Breaking News

కేంద్ర విద్యాశాఖ మంత్రికి జీతం ఎక్కువా?

Published on Mon, 07/27/2026 - 14:07

నీట్-యూజీ 2026 ప్రశ్నాపత్రం లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతో విద్యాశాఖ మంత్రి పదవికి సంబంధించిన జీతభత్యాలు, అధికారిక సౌకర్యాలపై ఆసక్తి నెలకొంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన రాజీనామాను ఆమోదించగా, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి విద్యాశాఖ అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కేంద్ర విద్యాశాఖ మంత్రి కేబినెట్ హోదా కలిగిన మంత్రి. అదే సమయంలో లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యుడిగా కూడా ఉంటారు. అందువల్ల పార్లమెంట్ సభ్యులకు వర్తించే వేతనం, భత్యాలతో పాటు కేంద్ర మంత్రులకు ప్రత్యేకంగా లభించే అధికారిక సౌకర్యాలు కూడా పొందుతారు.

జీత భత్యాలు ఇవే..
ప్రస్తుతం పార్లమెంట్ సభ్యుడిగా నెలకు రూ.1 లక్ష ప్రాథమిక వేతనం లభిస్తుంది. దీనికి అదనంగా నియోజకవర్గ భత్యం రూ.70,000, కార్యాలయ వ్యయాల కోసం రూ.60,000 అందుతాయి. పార్లమెంట్ లేదా దాని కమిటీల సమావేశాలకు హాజరయ్యే ప్రతి రోజుకు రూ.2,000 రోజువారీ భత్యం చెల్లిస్తారు. ఇవి పార్లమెంట్ సభ్యులకు వర్తించే నిబంధనల ప్రకారం అందే ప్రయోజనాలు.

కేబినెట్ మంత్రిగా లభించేవి..
కేబినెట్ మంత్రిగా విద్యాశాఖ మంత్రికి న్యూఢిల్లీలోని లుటియెన్స్ జోన్‌లో ప్రభుత్వ బంగ్లా కేటాయిస్తారు. ఈ నివాసానికి అద్దె చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఇంటి నిర్వహణ, అధికారిక అవసరాల కోసం కావాల్సిన మౌలిక సదుపాయాలను ప్రభుత్వం కల్పిస్తుంది.

అలాగే అధికారిక వినియోగం కోసం ప్రభుత్వ వాహనం, డ్రైవర్, ఇంధన సౌకర్యం అందుబాటులో ఉంటుంది. భద్రతా సంస్థల ముప్పు అంచనాల ఆధారంగా వ్యక్తిగత భద్రతా సిబ్బంది, ఎస్కార్ట్ వాహనాలు వంటి భద్రతా ఏర్పాట్లు కూడా కల్పిస్తారు.

ప్రభుత్వ విధుల నిర్వహణలో భాగంగా దేశవ్యాప్తంగా అధికారిక విమాన ప్రయాణాలు, ఫస్ట్ ఏసీ రైలు ప్రయాణాలకు అర్హత ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (CGHS) కింద మంత్రి, ఆయనపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు వైద్య సదుపాయాలు లభిస్తాయి.

మంత్రి కార్యాలయ నిర్వహణ కోసం వ్యక్తిగత సహాయకులు, కార్యదర్శులు, ఇతర సిబ్బందిని ప్రభుత్వం నియమిస్తుంది. అధికారిక నివాసం, కార్యాలయంలో టెలిఫోన్, ఇంటర్నెట్, కమ్యూనికేషన్ వంటి అన్ని అవసరమైన సౌకర్యాలను కూడా ప్రభుత్వం సమకూరుస్తుంది.

అయితే, కేంద్ర విద్యాశాఖ మంత్రికి ప్రత్యేకంగా వేరే జీతం ఉండదు. ఆయన కేబినెట్ మంత్రి హోదాలో ఉండటం వల్ల కేంద్ర మంత్రులందరికీ వర్తించే వేతనం, పార్లమెంట్ సభ్యుల భత్యాలు, అధికారిక సౌకర్యాలనే పొందుతారు.

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)