Breaking News

ఫ్లైట్‌ జర్నీలో ఫేస్‌ షీట్‌మాస్క్‌తో త్రిష..ఇది మంచిదేనా?

Published on Sun, 07/26/2026 - 15:27

చర్మసంరక్షణ అనేది కేవలం ఉదయం లేదా సాయంత్రం దినచర్యకు మాత్రమే పరిమితం కాదు. ఎప్పుడు, ఎక్కడ ఉపయోగిస్తున్నారు, పరిసరాలు, ఆహారం వంటి వాటిపై కూడా ఆధారపడి ఉంటుందట. జస్ట్‌ ఇంట్లోనే సీరమ్‌లు, మాయిశ్చరైజర్‌లు, మాస్క్‌లు, సన్‌స్క్రీన్‌లు వంటి చర్మసంరక్షణ చర్యలు పరిమితం కాదని అంటున్నారు నిపుణులు. విమాన ప్రయాణాల్లో కూడా చర్మ సంరక్షణ తప్పనిసరని చెబుతున్నారు.

ఇటీవల నటి త్రిష కృష్ణన్ విమానంలో షీట్ మాస్క్‌తో కనిపించిన ఒక రీల్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇలా ప్రియాంక చోప్రా వంటి అనేకమంది సెలబ్రిటీలు గతంలో మాస్క్‌తో తమ సెల్ఫీలను పోస్ట్‌ చేశారు  కూడా. ఇలా ఫ్లైట్‌జర్నీలో ఫేస్‌ మార్క్‌షీట్‌లు ఉపయోగించడం తప్పనిసరా? అంటే..

విమాన ప్రయాణాలలో షీట్ మాస్క్‌లను ఉపయోగించడం సురక్షితమేనని చెబుతున్నారు డెర్మటాలజిస్టులు. అయితే ముఖానికి వేసుకునే మాస్క్ రకంపై శ్రద్ధ వహించాలని తెలిపారు. ముఖ్యంగా విమానం క్యాబిన్ లోపల ఉండే పొడి వాతావరణంలో, హైడ్రేటింగ్ షీట్ మాస్క్‌లు లేదా జెల్ ఆధారిత మాస్క్‌లు చర్మానికి తాత్కాలికంగా తేమను అందిస్తాయని అన్నారు. 

హైలురోనిక్ యాసిడ్, సెరామైడ్స్, గ్లిజరిన్, అలోవెరా, పాంథెనాల్ వంటి పదార్థాలు ఉన్న మాస్క్‌లను ఉపయోగించాలని సూచిస్తున్నారు. ప్రయాణ సమయంలో ఎక్స్‌ఫోలియేటింగ్ రసాయనాలు, చార్‌కోల్ మాస్క్‌లు, బలమైన క్రియాశీల పదార్థాలు, పీల్-ఆఫ్ మాస్క్‌లు, క్లే మాస్క్‌లను ఉపయోగించవద్దని ఈ చర్మవ్యాధి నిపుణురాలు సలహా ఇచ్చారు.

కలిగే లాభాలు..

ఇది చర్మానికి తేమను అందించి, పొడిబారకుండా చేస్తుంది. 

చర్మం బిగుతుగా ఉందన్న భావనను తగ్గిస్తుంది. 

అలాగే చర్మాన్ని మృదువుగా, సౌకర్యవంతంగా ఉంచుతుంది. 

విమానం క్యాబిన్‌లోని తక్కువ తేమ వల్ల డీహైడ్రేషన్‌ బారిన పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇలాంటివి చర్మసంరక్షణకు ఎంతో మంచివి. 

అలాగే వాటిపై సూచించిన విధంగా అన్ని నిమిషాలే ఉంచాలని, ఆ తర్వాత మిగిలిని సీరమ్‌ చర్మంలోకి వెళ్లేలా సున్నితంగా మసాజ్‌ చేయాలని అంటున్నారు. దీంతోపాటు రెండు చుక్కల ఫేషియల్ సీరమ్‌ను అప్లై చేసి, ఆ తర్వాత మాయిశ్చరైజర్‌ను వాడితో మంచిది. 

ఎవరికి మంచిది కాదంటే..
ఏమైనా చర్మ సమస్యలు ఉంటే ఉపయోగించకపోవడమే మంచిది. 
సున్నితమైన చర్మం ఉన్నవారు షీట్ మాస్క్‌ల జోలికి వెళ్లకపోవడమే మంచిది
అలాంటి వాళ్లు మాయిశ్చరైజర్‌ను మాత్రమే ఉపయోగిస్తే ఫలితం ఉంటుంది.

చివరగా విమాన ప్రయాణంలో ఇలాంటి చర్మ సంరక్షణ దినచర్య కొంచెం అదనంగా అనిపించవచ్చు, కానీ ఇది  చర్మాన్ని చికాకు, చర్మ సమస్యలు, పర్యావరణ కారకాల నుంచి రక్షించడంలో సహాయపడుతుందని చెబుతున్నారు చర్మ వ్యాధి నిపుణులు.

(చదవండి: అరుదైన 'మెదడు'ని పోలిన తల చర్మ వ్యాధి..! చివరికి లైఫ్‌నే..)

 

Videos

డీఏస్సీ స్కామ్ లో సీబీఐ ఎంక్వైరీ..? తక్షణమే లోకేష్ రాజీనామా..?

రంగనాథ్‌పై TG హైకోర్టు కీలక ఆదేశాలు

సీనియర్స్ కే ఆ అర్హత దక్కాలి వాళ్ళ తర్వాతే నేను

విజయవాడలో టెన్షన్ టెన్షన్.. ఔట్ సోర్సింగ్ కార్మికుల కన్నెర్ర..

పెద్దిని పరామర్శించిన KCR

దేవినేని ఉమాను కలిస్తే తప్పేంటి..? నోరు తెరిస్తే తట్టుకోలేవు..

మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని వైఎస్సార్సీపీ డిమాండ్

గుడ్ న్యూస్.. వచ్చే మూడు రోజుల్లో భారీ వర్షాలు..

పవన్ కళ్యాణికి బిగ్ షాక్ జనసేనపై తిరగబడ్డ Gen-Z

భారీగా పెరిగిన బంగారం ధరలు.. 10 గ్రాముల ధర మరీ ఇంతనా? తాజా రేట్లు చూసి షాక్ అవుతారు!

Photos

+5

'మహేంద్రగిరి వారాహి' టీజర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

గర్ల్‌ఫ్రెండ్‌తో టీమిండియా క్రికెటర్‌ అర్ష్‌దీప్‌ సింగ్‌ (ఫొటోలు)

+5

మీనాక్షి చౌదరి అమెరికా ట్రిప్.. ఎంత ముద్దుగా ఉందో? (ఫొటోలు)

+5

ఏపీ : విశాఖపట్నం దగ్గరలో అద్భుతమైన జలపాతం... ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ నటుడు గుర్తున్నాడా..? ఆయన కూతురు మనవి ఇప్పుడు క్రేజీ హీరోయిన్.. (ఫొటోలు)

+5

డాక్టర్‌ సతీశ్‌రెడ్డికి 'ఛేంజ్‌ మేకర్‌' పురస్కారం అందజేసిన చిరంజీవి (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తి : ధర్మరాజులస్వామి ఆలయంలో శాస్తోక్తంగా అగ్నిగుండ మహోత్సవం (ఫొటోలు)

+5

'శ్రీనివాస మంగాపురం' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

విజ‌య‌వాడ దుర్గ‌మ్మ‌కు తెలంగాణ బోనాలు (ఫోటోలు)

+5

నేచర్ ఎంజాయ్ చేస్తోన్న టాలీవుడ్ నటి అనసూయ (ఫోటోలు)