడ్డాడు.
2021లో ఉద్యోగం వచ్చిన తర్వాత తన తల్లిదండ్రులను పని చేయనివ్వకుండా ఇంట్లోనే విశ్రాంతిగా ఉండేలా చేశాడు. వారికోసం స్వగ్రామంలో ఒక డబుల్ బెడ్ రూమ్ ఇల్లు అద్దెకు తీసి ఇచ్చాడు. తాను ఉండటానికి బెంగళూరులో ఒక 2BHK అద్దెకు తీసుకున్నాడు. ప్రతి నెలా తల్లిదండ్రులకు రూ.15,000 నుంచి రూ.20,000 పంపిస్తున్నాడు.
అతను సంపాదించిన డబ్బును చాలా జాగ్రత్తగా ఖర్చు చేస్తున్నాడు. ప్రతి నెలా రూ.30,000 మ్యూచువల్ ఫండ్స్‌లో, రూ.10,000 ఫిక్స్‌డ్ డిపాజిట్‌లో, మరో రూ.10,000 బంగారం కోసం దాస్తున్నారు. ఇప్పటివరకు స్టాక్స్, FDలు, బంగారం, బ్యాంక్ పొదుపులతో మంచి మొత్తాన్ని కూడబెట్టాడు. స్కూటర్, మ్యాక్ బుక్, ఫోన్ వంటి అవసరమైనవి కొనుగోలు చేశాడు. తల్లిదండ్రుల ఇంటికి అవసరమైన ఫర్నిచర్, ఇతర పరికరాలను కూడా కొనిచ్చాడు.
#Rant, Feeling poor: Earning ₹2l a month with ₹0 dept
by u/Cautious-Table158 in FinancialAdviceIndia
అయినా.. కూడా అతనికి తాను ధనవంతుడిననే భావన రాలేదు. ఈ ఏడాది పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు. పెళ్లికి కనీసం రూ.10 లక్షలు ఖర్చవుతాయని భావిస్తున్నాడు. అదనంగా ఒక కారు, స్వగ్రామంలో స్థలం, ఒక బైక్ కొనాలని కూడా ఉంది. కానీ ఒకటి ఎంచుకుంటే.. మరొకటి చేయలేనేమో అనే భయం అతనిని ఎప్పుడూ వెంటాడుతోంది.
అతని బాధలో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. సొంత ఊరిలో ఆటో డ్రైవర్లు, కూలీలుగా పనిచేసే స్నేహితులు తనకంటే తక్కువ సంపాదించినా చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. వారు అప్పులు తీసుకుని తమకు నచ్చిన వస్తువులు కొనుగోలు చేస్తూ జీవితాన్ని ఆస్వాదిస్తున్నారు. కానీ నేను మాత్రం రూ.750 కంటే ఎక్కువ ధర ఉన్న చొక్కా కొనాలన్నా చాలా సార్లు ఆలోచిస్తున్నానని చెప్పాడు. డబ్బు ఉన్నా ఖర్చు చేయడానికి భయపడటం అతని మనసులోని అసురక్షిత భావాన్ని చూపిస్తుంది.
ఈ పోస్ట్ చూసిన చాలా మంది రెడ్దిట్ వినియోగదారులు అతనికి ధైర్యం చెప్పారు. చిన్నప్పుడు పేదరికంలో పెరిగిన వారికి, తర్వాత ఎంత డబ్బు వచ్చినా 'రేపు ఏమవుతుందో?' అనే భయం పోవడం కష్టం అని వివరించారు. అతను ఇప్పటివరకు సాధించిన విజయాలను గుర్తు చేసుకుని తనపై తాను గర్వపడాలని సూచించారు. అలాగే తొందరపడి పెద్ద రిస్క్‌లు తీసుకోవద్దని, ఓపికగా పెట్టుబడులు పెడితే భవిష్యత్తులో ఇంకా మంచి స్థితికి చేరుకుంటారని సలహా ఇచ్చారు.
Tags : 1